మోత మోగించేలా మోంట్రా ఎలక్ట్రిక్.. కమర్షియల్ వాహనాల్లో కింగ్ అయ్యేలా ప్లాన్!

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కార్లు, బైకులే కాదు.. కార్గో వెహికిల్స్ కూడా అదరగొడుతున్నాయి. మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ... రెండు కొత్త వాహనాలను పరిచయం చేసి తగ్గేదేలే అనిపించింది. ఈ రెండూ ఎలక్ట్రిక్ వాహనాలే కావడం విశేషం. 'Eviator' పేరుతో ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికిల్‌ను, Super Cargo పేరుతో ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను లాంఛ్ చేసింది. ఈ రెండు వాహనాలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డీ. కుమారస్వామి ఆవిష్కరించారు. ఈ వాహనాలలో ఉండే ఫీచర్లు, వీటి ధర తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏవీయేటర్(ఇ-SCV) 3.5 టన్నుల బరువుతో ఉండగా.. సూపర్ కార్గో (ఇ- త్రీవీలర్) 1.2 టన్నుల బరువుతో ఉంటుంది. ఏవియేటర్ 245 కి.మీ రేంజ్ అందిస్తుంది. 170 కి.మీ.ల రియల్ వరల్డ్ రేంజ్ ప్రయాణిస్తుంది. ఇది 80 kW పవర్, 300 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 7 సంవత్సరాలు లేదా 2.5 లక్షల కి.మీ.ల వారంటీతో వస్తుంది. దీని ధర రూ.15.99లక్షలు(ఎక్స్- షోరూమ్) వద్ద ఉంది.

Montra Electric Cargo Vehicles Eviator and Super Cargo

ఇక సూపర్ కార్గో 200+ కి.మీ.ల ఇండస్ట్రీ లీడింగ్ సర్టిఫైడ్ రేంజ్‌తో, 150 కి.మీ.ల రియల్ వరల్డ్ రేంజ్‌తో ఉంటుంది. ఈ కార్గో 3 బాడీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ఫుల్ ఛార్జింగ్ కావడానికి కేవలం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. దీని ధర రూ.4.37 లక్షలుగా(ఎక్స్- షోరూమ్) ఉంది. రోజువారీ వినియోగానికి అనువుగా ఉండేలా కస్టమైజ్‌డ్ ఛార్జింగ్ సదుపాయంతో ఈ వాహనాలను తీసుకువచ్చినట్లు మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ తెలిపింది.

ఏవియేటర్ మోడల్ దేశంలోని తొలి TRU-EV కావడం గమనార్హం. ఇది 245 కి.మీ.ల సర్టిఫైడ్ రేంజ్‌తో, కటింగ్- ఎడ్జ్ డిజైన్, రోబస్ట్ పర్ఫార్మెన్స్‌తో వినియోగదారులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఎస్‌సీవీ సెగ్మెంట్‌లో ఈ ఏవియేటర్ గేమ్ ఛేంజర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇందులో అడ్వాన్స్‌డ్ టెలిమేటిక్స్ కూడా ఉన్నాయి. దీనితో 95శాతం ఫ్లీట్ అప్‌టైం అందుతుందని మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ చెబుతోంది.

Motra Electric Super Cargo

సూపర్ కార్గో ఈవీని కస్టమర్ ఇన్‌సైట్స్‌కు తగ్గట్టుగా తయారు చేశారు. ఇందులో డ్రైవర్ సీట్ బెల్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, స్పేషియస్ డ్రైవర్ కేబిన్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీంట్లోని 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ ఆప్షన్... B2B వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఈ సూపర్ కార్గో ఫ్లీట్ ఆపరేటర్స్‌తో పాటు, స్వతంత్ర ఆంత్రప్రెన్యూర్‌లకు తగ్గట్లుగా వివిధ సదుపాయాలతో అందుబాటులో ఉంది. తమ డీలర్ నెటవర్క్ ఈ వాహనాల అమ్మకాలను పెంచుకోగలుగుతామని మోంట్రా సంస్థ చెబుతోంది. ఈ సెగ్మెంట్‌లో ఇతర వాహనాలకు తాము గట్టి పోటీనిస్తామని అంటోంది.

Montra Electric Eviator

ఇదే ఆటో ఎక్స్ పోలో మోంట్రా సంస్థ.. రైనో(RHINO) పేరుతో 55 టన్నులతో ఉండే హెవీ కమర్షియల్ వాహనాన్ని కూడా ప్రదర్శించింది. మోంట్రా సంస్థ తమ వాహనాలతో క్రమంగా సేల్స్ పెంచుకుంటోంది. 2070 నాటికి జీరో కర్బన ఉద్గారాలు సాధించాలన్న భారత లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని నిర్దేశించుకుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, January 18, 2025, 19:17 [IST]
English summary
Montra electric cargo vehicles eviator and supercargo launched at auto expo 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+