రూ.6.89 లక్షలకే టాటా కొత్త కారు.. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్.. బేస్ వేరియంట్ ఫుల్ డీటెయిల్స్!
దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) భారత ఆటో మార్కెట్‌లో మరోసారి తన సత్తాను చూపించడానికి కొత్త కస్టమర్లకు చేరువ కావడానికి కొత్తగా 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను అధికారికంగా విడుదల చేసింది. చాలా రోజులుగా బడ్జెట్-ఫ్రెండ్లీ కారు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది బాగా అనుకూలమైన మోడల్. దీని బేస్ వేరియంట్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. లాంచ్ ధర బేస్ వేరియంట్‌ను అనుసరించి ఉంటుంది. దీనిలో అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది సామాన్య వినియోగదారుల దృష్టిని ఆకర్షించే విధంగా మొత్తం ఏడు వేరియంట్లలో స్మార్ట్ , ప్యూర్, ప్యూర్ S, క్రియేటివ్ S, క్రియేటివ్+ S,అకంప్లిష్డ్ S,అకంప్లిష్డ్+ S లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
వీటిలో "స్మార్ట్" ట్రిమ్ బేస్ వేరియంట్ (పెట్రోల్)గా వస్తోంది. ఇది కేవలం ధరలో మాత్రమే కాదు, ఆఫర్ చేసే ఫీచర్లలోనూ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోటీదారుల కంటే మెరుగ్గా ఉంది. దీని ధర వచ్చేసి కేవలం రూ. 6.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు వినియోగదారుల కోసం అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్, మెరుగైన మైలేజ్ కావాలనుకునే వారికి 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ బెస్ట్ ఆప్షన్‌గా ఉపయోగపడుతుంది.

బేస్ వేరియంట్ డిజైన్ విషయానికి వస్తే, ముందుభాగంలో గ్రిల్, బోల్డ్ బ్లాక్ స్ట్రిప్‌తో కూడిన అప్‌డేటెడ్ బంపర్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఇవి రాత్రివేళల్లో తగినంత దృష్టిని కలిగిస్తాయి, అయితే, ఈ వేరియంట్‌లో LED హెడ్‌లైట్స్ అందుబాటులో ఉండవు. సైడ్ ప్రొఫైల్‌లో ఫ్లష్-టైప్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. 16 అంగుళాల స్టీల్ వీల్స్, వీటిపై ప్లాస్టిక్ వీల్ కవర్లు ఉండొచ్చు, కాని స్టైల్ పరంగా ఇవి మినిమలిస్టిక్‌గా కనిపిస్తాయి.
వెనుక భాగంలో ప్రత్యేకతగా రెడ్ స్ట్రిప్‌తో కనెక్ట్ అయిన LED టెయిల్ ల్యాంప్స్, టాప్ వేరియంట్లకు తక్కువ కాకుండా ఉంటాయి. యాంటెన్నా, వెనుక వైపర్, వాషర్, డీఫాగర్ వంటి ఫీచర్లు బేస్ వేరియంట్‌లో ఉండవు. వెనుక బంపర్ బ్లాక్ కలర్‌లో మెరిసిపోతుంది. ఇంటీరియర్‌లో కూడా కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ వేరియంట్ ధరను తగ్గించి, వినియోగదారులకు ఉపయోగకరమైన ముఖ్య ఫీచర్లను అందించడంపై టాటా మోటార్స్ దృష్టి పెట్టింది.

ఇంటీరియర్‌లో తెల్లటి హెడ్‌లైనర్‌తో కూడిన పూర్తిగా బ్లాక్ కలర్ క్యాబిన్ ఉంది. ఇది కార్‌ను మాస్క్యులర్ లుక్ ఇచ్చేలా చేస్తుంది. డాష్‌బోర్డ్ డిజైన్ సింపుల్‌గా ఉంటుంది. కొత్తగా డిజైన్ చేసిన 2-స్పోక్ స్టీరింగ్ వీల్ మెరిసే టాటా లోగోతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. 4-అంగుళాల సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవింగ్‌కు అవసరమైన సమాచారాన్ని ఇస్తుంది. Ac కంట్రోలింగ్ కోసం ఫిజికల్ బటన్‌లు అందించారు.
అయితే వెనుక ప్రయాణీకులకు AC వెంట్లు లేవు. వెనుక హెడ్‌రెస్ట్‌లు స్థిరంగా ఉండటం వలన వీటిని అవసరానికి అనుగుణంగా అడ్జెస్ట్ చేయడం కుదరదు. రిమోట్ కీలెస్ ఎంట్రీ, అన్ని డోర్లపై పవర్ విండోస్ ఉంటాయి. రోడ్లను బట్టి ప్రయాణాలకు అనుగుణంగా మూడు డ్రైవింగ్ మోడ్‌లు, ఎకో, సిటీ, స్పోర్ట్ అందించారు. ఈ కారులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తొలగించబడింది.

ఇంజిన్ విషయానికి వస్తే, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 88 PS పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజూ నగర రైడింగ్‌కు ఇది తగినంత పవర్‌ను అందిస్తుంది. ట్రాఫిక్ పరిస్థితుల్లో స్మూత్ డ్రైవింగ్‌కు సహాయపడేలా, ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఇవ్వబడింది. ఇందులో CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీనిలో 73.5 PS పవర్, 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








