షోరూంలో మెరిసిపోతున్న టాటా కొత్త కారు.. మీరు బుకింగ్ చేసేసారా? స్టైలిష్ డిజైన్‌తో అదిరే ఫీచర్లు

టాటా మోటార్స్ (tata motors) నుంచి ఇటీవల 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ అధికారికంగా భారత రోడ్లపైకి వచ్చింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్‌కి టాటా మోటార్స్ అందించిన తాజా అప్‌డేట్‌తో కొత్తగా కనిపిస్తుంది. ఈ కారుకు స్టైలింగ్‌లో కొత్తదనమే కాకుండా, ఫీచర్ల పరంగా కూడా గణనీయమైన మెరుగుదలలు అందాయి. హ్యాచ్‌బ్యాక్ లవర్స్ హృదయాలను గెలుచుకునేందుకు టాటా మళ్లీ ఒక ప్రయత్నం చేసింది అనుకోవచ్చు. ఈ నెల ప్రారంభంలో కంపెనీ ఈ కారుకి బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించింది. మెరుగైన ఆసక్తిని వ్యక్తం చేసిన కొనుగోలుదారులు కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా లేదా తమకు సమీపంలోని డీలర్‌షిప్‌ ద్వారా రూ. 21,000 అడ్వాన్స్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కొన్ని ప్రధాన నగరాల్లో బుకింగ్స్‌కి మంచి స్పందన లభిస్తోంది అన్నది తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఇప్పటికే కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను డీలర్‌షిప్‌లకు తరలించడం ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి ఈ కారుపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తున్నాయి. డైనమిక్ స్టైలింగ్, కొత్త ఫీచర్లు, మెరుగైన కంఫర్ట్ లెవెల్స్‌తో ఇది గత మోడల్‌కి పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులకు డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశముంది.

New 2025 Tata Altroz Facelift Car Reaches Dealerships

టాటా మోటార్స్ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా, ఈ కొత్త వెర్షన్‌ ద్వారా మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరిచే అవకాశముంది. కొత్త 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ గురించి ఒక స్పష్టమైన విషయం ఏమిటంటే, ఇది తక్కువ బడ్జెట్‌కి, మంచి ఫీచర్లతో కూడిన హ్యాచ్‌బ్యాక్‌ను కోరుకునే వారికి అనువైన ఎంపికగా నిలుస్తుంది. స్టైలింగ్, ఫీచర్ల పరంగా, ధర విషయంలో మంచి పనితీరుతో అన్నింటినీ సమానంగా కలిపిన కారుగా ఇది రూపుదిద్దుకుంది.

ధర విషయానికి వస్తే, ఈ హ్యాచ్‌బ్యాక్ రూ.6.89 లక్షల నుంచి మొదలవుతూ రూ.11.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. దీనివల్ల ప్రీమియం కారుగా నిలిచినప్పటికీ, చాలా మంది మధ్యతరగతి వినియోగదారులకు ఇది తేలికగా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఇది 5 మందికి సౌకర్యవంతంగా కూర్చునేలా రూపొందించబడింది. కుటుంబ ప్రయాణాల కోసం సరిగ్గా సరిపోతుంది. ఇంకా, వేరియంట్‌ను బట్టి 210 లీటర్ల నుంచి 345 లీటర్ల వరకు బూట్ స్పేస్ లభిస్తుంది.

New 2025 Tata Altroz Facelift Car

దీని ద్వారా వారం రోజుల ప్రయాణంలో మీకు అవసరమయ్యే లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇది మినీ లగేజీ కారుగా పని చేస్తుంది. వేరియంట్ల విషయానికి వస్తే, ఈ కొత్త ఆల్ట్రోజ్ 'స్మార్ట్', 'ప్యూర్', 'ప్యూర్ ఎస్', 'క్రియేటివ్ ఎస్', 'అకంప్లిష్డ్ ప్లస్ ఎస్' అనే ఆప్షన్లలో లభిస్తుంది. ప్రతి వేరియంట్‌కి ప్రత్యేకమైన ఫీచర్లు, ఇంటీరియర్ ట్రిమ్స్, టెక్నాలజీ అప్గ్రేడ్‌లు ఉన్నాయి, ఇలా అన్ని వర్గాల కొనుగోలుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మూడు ప్రధాన ఇంజిన్ ఆప్షన్లలో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్ CNG, 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (AMT), 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (DCA)లను కలిగి ఉంటుంది.

New 2025 Tata Altroz Facelif

మైలేజీ విషయానికొస్తే, ఇది 19 నుంచి 26 కిలోమీటర్ల వరకు లీటరుకు ఇచ్చే సామర్థ్యంతో మార్కెట్లో మంచి ఎకానమికల్ కార్లలో ఒకటిగా నిలుస్తోంది. ఇది నగర ప్రయాణాలు కావచ్చు, హైవే డ్రైవింగ్ కావచ్చు, రెండింటికీ ఈ కారు అనువైనదిగా మారింది. ఈ పెర్ఫార్మెన్స్ కాంబినేషన్ దీన్ని కేవలం కుటుంబ ప్రయాణాలకే కాకుండా, రోజువారీ డ్రైవింగ్‌కి కూడా సరిపోయేలా చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Sunday, June 8, 2025, 7:30 [IST]
English summary
New 2025 tata altroz facelift car reaches dealerships more details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+