కొత్త హ్యుందాయ్ వెన్యూలో ఈ వేరియంట్ బెస్ట్.. తక్కువ ధరలో అదిరిపోయే టెక్నాలజీ ఫీచర్స్ ఇవే!
ఇటీవల విడుదలైన సరికొత్త హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) కార్లు ప్రస్తుతం షోరూమ్‌లకు రావడం మొదలుపెట్టాయి. సరికొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్స్‌తో మార్కెట్లోకి వచ్చిన కొత్త హ్యుందాయ్ వెన్యూ పై చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెన్యూ ఎస్‌యూవీ (Venue SUV) సిరీస్‌లో మధ్య శ్రేణి వేరియంట్‌గా (Mid-level Variant) ఉన్న HX5 వేరియంట్ గురించి ప్రస్తుతం కస్టమర్లలో చాలా ఆసక్తి నెలకొంది. తక్కువ ధరలో, డ్రైవింగ్‌కు అవసరమైన అన్ని ముఖ్యమైన టెక్నాలజీ ఫీచర్లను అందిస్తున్న ఈ HX5 వేరియంట్‌ను కొనడం సరైన నిర్ణయమని నిపుణులు అంటున్నారు. మరికొద్దిగా ఎక్కువ ధరలో లభించే ఈ HX5 వేరియంట్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? ఇంజిన్ ఆప్షన్స్ ఏమిటి? తెలుసుకుందాం.
ది కార్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫోటోల ప్రకారం.. వెన్యూ ఎస్‌యూవీ మీడియం రేంజ్ వేరియంట్ అయిన HX5 కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌తో బ్యాలెన్సుడ్‌గా కనిపిస్తుంది. ఇందులో హాలొజెన్ హెడ్‌ల్యాంప్‌లు, సిల్వర్ ఇన్‌సర్ట్‌లు, LED డే టైం రన్నింగ్ లైట్లు (DRL) ఉన్నాయి.

వెనుకవైపు ఎత్తులో అమర్చిన LED స్టాప్ లైట్, LED టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. అయితే, టాప్ వేరియంట్లలో ఉండే LED టర్న్ ఇండికేటర్లు, ORVM లపై ఉండే టర్న్ ఇండికేటర్లు ఈ HX5లో లేవు. ఈ కారు 15 అంగుళాల స్టీల్ వీల్స్‌పై సీట్ టైర్లతో, వీల్ కవర్లతో వస్తుంది. HX5 వేరియంట్‌లో లేని కొన్ని ఫీచర్లలో వెనుక వైపర్, వాషర్, కనెక్టెడ్ టెయిల్ లైట్స్ ఉన్నప్పటికీ ఇందులో చాలా ముఖ్యమైన టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి.
కారు లోపలి భాగం గ్రే కలర్ థీమ్‌తో ఉంటుంది. ఇందులో హైట్ అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్స్, మ్యాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్ సౌకర్యంతో కూడిన స్మార్ట్ కీ ఉన్నాయి. ముఖ్యంగా 26.03 సెం.మీ (10.25 అంగుళాలు) ccNC ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 10.66 సెం.మీ కలర్ TFT డిస్‌ప్లేతో కూడిన డిజిటల్ క్లస్టర్ ఇందులో ఉన్నాయి. సన్‌రూఫ్ సౌకర్యం ఉండటం ఈ వేరియంట్‌కు అదనపు ఆకర్షణ.

సేఫ్టీ విషయాలకు వస్తే.. అంశాలకు వస్తే, హ్యుందాయ్ వెన్యూ HX5 వేరియంట్‌లో టాప్-ఎండ్ వేరియంట్‌లో ఉండే లెవెల్-2 ADAS (Advanced Driver Assistance System) ఫీచర్ లేదు. అయితే, ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ABS, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), నాలుగు డిస్క్ బ్రేక్‌లతో సహా అనేక స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
హ్యుందాయ్ వెన్యూ HX5 వేరియంట్ నాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజిన్ అనే మూడు రకాల ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 1.2 లీటర్ నాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 82 హార్స్ పవర్, 114 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) కన్ఫాం చేసిన ప్రకారం లీటరుకు18.5 కిమీ మైలేజ్ ఇస్తుంది.

అదే సమయంలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 118 హార్స్ పవర్, 172 Nm టార్క్‌ను అందిస్తుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. దీని మైలేజ్ లీటరుకు 18.75/ 20 కిమీ. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 114 హార్స్ పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభిస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 20.99 / 17.9 కిమీ.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ కార్ల బుకింగ్‌లు రూ.25,000 అడ్వాన్స్ పేమెంట్‌తో జరుగుతున్నాయి. ఆ విధంగా వెన్యూ HX5 వేరియంట్‌ను బుక్ చేసుకోవచ్చు. అద్భుతమైన డిజైన్, ప్రీమియం టెక్నాలజీ ఫీచర్లతో పాటు తక్కువ ధరలో కొత్త వెన్యూ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి HX5 సరైన ఆప్షన్ అవుతుంది.


Click it and Unblock the Notifications








