రూ.6లక్షలకే బైక్ ఇచ్చే మైలేజ్..లగ్జరీ కారు ఫీచర్లు.. అందుకే తెగ కొనేస్తున్న జనాలు
మారుతి సుజుకి డిజైర్ అంటే నమ్మకానికి, స్టైల్‌కి, మంచి పర్ఫామెన్స్‌కు మారుపేరు. దాని ఆకర్షణీయమైన డిజైన్, మంచి మైలేజ్, అందుబాటు ధరలతో ఇది ఎంతో మంది మనసు గెలుచుకుంది. అందుకే ఎప్పుడూ మంచి సంఖ్యలో అమ్ముడవుతూ ఉంటుంది. తాజాగా, జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల రిపోర్ట్ వచ్చింది.
అందులో మన డిజైర్ రెండో స్థానంలో నిలిచి, 15,484 యూనిట్లను అమ్ముడుపోయింది. అయితే, హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ మాత్రం 15,786 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో ఉంది. ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో కూడా మారుతి డిజైర్ సెడాన్ భారీ సంఖ్యలో అమ్ముడయ్యింది. కస్టమర్లు పోటీపడి మరీ ఈ కారును కొనుగోలు చేశారు.

అందుకు తగ్గట్టుగానే మే నెలలో 18,084, ఏప్రిల్‌లో 16,996, మార్చిలో 15,460, ఫిబ్రవరిలో 14,694, జనవరిలో 15,383 యూనిట్లు విజయవంతంగా అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే ప్రతి నెలా సగటున 15,000 డిజైర్ కార్లు అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది. ఇది డిజైర్ ఎంత ప్రజాదరణ పొందిందో చూపిస్తుంది.
ఇదొక కాంపాక్ట్ సెడాన్, బడ్జెట్ ధరలోనూ దొరుకుతుంది. ఈ కారు కనీసం రూ.6.84 లక్షల నుంచి గరిష్టంగా రూ.10.19 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్) ధరను కలిగి ఉంది. LXi, VXi, ZXi వంటి వివిధ వేరియంట్లలో ఇది లభిస్తుంది.

కొత్త డిజైర్ బయట నుంచి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. చూసే వాళ్ళను ఆకట్టుకుంటుంది. ఇందులో అద్భుతమైన LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే, గ్యాలెంట్ రెడ్, అల్లూరింగ్ బ్లూ వంటి రంగులలో కూడా ఇది అందుబాటులో ఉంది.
ఈ కారు ధరను బట్టి చూస్తే చాలా పవర్ఫుల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 1.2-లీటర్ Z సిరీస్ పెట్రోల్, CNG ఇంజిన్‌తో వస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ / 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఏ బైక్‌కు తీసిపోని విధంగా లీటరుకు 24.79 నుంచి 33.73కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది.

ఇందులో 5 సీటింగ్ కెపాసిటీ (5 సీట్ల సామర్థ్యం) ఉంది, ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి వీలుగా 382 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలుగా 37 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఈ కారు 2,450ఎంఎం వీల్‌బేస్ కలిగి ఉంది.
కొత్త మారుతి డిజైర్ క్యాబిన్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది, పదుల సంఖ్యలో ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, రేర్-సెంటర్ ఆర్మ్‌రెస్ట్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ ఉన్నాయి.
ఈ కారు ప్రయాణికులకు గరిష్ట స్థాయిలో రక్షణను అందిస్తుంది. సేఫ్టీ విషయంలో ఇది గ్లోబల్ ఎన్‌సిఎపి, భారత్ ఎన్‌సిఎపి నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ను పొందింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈఎస్‌సి, ఈబీడీ, 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మారుతి సుజుకి డిజైర్ కేవలం ఒక కారు కాదు, అది భారతీయ కుటుంబాలకు ఒక నమ్మకమైన భాగస్వామి. దాని మైలేజ్, భద్రత, ఫీచర్లు కలిపి ఈ కారును బెస్ట్ ఛాయిస్‌గా నిలుపుతున్నాయి. ముఖ్యంగా, ఈ ధరలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ రావడం చాలా గొప్ప విషయం. డిజైర్ అమ్మకాల్లో ఈ జోరు ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాం.


Click it and Unblock the Notifications








