మధ్యతరగతి ఫేవరెట్ కారు ధర భారీగా తగ్గింది.. బంగారం లాంటి కారు.. కొత్త ధరలు ఇవే

మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis) మధ్యతరగతి కుటుంబాలకు అనువైన, అందుబాటులో ఉండే, ఆకర్షణీయమైన కారు. ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ భారతీయ రోడ్ల పరిస్థితులకు సరిపోయేలా రూపొందించబడింది. చిన్న సైజ్‌లో ఉన్నప్పటికీ, దీని డిజైన్, ప్రదర్శన, ఫీచర్లు అన్నీ పెద్ద కార్లను తలపించేలా ఉంటాయి. ముఖ్యంగా నగరాల్లో తరచుగా డ్రైవ్ చేసే వారికి ఇది ఒక సరైన ఎంపికగా నిలుస్తోంది. ఇటీవల వస్తువులు, సేవల పన్ను(GST) రేట్లను ప్రభుత్వం సవరించిన తర్వాత ఈ కార్ ధరల్లో గణనీయమైన మార్పు వచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త GST రేట్లు అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ మార్పుతో మారుతి సుజుకి ఇగ్నిస్‌పై రూ.71,300 వరకు భారీగా ధర తగ్గింది. అంటే, ఇప్పుడు ఇదే కారును ముందంటే కంటే మరింత తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది.

మధ్యతరగతి కస్టమర్లకు ఇది ఒక గోల్డెన్ అవకాశం అని చెప్పాలి. పండుగల సీజన్ మొదలైన ఈ సమయంలో కుటుంబంతో కలిసి కొత్త కారును ఇంటికి తీసుకెళ్లాలని అనుకునే వారికి ఇగ్నిస్ సరైన ఎంపికగా ఉంటుంది. ఇది మారుతి సుజుకి నెట్‌వర్క్‌లో సులభంగా లభిస్తుంది కాబట్టి, సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ లభ్యతలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పలు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తున్నఈ ధరల గురించి కింద చూద్దాం.

Middle Class Best Car Maruti Suzuki Ignis Variants Wise New Price After Gst Rate Cut

ప్రతి వేరియంట్‌ కూడా వేర్వేరు అవసరాలు, బడ్జెట్‌ కలిగిన కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను కేవలం లుక్‌కోసం మాత్రమే కాదు, దాని ప్రాక్టికల్ ఫీచర్లు, డ్రైవింగ్ సౌకర్యం, సులభమైన నిర్వహణ ఖర్చుల కోసం కూడా చాలా మంది ఎంచుకుంటున్నారు. ప్రారంభ స్థాయి సిగ్మా (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్ ధర కేవలం రూ.5.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఇది కొత్తగా కారు కొనాలనుకునే మధ్యతరగతి కస్టమర్లకు సరైన ఎంపిక. తర్వాతి వేరియంట్ డెల్టా (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), దీని ధర రూ.5.84 లక్షలు కాగా, అదే వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ డ్యూయల్-టోన్ ఎంపికను కోరేవారికి ధర రూ.6.29 లక్షలు. ఇక జీటా (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) డ్యూయల్-టోన్ వేరియంట్ ధర రూ.6.50 లక్షలు కాగా, దీని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రూపం రూ.6.95 లక్షలకు లభిస్తుంది.

Middle Class Best Car Maruti Suzuki Ignis Variants Wise New Price After Gst Rate Cut

హై-ఎండ్ వేరియంట్‌గా ఉన్న ఆల్ఫా (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) డ్యూయల్-టోన్ ధర రూ.7.10 లక్షలు కాగా, అత్యున్నత స్థాయి ఆల్ఫా (ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) డ్యూయల్-టోన్ వేరియంట్ ధర రూ.7.55 లక్షలు(ఎక్స్-షోరూమ్). ప్రతి వేరియంట్‌లోనూ మారుతి సుజుకి నాణ్యత, విశ్వసనీయత, వినియోగదారుడి సౌకర్యంపై దృష్టి పెట్టింది. స్టైలిష్ లుక్, సిటీ డ్రైవ్‌కు అనుకూలమైన సైజు, ఇప్పుడు GST తగ్గింపుతో వచ్చిన ధరల కారణంగా ఇది మధ్యతరగతి కుటుంబాలకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ కేవలం డిజైన్ పరంగానే కాకుండా, పనితీరు పరంగానూ తన తరగతిలో అగ్రగామిగా నిలుస్తోంది. కొత్త ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది, ఇది శక్తివంతమైనదిగా, ఇంధన సమర్థతలో అద్భుతంగా నిలుస్తుంది. ఈ ఇంజిన్ సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవే డ్రైవింగ్‌లోనూ సమతుల్యమైన పనితీరును అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ (AMT) ట్రాన్స్‌మిషన్‌లలో లభిస్తుంది.

Middle Class Best Car Maruti Suzuki Ignis Variants Wise New Price After Gst Rate Cut

డ్రైవింగ్ సౌకర్యం, స్మూత్ గేర్ షిఫ్టింగ్, తక్కువ ఇంధన వినియోగం కోరుకునే వారికి ఈ రెండు ఆప్షన్లు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. మైలేజ్ సామర్థ్య పరంగా కూడా ఇగ్నిస్ తన తరగతిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇది 21 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది, అంటే రోజువారీ ప్రయాణాలకు ఇది అత్యంత ఆర్థికంగా ఉండే కారు అని చెప్పాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 8, 2025, 9:23 [IST]
English summary
Middle class best car maruti suzuki ignis variants wise new price after gst rate cut
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+