ఏం మాయ చేశావే విండ్సర్.. కంపెనీ ఫుల్ ఖుషీగా ఉందంటే నీ వల్లే.. ఎంజీ అమ్మకాల్లో కొనసాగిన జోరు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తూ ఎంజీ మోటార్ దూసుకుపోతోంది. ZS EVతో మొదలైన ఈ ప్రయాణం ఆ తర్వాత కామెట్ (Comet), విండ్‌సర్ (Windsor) రాకతో ఊహించని మలుపు తిరిగింది. ఒకప్పుడు డీలా పడిన అమ్మకాలను ఈ రెండు మోడళ్లే చక్కదిద్దాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
JSW గ్రూప్, SAIC మోటార్ ఇండో-చైనీస్ జాయింట్ వెంచర్ అయిన JSW MG మోటార్స్ గత నెలలో భారతదేశంలో దాదాపు 6,000 కార్లను విక్రయించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న భారీ డిమాండ్ కారణంగా కంపెనీ అమ్మకాల్లో వృద్ధి సాధిస్తోంది. 2025 ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలే దీనికి నిదర్శనం. 2024 ఏప్రిల్‌లో విక్రయించిన 4,725 వాహనాలతో పోలిస్తే, గత నెలలో కంపెనీ ఏకంగా 5,829 కార్లను విక్రయించింది.

అంటే వార్షిక అమ్మకాలలో 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం ఎంజీ మోటార్స్‌కు భారతదేశంలో 6 మోడళ్లు ఉన్నాయి. వాటిలో సగం ఎలక్ట్రిక్ వాహనాలు కావడం విశేషం. కామెట్ ఈవీ, ఆస్టర్, విండ్‌సర్ ఈవీ, హెక్టార్, జెడ్ ఎస్ ఈవీ, గ్లోస్టర్ అనేవి ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడళ్లు. రాబోయే నెలల్లో కంపెనీ ఈ శ్రేణిని 9 మోడళ్లకు విస్తరించనుంది.
ఇందులో భాగంగానే మెజిస్టర్, సైబర్‌స్టర్, ఎం9 అనే మూడు కొత్త మోడళ్లను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది మాత్రమే కాదు, ఎంజీ విండ్‌సర్ ఈవీ సరికొత్త వెర్షన్ - విండ్‌సర్ ప్రో - మే 6న విడుదల కానుంది. పెరుగుతున్న టెక్నాలజీ వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ వేరియంట్‌లో మరిన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఈ అప్‌డేట్‌లో భాగంగా విండ్‌సర్ ప్రోలో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సూట్‌ను కూడా అందించే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్‌లోని ప్రధాన హైలైట్ ఏమిటంటే.. ఇది మెరుగైన రేంజ్‌ను అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న విండ్‌సర్ ఈవీలో 38 kWh బ్యాటరీ ప్యాక్ ఉండగా, కొత్త వెర్షన్‌లో 50.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించనున్నారు.
దీని ద్వారా ఈ ఎలక్ట్రిక్ కారు ఒక్క ఛార్జ్‌పై దాదాపు 425 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని అంచనా. అయితే, బ్యాటరీ ప్యాక్ మారినప్పటికీ పర్ఫామెన్స్ గణాంకాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుత విండ్‌సర్ ఈవీలో ఉన్న 134 bhp పవర్, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌నే ఇందులో కూడా కొనసాగించనున్నారు.

బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌లో కొనుగోలు చేస్తే ప్రస్తుత విండ్‌సర్‌కు 10 లక్షల నుండి 12 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా, మీరు ప్రయాణించే ప్రతి కిలోమీటర్‌కు డబ్బు చెల్లించవచ్చు. అదే సమయంలో, మీరు బ్యాటరీని కూడా కొనుగోలు చేస్తే కారు ధర 14 లక్షల నుండి 16 లక్షల వరకు ఉంటుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల 45kW DCఛార్జర్ ద్వారా 55నిమిషాల్లో 10నుంచి 80శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. విండ్‌సర్ ఎలక్ట్రిక్ కారుతో పాటు స్టాండర్డ్‌గా పోర్టబుల్ ఛార్జర్‌ను అందిస్తున్నారు. అయితే, వినియోగదారుల కోసం వాల్ బాక్స్ ఛార్జర్ ఆప్షన్‌ను కూడా కంపెనీ అందుబాటులో ఉంచింది. ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ వాహనమైన విండ్‌సర్ చూడటానికి పెద్ద హ్యాచ్‌బ్యాక్‌లా ఉన్నప్పటికీ, ఇది ఒక ఎంపీవీ లాంటి మంచి స్పేస్, వినియోగాన్ని అందిస్తుంది.

దీనికి తోడు బిజినెస్ క్లాస్ తరహా ప్రయాణ సౌకర్యం ఉండటంతో ఇది వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, TPMS, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లతో కూడిన 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లను కూడా కంపెనీ అందిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








