చిన్న సైజులో ఉన్నప్పటికీ, చాలా శక్తివంతమైనది.. ఈ కారు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్ల బ్రాండ్ BMWకి చెందిన మినీ (MINI), భారత మార్కెట్లో తన ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల సిరీస్‌ను విస్తరించే క్రమంలో మరో అడుగు వేసింది. ఇటీవలే, కూపర్ S JCW ఎడిషన్‌ను పరిచయం చేసిన తర్వాత, ఇప్పుడు కంపెనీ తన ఎలక్ట్రిక్ SUV మోడల్ అయిన మినీ కంట్రీమాన్ ఎలక్ట్రిక్ JCW ఎడిషన్ (mini countryman electric jcw)ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ తాజా JCW ఎడిషన్‌కి ఎక్స్-షోరూమ్ ధర రూ. 62 లక్షలుగా నిర్ణయించారు. దీంతో, మినీ కంట్రీమాన్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన వేరియంట్ల సంఖ్య నాలుగుకు చేరింది. అంతేకాదు, కొత్త JCW ఎడిషన్, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వేరియంట్‌లలో అత్యంత ఖరీదైన టాప్-ఎండ్ మోడల్ కావడం విశేషం.
JCW(John Cooper Works) ఎడిషన్ అన్నదే ఒక ప్రత్యేకత. ఇది కేవలం డిజైన్ రూపకల్పనలోనే కాదు, నాణ్యత, డ్రైవింగ్ అనుభవంలోనూ MINIకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ వేరియంట్ శక్తివంతమైన పనితీరుతో పాటు, స్పోర్టీ ఫీచర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. JCW మాత్రమే కాదు, మినీ కంట్రీమాన్ ఎలక్ట్రిక్ కారును సంస్థ ఇప్పటికే ఎసెన్షియల్, క్లాసిక్ ప్యాక్, ఫేవర్డ్ ప్యాక్ వేరియంట్లలో కూడా మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఒక్కో వేరియంట్‌లోనూ MINI తనదైన శైలిలో డిజైన్ చేసిన విభిన్న ఫీచర్లను అందించింది. వినియోగదారుల అభిరుచులు, అవసరాలు ఆధారంగా ఎన్నుకునే వీలున్న ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లో మినీ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. తాజా JCW ఎడిషన్ విడుదలతో, మినీ బ్రాండ్ భారత మార్కెట్లోని కారు ప్రియులకు ఒక ప్రత్యేకమైన ప్రీమియం అనుభూతిని అందిస్తోంది. బ్రాండ్‌కు ప్రాణం పోసిన జాన్ కూపర్‌కు గౌరవ సూచకంగా JCW ఎడిషన్‌లను రూపొందించింది.
ఈ ఎడిషన్‌లు కేవలం పేరుగానే ప్రత్యేకం కాక, డిజైన్, పనితీరులోనూ తేడాను చూపిస్తాయి. కొత్తగా పరిచయమైన మినీ కంట్రీమాన్ ఎలక్ట్రిక్ JCW ఎడిషన్ ఈ ప్రత్యేకతను మరింతగా ప్రతిబింబిస్తుంది. ఇందులో ఎక్స్‌టీరియర్‌లో స్పోర్టీ బంపర్లు, ప్రత్యేక కలర్ కాంబినేషన్‌లు, బ్యాడ్జింగ్, అలాగే లోపల అలంకరించిన ఇంటీరియర్, JCW స్పెషల్ స్టిచింగ్, టెక్నాలజీ ఫీచర్లకు ప్రత్యేక ప్యాక్ అందించబడింది.

సాధారణ మినీ కంట్రీమాన్ ఎలక్ట్రిక్‌తో పోల్చితే ఈ JCW వేరియంట్ కొంచెం అధిక ధరలో వస్తుంది, కానీ ఈ కారును మరింత విలువైనదిగా మార్చే స్టైల్, రేర్‌నెస్, బ్రాండ్ స్టేటస్ దీని ప్రత్యేకత. దీనిని లిమిటెడ్ ఎడిషన్‌గా, అంటే కొద్దిమందికి మాత్రమే లభించేలా రూపొందించటం ద్వారా మినీ ఓ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. భారతదేశంలో కేవలం 20 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టంగా ప్రకటించింది.
ఇవన్నీ విదేశాల్లో తయారవుతాయి, అలాగే ఇక్కడికి ఇంపోర్ట్ చేసి బుకింగ్ చేసిన వారికి డెలివరీ చేయనున్నారు. ఇది మరింత ఎక్స్‌క్లూజివిటీని ఇస్తుంది. ఈ ప్రత్యేక మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే ఆసక్తిగల వారు, మినీ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 1.5 లక్షల టోకెన్ అమౌంట్ చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. ఈ అడ్వాన్స్ చెల్లింపుతో వారు తమ పేరును 20 ప్రత్యేక కస్టమర్ల జాబితాలో నమోదు చేసుకోవచ్చు.

మినీ కంట్రీమాన్ ఎలక్ట్రిక్ JCW, మిడ్‌నైట్ బ్లాక్ లేదా లెజెండ్ గ్రే రంగులలో లభిస్తుంది. సాధారణ మినీ కంట్రీమాన్ ఎలక్ట్రిక్ కారుతో పోలిస్తే, కొత్త JCW వెర్షన్ ప్రత్యేక స్టెప్డ్ డిజైన్‌ను పొందుతుంది. ఎలక్ట్రిక్ కారు కావడంతో, ముందు గ్రిల్ ప్రాంతం క్లోస్ చేయబడింది. అల్లాయ్ వీల్స్ కూడా బ్లాక్ కలర్‌లో అందించబడ్డాయి. మినీ కార్లు పేరుకు తగ్గట్టుగానే చిన్నవిగా ఉంటాయి, కానీ ఇవి శక్తివంతమైనవి.


Click it and Unblock the Notifications








