భారతదేశపు సేఫ్టీ కారు? బుకింగ్ చేసుకునే ముందు దీని గురించి తెలుసుకోండి! ఫ్యాక్టరీ క్రాష్ టెస్ట్ వీడియో

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) ఆటో మార్కెట్లో తన వాటాను పెంచుకోవడానికి ఇటీవల కొత్త ఆల్ట్రోజ్ (Altroz) ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. గత మోడల్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో టాటా 2025 మోడల్‌ను తీసుకొచ్చింది. మరింత ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీ, మెరుగైన ఫీచర్లతో నూతనంగా వచ్చిన ఈ మోడల్ టాటా మోటార్స్‌కు కీలకం కానుంది. కేవలం ఎక్స్‌టీరియర్ కాస్మెటిక్ మార్పులతో కాకుండా, ఇందులో కీలకంగా టెక్నాలజీ అప్‌డేట్స్ కూడా చోటు చేసుకున్నాయి. సాధారణంగా టాటా కార్లు ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమ ప్రమాణాలతో కూడినవిగా ఉంటాయి. ప్రమాద సమయంలో లోపల కూర్చున్న వారికి సురక్షితంగా ఉండేలా చూడటంలో టాటా ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఇటీవల విడుదల చేసిన ఆల్ట్రోజ్ కూడా మంచి సేఫ్టీ ప్రమాణాలతో కూడినది. ఈ కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను టాటా మోటార్స్ స్వయంగా తమ ఫ్యాక్టరీ ప్రాంగణంలో క్రాష్ టెస్ట్ చేసింది. ఈ క్రాష్ టెస్ట్ వీడియో కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో విడదల చేయబడ్డాయి. తొలిసారి కారును చూస్తున్న వారికి, లేదా ఇప్పటికే ఆల్ట్రోజ్‌పై ఆసక్తి ఉన్న వారికి, ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కొత్త ఊపును ఇస్తుందనడంలో సందేహం లేదు.

New 2025 Tata Altroz Facelift

భారతదేశపు అత్యంత నమ్మకమైన కార్ తయారీ సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్, తన కస్టమర్లకు భద్రత, నాణ్యతపై ఎలాంటి రాజీ పడదని ఈ క్రాష్ టెస్ట్ వీడియో మరోసారి నిరూపించింది. గతంలో విడుదలైన ఆల్ట్రోజ్ వెర్షన్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సాధించి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. భారతదేశం నుండి ఆ రేంజ్‌లో రేటింగ్ పొందిన మొదటి కార్లలో ఇది ఒకటి కావడం విశేషం.

ఈ నేపథ్యంలో, తాజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కూడా అదే స్థాయి భద్రతను అందిస్తుందనే నమ్మకం వినియోగదారులలో ఉంది. రూపు మారినప్పటికీ, టాటా మోటార్స్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడదన్న విషయం ఇప్పటికే మార్కెట్లో అందరికి తెలిసిందే. ఫ్యాక్టరీ స్థాయిలో స్వయంగా నిర్వహించిన క్రాష్ టెస్టింగ్ ఈ విషయాన్ని మరింతగా నిరూపిస్తోంది. ఈ టెస్ట్‌లో కారును పలు విధాలుగా పరీక్షలు జరిపారు.

Tata Altroz Facelift Crash Tested Inside The Tata Motors Facility

ఈ మధ్యే టాటా మోటార్స్ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కారును వివిధ రకాల క్రాష్ టెస్టులు కనిపిస్తాయి. వీడియోలో స్పష్టంగా చూపినట్లుగా, కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఒక క్రాష్ సిములేషన్‌లో గంటకు 64 కి.మీ వేగంతో ముందుండి ఒక వంగిన మెటల్ బార్‌ను ఢీకొట్టింది. ఈ టెస్ట్ సమయంలో కారు ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడానికి నిర్వహించబడింది.

ఢీకొట్టే వేగానికి తగినంతగా, కారులోని స్ట్రక్చరల్ ఫ్రేమ్ పాసెంజర్లను గాయాల నుంచి రక్షించేలా రూపొందించబడిందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఇంకొక సందర్భంలో, కారును గంటకు 50 కి.మీ వేగంతో కదులుతున్న వస్తువుతో ఢీకొట్టించారు. ఇది ఒక రకమైన డైనమిక్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్. రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితుల్లో కారు ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నంగా ఇది నిర్వహించబడింది.

2025 Tata Altroz Facelift Crash Test

అంతేకాక, మరొక ప్రత్యేక పరీక్షలో, గంటకు 29 కి.మీ వేగంతో కారును నేరుగా రోడ్డు పక్కన ఉన్న ఇనుప స్తంభం వైపు నడిపించి, కారు పక్క భాగం ఢీకొన్నప్పుడు వచ్చే ప్రభావాన్ని అంచనా వేసారు. ఈ కారు మోడల్‌లో, అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఇవ్వడం ద్వారా, టాటా మోటార్స్ ప్రయాణికుల భద్రతపై ఎంతగానో దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఈ క్రాష్ టెస్ట్ ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడబోతున్నాయి.

Article Published On: Thursday, May 29, 2025, 15:20 [IST]
English summary
New 2025 tata altroz facelift crash tested inside the tata motors facility
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+