దేశం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్న కారు ఇదే..ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో యుగం మార్చేందుకు మహీంద్రా సిద్ధం
ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అగ్రగామిగా మారడానికి మహీంద్రా కంపెనీ (Mahindra) దూకుడు పెంచింది. ఈ క్రమంలో దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 7-సీటర్ ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. అదే మహీంద్రా XEV 9S (ఎక్స్‌ఈవీ 9ఎస్). దీనికి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. అత్యంత భారీ డిమాండ్ ఉన్న ఈ కారు ఈ నెల 27న భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది.
దేశవ్యాప్తంగా కార్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కారు రాబోతోంది. ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన మొట్టమొదటి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన XEV 9S ను ఈ నెల 27వ తేదీన మార్కెట్‌లో విడుదల చేస్తోంది. దీనికి సంబంధించిన కొత్త టీజర్ ఒకటి విడుదల కాగా అందులో ఈ కారు డిజైన్, ఫీచర్ల గురించి కీలక వివరాలు బయటపడ్డాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహీంద్రా సంస్థ దేశంలో ఎలక్ట్రిక్ వాహన విక్రయాల్లో అగ్రగామిగా మారుతోంది. ఈ క్రమంలో రాబోయే XEV 9S అనేది కంపెనీ విడుదల చేయనున్న మూడవ బార్న్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. టీజర్ ప్రకారం.. ఈ కారు లుక్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం కంపెనీ విడుదల చేసిన XUV.e8 కాన్సెప్ట్‌ను పోలి ఉంది.
ఇందులో స్టాక్డ్ హెడ్‌లైట్ (ఒకదానిపై ఒకటి ఉండే లైట్లు) లేఅవుట్, XUV 700 కారులో ఉన్న తరహా లైటింగ్ ఫీచర్లు ఉన్నాయి. బూమరాంగ్ ఆకారంలో ఉన్న ఎల్‌ఈడీ DRLs, షార్క్ ఫిన్ యాంటెనా, కొత్త మహీంద్రా లోగో, కొత్త టెయిల్ లైట్ డిజైన్‌తో ఈ కారు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

XEV 9S ఇంటీరియర్‌ల విషయంలో చాలా డిజిటల్‌గా, ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. మహీంద్రా ఇందులో ట్రిప్-ఫీట్ క్యాబిన్‌తో పాటు, పెద్ద మూడు స్క్రీన్ల ప్యానెల్‌ను (Three-Screen Panel) అందించింది. XEV 9E, BE 6 వంటి కార్లలో ఉన్నట్లే ఇందులో కూడా అధిక డిజిటల్ ఫీచర్లు ఉంటాయి. ఇది 7-సీటర్ వాహనం అయినప్పటికీ, బూట్ స్పేస్ తగ్గకుండా మూడవ వరుస సీటు డిజైన్ ఎలా ఉంటుందనే విషయాన్ని కంపెనీ సస్పెన్స్‌గా ఉంచింది.
XEV 9S ను మహీంద్రా సంస్థ తన ప్రత్యేకమైన ఇంగ్లో(Inglo) ప్లాట్‌ఫామ్ లో తయారు చేస్తోంది. దీనివల్ల కారులో సీటింగ్, బూట్ స్పేస్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఈ కారులో XEV 9E లో ఉన్న అదే బ్యాటరీ ఆప్షన్ ఇవ్వబడుతుందని అంచనా.

అంటే, ఇది పూర్తి ఛార్జ్‌పై దాదాపు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని భావిస్తున్నారు. కుటుంబంతో సుదూర ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ కారులో పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్, వెంటిలేటెడ్ సీట్లు, మసాజ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం : మహీంద్రా XEV 9S భద్రతా ప్రమాణాలలో కూడా అద్భుతంగా ఉంటుందని ఆశించవచ్చు. కుటుంబంతో ప్రయాణించడానికి అనువైన 3-వరుసల ఎస్‌యూవీ కావడం వల్ల, ఈ కారు అమ్మకాలు మార్కెట్‌లో చాలా బలంగా ఉంటాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








