ఇప్పుడు కొత్త కారు కొంటే ఇదే బెస్ట్! టయోటా నుండి 27 కి.మీ మైలేజ్‌తో స్టైలిష్ హైబ్రిడ్ మోడల్ లాంచ్

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా (Toyota)కు చెందిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్(urban cruiser hyryder) ఒక క్లాస్ అండ్ ప్రీమియం SUV‌గా అనిపిస్తుంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద వాహన తయారీ కంపెనీలైన జపనీస్ ఆటో మేకర్ మారుతీ సుజుకీ, టయోటా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మోడల్ ఆకట్టుకునే డిజైన్‌తో పాటు, మంచి మైలేజ్‌తో బలమైన హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ కారణంగా భారతీయ ప్రజలకు ఇష్టమైన మెడల్‌గా అవతరించింది. ముఖ్యంగా ఈ కారును మధ్యతరగతి వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ టయోటా SUV ఇప్పటికీ హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఇప్పుడీ మోడల్ మరింత పట్టు సాధించేందుకు, మరింత కొత్తగా అప్‌డేట్ అయి మార్కెట్లోకి విడుదల అయింది.

టయోటా 2025 అర్బన్ క్రూయిజర్ హై రైడర్ ప్రారంభ ధర రూ.11.14 లక్షల నుంచి రూ.11.34 లక్షలకు పెరిగింది. రూ.20,000 పెంపు ఉన్నప్పటికి ఫీచర్స్ మాత్రం అదిరిపోతున్నాయి. ఇది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లాంగ్ జర్నీలో డ్రైవర్‌కు స్ట్రెస్ ఫ్రీ అనుభూతిని అందించడానికి 8-వే అడ్జస్టబుల్ పవర్ డ్రైవర్ సీటు కలిగి ఉంది. ముఖ్యంగా, ఈ అప్‌డేట్‌లో సీటింగ్‌పై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది.

2025 Toyota Urban Cruiser Hyryder Launched

వెనుక సీట్లో కూర్చున్నవారికి వెనుక డోర్ సన్‌షేడ్‌లు, యాంబియంట్ లైటింగ్, అదిరిపోతున్న ఇంటీరియర్ ప్రీమియం లుకింగ్ అన్ని కలిసి కారు లోపలి అందాన్ని మరింత పెంచాయి. 15W టైప్-సి USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు అనేవి ఇప్పుడు అన్ని డివైజ్‌లకు సరిపోయేలా చక్కగా ప్లాన్ చేయబడ్డాయి. అలాగే, LED స్పాట్ లైట్‌లు, రీడింగ్ ల్యాంప్‌లు కూడా కాబిన్లో ఓ లగ్జరీ కారు ఫీల్‌ని అందిస్తున్నాయి.

సేఫ్టీకి మరింత ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా టయోటా తన ప్రతి వేరియంట్‌లోనూ 6 ఎయిర్‌బ్యాగులును ప్రామాణికంగా ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో ఫీచర్లు, మైలేజ్‌తోనే ఆకర్షించిన ఈ మోడల్, ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ పరంగా కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తోంది. ప్రమాద సమయంలో కారు బాడీ మెరుగైన బలాన్ని కలిగి ఉంటుంది. దీంతో యాక్సిడెంట్స్ సమయంలో కారులోని ప్రయాణికులకు సేఫ్టీ మరింత మెరుగవుతుంది.

2025 Toyota Urban Cruiser Hyryder Price

అలాగే, అదనంగా ఇప్పుడు కొన్ని ఆటోమేటిక్ వేరియంట్లలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (EPB) అందుబాటులో ఉంది. ఇది వాహనాన్ని పార్క్ చేయడంలో సౌకర్యంగా ఉండటమే కాకుండా, డ్రైవింగ్‌ను మరింత స్మూత్‌గా, మోడర్న్‌గా మారుస్తుంది. అయితే, డిజైన్ మార్పులు కానీ, మెకానికల్ అప్‌డేట్స్ కానీ లేకపోవడం విశేషం. ఇది E, S, G, V అనే నాలుగు ట్రిమ్ లెవల్స్‌‌లో ఇప్పుడు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఇది, మారుతీ గ్రాండ్ విటారా రెండూ సుజుకీ గ్లోబల్-C ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడ్డాయి. అందుకే పనితీరు, మైలేజ్ పరంగా రెండూ ఒకే స్థాయిలో ఉంటూ, బ్రాండ్ ఫీల్ పరంగా మాత్రమే తేడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ SUVని కర్ణాటకలోని బిడాడిలోని టయోటా ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ NA పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, CNG మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

2025 Toyota Urban Cruiser Hyryder Details

ఈ ఎస్‌యూవీ 1.5-లీటర్ NA K15C మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో 102 bhp పవర్, 135 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు జోడించారు. హైబ్రిడ్ ఇంజిన్ 116 bhp పవర్, 141 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది AWD వేరియంట్‌లో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (6AT) తో వచ్చింది. ఇది 27 కి.మీల మైలేజ్ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 8, 2025, 10:50 [IST]
English summary
New 2025 toyota urban cruiser hyryder launched in india starting price at rs 11 34 lakh
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+