హాట్ టాపిక్‌గా మారిన మినీ కూపర్ కారు! ఓపెన్-టాప్ ఫన్ తిరిగి రాబోతోంది.. బుకింగ్స్ స్టార్ట్

మినీ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. కొత్త మినీ కూపర్ కన్వర్టిబుల్ (mini cooper convertible) భారత్‌లో అధికారికంగా మళ్లీ రాబోతోందన్న వార్త ఆటో ప్రేమికులలో పెద్ద హుషారును తీసుకొచ్చింది. నవంబర్ 19 నుంచి ఈ కాంపాక్ట్ ఓపెన్-టాప్ కారుకు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 2025 నాటికి దాన్ని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మినీ ఇండియా ప్రకటించింది. ఈ సెగ్మెంట్‌లో ఓపెన్-టాప్ కారు ఎంపికలు ఎంతో పరిమితంగా ఉండటంతో, కొత్త మినీ కన్వర్టిబుల్ తిరిగి ఎంట్రీని బ్రాండ్ వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న మినీ కూపర్ S ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి వచ్చిన ఈ కొత్త మోడల్‌ ప్రధాన ప్రత్యేకత దాని పూర్తిగా ఎలక్ట్రిక్ సాఫ్ట్ టాప్.

కేవలం 18 సెకన్లలో పైకప్పు తెరుచుకునేలా, మూసుకుపోయేలా రూపొందించబడింది. ప్రత్యేకంగా, కారు 30 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ ఈ ప్రక్రియను సులభంగా చేయవచ్చు. అంటే రోడ్డు మీద ప్రయాణిస్తూనే వెంటనే ఓపెన్-టాప్ అనుభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఆకాశాన్ని తాకేలా ఓపెన్ డ్రైవ్‌ను ఇష్టపడే వారి కోసం ఇది నిజమైన బోనస్. డిజైన్ విషయానికొస్తే, మినీ తన క్లాసిక్ స్టైల్‌ను కొనసాగిస్తూ , కన్వర్టిబుల్‌కు ప్రత్యేక విజువల్ ఐడెంటిటీని అందించింది.

Mini India Begins Early Bookings For New Cooper Convertible

కస్టమర్‌లు తమ అభిరుచులకు తగ్గట్లుగా ఇంటీరియర్‌ను అనుకూలీకరించుకునే అవకాశమూ ఉంది. ఆధునాతన డిజిటల్ ఇంటర్‌ఫేస్, మెరుగైన కనెక్టివిటీ ఆప్షన్లు, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ అన్నీ కలిసి ఈ కారును మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఇప్పటికే బుకింగ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పది మినీ డీలర్‌షిప్‌లలో అంగీకరిస్తున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, పూణే, కొచ్చి, అహ్మదాబాద్, చండీగఢ్, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఉన్న మినీ షోరూమ్‌లు రిజర్వేషన్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

అదనంగా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా బుకింగ్ పూర్తిచేసుకునే అవకాశం ఉండటం ఈ కన్వర్టిబుల్ డిమాండ్‌ను మరింత పెంచే అవకాశముంది. కొత్త మినీ కూపర్ కన్వర్టిబుల్ డిజైన్ విషయానికి వస్తే, ఇది మినీ బ్రాండ్‌కు ప్రత్యేకమైన ఆ క్లాసిక్-క్యూట్ లుక్‌ను ఆధునిక స్టైలింగ్‌తో కలిపి మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. ముందుభాగంలో గుండ్రని ఆకారంలో ఉన్న LED హెడ్‌ల్యాంప్‌లు వెంటనే చూపు ఆకర్షిస్తాయి.

Mini India Begins Early Bookings For New Cooper Convertible

చుట్టుముట్టే డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) కారుకు తనదైన శైలి, ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. కారు నుసి మధ్యలో ఉన్న అష్టభుజి ఆకారపు గ్రిల్ ఈసారి క్లియర్‌గా మూసివేయబడిన డిజైన్‌లో కనిపిస్తుంది. పైభాగంలో క్షితిజ సమాంతర నల్లని స్ట్రిప్‌లు, స్పోర్టీగా మెరిసే S బ్యాడ్జ్ మరింత ప్రీమియం ఫీల్‌ను ఇస్తాయి. దిగువన వెడల్పుగా ఇచ్చిన ఎయిర్ డ్యామ్‌లు ఇంజిన్ కూలింగ్‌ను మెరుగుపరచడమే కాకుండా, ముందుభాగాన్నే మరింత అగ్రెసివ్‌గా చూపించేలా ఉంటాయి.

హార్డ్‌టాప్ వెర్షన్‌ అయిన కూపర్ S డిజైన్ DNAను కొనసాగే ఈ కన్వర్టిబుల్, సైడ్ ప్రొఫైల్‌లో కూడా అదే స్పోర్టీ సిగ్నేచర్‌ను కలిగి ఉంది. బాడీ మొత్తం మీద ఇవ్వబడిన బ్లాక్ క్లాడింగ్ SUV-లాంటీ దృఢత్వాన్ని, అలాగే కన్వర్టిబుల్‌కు కావాల్సిన శార్ప్ స్టైల్‌ను అందిస్తాయి. 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ అయితే ఈ కారుకు ఆల్రెడీ ఉన్న ఆ యంగ్, ప్రీమియం వైబ్‌ను మరింత ఎలివేట్ చేస్తాయి.

Mini India Begins Early Bookings For New Cooper Convertible

ఈ కారును ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని అనుకునే కస్టమర్లు అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆన్‌లైన్ బుకింగ్ అభ్యర్థనను సమర్పిస్తే సరిపోతుంది. మీరు రిజర్వేషన్ ఫారమ్‌ను పూర్తి చేసిన వెంటనే, మీకు సమీపంలోని మినీ డీలర్‌షిప్ ప్రతినిధి వ్యక్తిగతంగా సంప్రదించి తదుపరి ప్రక్రియ, కాన్ఫిగరేషన్ వివరాలు, బుకింగ్ అమౌంట్, డెలివరీ టైమ్‌లైన్ వంటి అన్ని అంశాలను మీతో చర్చిస్తారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 20, 2025, 17:02 [IST]
English summary
Mini india begins early bookings for new cooper convertible ahead of launch
Read more on: #mini #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+