వర్షం పడుతున్నా మీ కార్ ఏ సమస్య లేకుండా నడవాలంటే... ఇదిగో ఇలా చేయండి!
వర్షం మొదలవుతుందంటే చాలామందికి ఒక ప్రశాంతత, ఒక శాంతమైన వాతావరణం. కానీ కారును కలిగి ఉన్న వారికి మాత్రం ఇది సవాలుగా మారుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో కారు మెయింటనెన్స్ అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. సరైన నిర్వహణ లేకపోయినట్లతే ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ముందుగానే పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కారును వర్షంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా నడివగలిగేలా చేయవచ్చు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ కారును వర్షపు నీటి నుంచి అన్ని విధాలుగా రక్షించుకోవడానికి పాటించాల్సిన కొన్ని సూచనలను ఈ కింది కథనంలో అందించడం జరిగింది. మరి ఆ వివరాలు ఎంటో ఒకసారి తెలుసుకుందాం.
విండ్షీల్డ్ వైపర్లు: వర్షాకాలంలో మొదటగా మనం చూడాల్సింది విండ్షీల్డ్ వైపర్లు. ఇవి పనిచేసేటప్పుడు చిర్ర్..చిర్ర్ అనే సౌండ్ వస్తుంటే, అది బ్లేడ్ దెబ్బతిన్నదని అర్థం. అదే బ్లేడ్ విండ్షీల్డ్‌పై గీతలు వేసే అవకాశం ఉంది. దీని వల్ల అద్దం దెబ్బతినవచ్చు. రబ్బర్ బ్లేడ్ పగిలిందా, లేదా గజిబిజిగా తుడుస్తుందా అని పరీక్షించండి. అవసరమైతే కొత్తవి వేసేయండి. బ్లేడ్స్ మర్చిపోయి కొత్తవి వేసినా, మోటార్ బలహీనంగా ఉంటే వైపర్లు మెల్లగా కదులుతాయి.

కొన్ని సార్లు పూర్తిగా ఆగిపోవచ్చు. వర్షంలో అలా అయితే, కారు నడిపేందుకు అసాధ్యం. అందుకే, మోటార్ కూడా సరిగా పనిచేస్తోందో ఒకసారి చెక్ చేయాలి. కారు స్టార్ట్ చేసి, వైపర్‌ను రెండు స్పీడ్‌లలోనూ ఆన్ చేసి పనిచేస్తున్నాయా చూడండి. స్లో మోడ్, హై మోడ్ రెండూ సమంగా పని చేయాలి. రోజు కారును బయటకు తీయబోయే ముందు అవి కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేయాలి.
టైర్లు: వర్షంలో డ్రైవింగ్ అంటే నీటిలో తేలేలా ప్రయాణించటం కాదు, రోడ్డుపై స్టేబుల్‌గా ఉండడం ముఖ్యం. అయితే ఇలాంటి సమయాల్లో మనం అత్యంత నిర్లక్ష్యం చేసే అంశం టైర్లు. అవే మన కారును రోడ్డుతో బలంగా కనెక్ట్ చేసి ఉంచుతాయి. తడి రోడ్లపై టైర్ల గ్రిప్ లేకపోతే, ఒక్కసారి బ్రేక్ వేస్తేనే కారు జారిపోవచ్చు. దీంతో కారు స్కిడ్ లేదంటే ఇతర వాహనాలను ఢికోనే అవకాశం ఉంటుంది.

పాత టైర్లలో ట్రెడ్ డెప్త్ తగ్గిపోతే, నీటిని బాగా చీల్చలేవు. దాంతో హైడ్రోప్లానింగ్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే టైర్లు నీటిమీదే తేలిపోయి, కారు నియంత్రణ కోల్పోతుంది.కాబట్టి, వర్షాకాలంలో టైర్ల స్థితిని సరిగ్గా పరిశీలించాలి. ట్రెడ్ డెప్త్ కనీసం 2mm లోపు ఉంటే, వెంటనే కొత్త టైర్లు వేయడం మంచిది. కొత్త టైర్లంటే ఖర్చు అనిపించొచ్చు, కానీ ఊహించని విధంగా ఎదురయ్యే ప్రమాదాలను గట్టేక్కడానికి ఇది తప్పనిసరి.
అండర్‌బాడీ ప్రొటెక్షన్ కోటింగ్: వర్షపు నీరు చిన్న గ్యాప్‌ల ద్వారా లోపలికి వచ్చి మెటల్ పార్ట్స్‌లపై రస్ట్ ఏర్పడటానికి కారణం అవుతుంది. అండర్‌బాడీ మీద నీరు తడిగా నిలిచి, రోజురోజుకు తినేస్తూ పోతుంది. లోపల కనిపించనంతగా మెటల్ మీద క్రమంగా రస్ట్ మొదలతుంది. మొదట చిన్నగా కనిపించే ఈ దెబ్బ, చివరికి కార్ స్ట్రక్చర్‌ను బలహీనంగా మార్చేస్తుంది. అందుకే లోపల కోటింగ్ చేయించుకోవడం వలన కారు స్ట్రాంగ్‌గా ఉండటానికి వీలవుతుంది.

డీ-ఫాగర్: వర్షం పడుతుంటే విండోస్ మబ్బుగా మారిపోతుంటాయి. గాజుల మీద మంచు బూడిదలా మబ్బు కమ్ముతుంది. అది మెల్లగా ముందువైపు అద్దం మొత్తం కప్పేస్తుంది. ఇలాంటి సమయంలో, ఎంత శ్రద్ధగా డ్రైవ్ చేసినా ముందున్న దారి కనిపించకపోవడం వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటప్పుడే మనకు తోడుగా ఎయిర్ కండిషనర్ (A/C) లేదా డీ-ఫాగర్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇవి బాగానే పనిచేస్తున్నాయో ఒకసారి పరీక్షించండి.
కారు సర్వీసింగ్: ఇప్పుడు నీటితో నిండిపోయిన రోడ్లు, పొడవైన ట్రాఫిక్ జామ్స్, తడిగా ఉండే వాతావరణం కార్‌పై మరో మారు పరీక్షలా ఉంటుంది. అలాంటప్పుడు ముందుగా మీరు చేయాల్సింది ఒక్కటే, మీ కారుని సర్వీస్ చేయించాలి. ఇదే సమయంలో బ్యాటరీ పనితీరుపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండటం వల్ల బ్యాటరీ పనితీరు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి సర్వీసింగ్ టైంలో బ్యాటరీ చెక్ చేయండి.

ఇతర: ఈ టైంలో మబ్బుతో కమ్ముకుని ఉండటం, చీకటి వేగంగా కమ్ముకోవడం అన్నీ సాధారణమే. అలాంటి పరిస్థితుల్లో కారు లైటింగ్ సిస్టమ్, అంటే హెడ్‌లైట్స్, బ్రేక్ లైట్స్, ఇండికేటర్లు ఇవన్నీ పూర్తి స్థాయిలో పనిచేయాలి. వీటిలో ఏ ఒక్కటి సరిగా పనిచేయకపోయినా, మీకు ముందున్న దారి కనిపించకపోవచ్చు. అలాగే, బ్రేక్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.


Click it and Unblock the Notifications








