మైండ్‌బ్లోయింగ్ స్పీడ్, అద్భుతమైన లుక్స్.. అందుకే వచ్చిన వెంటనే 150 కార్లు బుక్కయ్యాయి

వోక్స్‌వ్యాగన్ ఇండియా మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతుంది. మే 26, 2025న తమ పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTIని లాంచ్ చేయబోతోంది. భారతదేశంలో తమ ప్రొడక్ట్ లైనప్‌ను పెంచుకోవడానికి వోక్స్‌వ్యాగన్ ఎంత కట్టుబడి ఉందో ఈ లాంచ్‌తో స్పష్టమవుతోంది.

మే 5న బుకింగ్‌లు ప్రారంభమైన వెంటనే, మొదటి 150 వాహనాలు క్షణాల్లో బుక్ అయిపోయాయి అంటే, ఈ కారుపై జనాలకు ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. గోల్ఫ్ GTIని వోక్స్‌వ్యాగన్ పూర్తిగా తయారైన వాహనంగా (CBU) భారతదేశానికి తీసుకురాబోతోంది. అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఈ హ్యాచ్‌బ్యాక్ అసలు అనుభవాన్ని భారతీయ కస్టమర్లు పొందుతారన్నమాట.

Volkswagen

లాంచ్ ఈవెంట్ వరకు ధరల వివరాలను వోక్స్‌వ్యాగన్ ఇంకా ప్రకటించలేదు. దీంతో కొనుగోలుదారులు, ఆటోమొబైల్ నిపుణులలో ఈ కారు ధరపై ఆసక్తి, ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. అయితే, ఈ కారు సుమారు రూ.60 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ కారులో 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పవర్‌ట్రైన్ 265 PS పవర్, 370 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Volkswagen Golf GTI

కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250కిమీ వరకు ఉంటుంది. ఈ గణాంకాలు గోల్ఫ్ GTIని దాని విభాగంలో అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ కార్లలో ఒకటిగా నిలుపుతాయి. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTIలో మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, X-ఆకారంలో ఉండే ఫాగ్ లైట్లు, హనీకూంబ్ డిజైన్‌తో కూడిన పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు ప్రత్యేకంగా నిలుస్తాయి.

అదనంగా, టెయిల్ గేట్‌పై GTI-స్పెసిఫిక్ బ్యాడ్జింగ్‌లు, ORVMల కింద లెటరింగ్, 18-అంగుళాల వీల్ సెటప్ (19-అంగుళాల వీల్స్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం), డ్యూయల్ క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్స్, రూఫ్ స్పాయిలర్లు, స్మోక్డ్ LED టెయిల్ లైట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ డిజైన్ అంశాలు కారుకు స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి.

Volkswagen Golf GTI

గోల్ఫ్ GTI ఇంటీరియర్ కూడా అంతే ఆకట్టుకుంటుంది. GTI క్లాస్ప్‌తో లెదర్ కవర్ చేయబడిన స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్, 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్‌కు కనెక్ట్ చేయబడిన 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, GTI-స్పెసిఫిక్ గ్రాఫిక్స్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ దీని ప్రత్యేకతలు.

కంఫర్ట్ కోసం 7-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.

Volkswagen Golf GTI

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారతదేశంలో వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI రాక ఆటోమొబైల్ ఔత్సాహికులలో భారీగా అంచనాలు పెంచింది. దాని పవర్‎ఫుల్ ఇంజిన్, అధునాతన ఫీచర్లు, స్పోర్టీ డిజైన్‌తో, గోల్ఫ్ GTI భారతీయ మార్కెట్‌లో ఒక బలమైన ముద్ర వేయడం ఖాయం.

అధికారిక లాంచ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, కొనుగోలుదారులు, పరిశ్రమ నిపుణులు మరిన్ని వివరాల కోసం, ముఖ్యంగా దాని ధర గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది పోటీతో నిండిన భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఈ కారు విజయాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 21, 2025, 9:08 [IST]
English summary
Mind blowing speed stunning looks volkswagen golf gti launching on may 26
Read more on: #volkswagen #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+