ఒక కారు కోసం ఏకంగా ప్రధాని మోడీ వస్తున్నారు.. దానిలో అంత స్పెషల్ ఏముందో? మోడీ రాకతో హాట్ టాపిక్‌గా కారు

టాటా, మహీంద్రా వంటి సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో గట్టి పట్టు సాధించాయి. టాటా తన నెక్సాన్, టిగోర్ వంటి మోడళ్లతో ముందంజలో ఉంటే, మహీంద్రా XUV400, BE సిరీస్‌లతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki) మాత్రం ఇప్పటివరకు ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగుపెట్టలేదు. కానీ ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగదని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఎదురుచూపులు ముగియబోతున్నాయి. మారుతి తన తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారా (e-Vitara)ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతోంది. SUV సెగ్మెంట్‌లోకి ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావడం ద్వారా మారుతి తన ఎలక్ట్రిక్ ప్రయాణానికి ఘనమైన ఆరంభం ఇవ్వబోతోంది. ఈ ప్రారంభం కోసం కంపెనీ భారీ ఏర్పాట్లు చేసింది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరణ జరగబోతోంది. రేపటితోనే చరిత్ర సృష్టించనుంది. ఆగస్టు 26న గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్ SUVను ఆవిష్కరించనున్నారు. అంతే కాదు, ఈ ప్రత్యేక సందర్భానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా హాజరవుతారు. ఆయన చేతుల మీదుగా జెండా ఊపి ఇ-విటారాను విడుదల చేయడం ద్వారా ఈ కార్యక్రమానికి మరింత గౌరవం, ప్రాధాన్యం చేకూరబోతోంది.

Narendra Modi will Launch The Maruti Suzuki e Vitara From Assembly Line On August 26

ఇది కేవలం ఒక వాహనం ఆవిష్కరణ మాత్రమే కాదు, భారత ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త యుగానికి నాంది పలికే సంఘటన. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ విభాగంలో వెనుకబడి ఉందన్న విమర్శలకు ఇది సమాధానం కానుంది. ఇకపై మారుతి కూడా ఎలక్ట్రిక్ మార్కెట్లో గట్టి పోటీదారుగా నిలుస్తుందనే నమ్మకాన్ని ఈ లాంచ్ కలిగిస్తోంది. పరిశ్రమలోనే కాదు, వినియోగదారుల్లోనూ మారుతి ఎలక్ట్రిక్ ఎంట్రీపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

ఈ ఇ-విటారా కేవలం భారతీయ మార్కెట్‌కే పరిమితం కానుంది అనుకోవడం పొరపాటు. మారుతి సుజుకి దీన్ని ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. అంటే, ఇది భారత్‌లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఆటోమొబైల్ రంగంలో కూడా తన ప్రత్యేక గుర్తింపు సాధించబోతోంది. కంపెనీ అంచనాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ SUV దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోనూ మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది.

Narendra Modi will Launch The Maruti Suzuki e Vitara From Assembly Line On August 26

లాంచ్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలు ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఆయన హైబ్రిడ్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. ఇది భవిష్యత్‌లో భారత్‌ను బ్యాటరీ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, ఇ-విటారా కారు తయారీ జరుగబోయే అసెంబ్లీ లైన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ పూర్తవగానే, హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ఇ-విటారా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ వాహనాల తయారీకి వేగంగా శ్రీకారం చుట్టి, దీపావళి నాటికి దేశవ్యాప్తంగా అమ్మకానికి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థగా మారుతి సుజుకి అడుగు ఎలక్ట్రిక్ వాహన రంగంలో కొత్త పోటీతత్వానికి నాంది పలకడమే కాకుండా, భారత ఆటో పరిశ్రమను ప్రపంచ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లనుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.

Narendra Modi will Launch The Maruti Suzuki e Vitara From Assembly Line On August 26

మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ SUV అయిన ఇ-విటారాను మొదటిసారిగా 2025లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఆ ప్రదర్శనతో ఈ వాహనం పై భారీగా చర్చ మొదలైంది. అప్పటినుంచి దాదాపు 7-8 నెలల గడువు గడిచింది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ వాహనం మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతుండటం ఆటోమొబైల్ రంగంలో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బ్యాటరీ టెక్నాలజీ పరంగా చూస్తే, ఇ-విటారా రెండు వేరియంట్లలో 49 kWh, 61 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులోకి రానుంది . ఈ రెండు ఎంపికలు వినియోగదారుల అవసరాల ప్రకారం సరిపడేలా రూపొందించబడ్డాయి. పూర్తి ఛార్జ్‌పై సుమారు 500 కి.మీ. వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. దీని అర్థం ఏమిటంటే, రోజువారీ ప్రయాణాలకే కాదు, దూర ప్రయాణాలకూ ఈ SUV అనువైనదిగా మారనుంది.

More from DriveSpark

Article Published On: Monday, August 25, 2025, 14:00 [IST]
English summary
Narendra modi will launch the maruti suzuki e vitara from assembly line on august 26
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+