ఒక్కసారి చూస్తేనే ఫార్చ్యూనర్ కూడా టెన్షన్‌లో పడే డిజైన్.. రోడ్డుమీద రాజు వచ్చేస్తున్నాడు
హోండా పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది సెడాన్‌లు.. సివిక్, సిటీ, అమేజ్. ఎందుకంటే భారత మార్కెట్‌లో హోండాను సెడాన్ బ్రాండ్‌గా చూసే అభిమానం చాలా కాలంగా ఉంది. అయితే, జపాన్‌కు చెందిన ఈ ఆటో దిగ్గజం పెద్ద SUVలను రూపొందించడంలో కూడా ఎంత పెద్ద మాస్టర్ అనేది ప్రపంచ మార్కెట్ బాగా తెలుసు. అమెరికా, యూరప్ మార్కెట్లలో హోండా పైలట్, పాస్‌పోర్ట్, CR-V వంటి SUVలు ఇప్పటికే పెద్ద క్రేజ్ సృష్టించాయి. ఇప్పుడు అదే SUV DNAతో వచ్చిన ఒక భారీ మోడల్ భారత రోడ్లపైకి దిగేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో హోండా పైలట్ భారత మార్కెట్లో లాంచ్‌కు సిద్ధమవుతోంది.
ఈ SUV భారత లైనప్‌లో అడుగుపెట్టడం అంటే, ఇప్పటివరకు హోండాలో లేని ప్రీమియం ఫుల్-సైజ్ SUV గ్యాప్‌ను పూరించడమే కాదు, హోండా బ్రాండ్‌కు పూర్తిగా కొత్త హై-ఎండ్ ఇమేజ్‌ను తీసుకురానుంది. ఎందుకంటే పైలట్ పరిమాణం, డిజైన్, ఫీచర్లు, రీఫైన్మెంట్ అన్ని టాప్ క్లాస్. ఇది సింపుల్ SUV కాదు; హోండా తన ఇంటర్నేషనల్ మార్కెట్లలో అమ్మే ప్రీమియం 7-సీటర్ ఫుల్-సైజ్ SUVను ఇండియాకు తీసుకువస్తోంది.

హోండా పైలట్ భారత మార్కెట్‌కి వచ్చినా, ఇది చిన్న పోటీదారు కాదు. ముందుగా దాని ఎదురుగా నిలబడేది హ్యుందాయ్ భారతదేశంలో విడుదల చేయబోతున్న పాలిసేడ్ SUV. హ్యుందాయ్ పాలిసేడ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం SUV సిగ్మెంట్‌లో హృదయాలు గెలుచుకుంది. అటువంటి మోడల్‌తో పోటీ ఇవ్వడం అంటే హోండా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో అర్థం అవుతోంది. అంతేకాదు, ఇది టయోటా ఫార్చ్యూనర్‌కి కూడా పక్కా ప్రత్యర్థి అవుతుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.
పైలట్ ధర కొంచెం ఎక్కువగా ఉంటే కూడా, దాని లగ్జరీ రైడ్ హోండా అభిమానులను బాగా ఆకట్టుకుంటుందని అంచనా. కొత్త 2026 హోండా పైలట్, శక్తి, రీఫైన్మెంట్‌కు ప్రతీకగా నిలిచే ఒక శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో ఉండే 3.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ V6 ఇంజిన్ హోండా SUVల సిగ్నేచర్ పవర్‌ట్రెయిన్ అని చెప్పాలి. ఈ ఇంజిన్ 285 bhp పవర్, 355 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

దీన్ని 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయడం వల్ల గేర్‌షిఫ్ట్‌లు మరింత స్మూత్‌గా, డ్రైవింగ్ అనుభవం మరింత ప్రీమియంగా మారుతుంది. ఇది ప్రామాణికంగా ఫ్రంట్-వీల్ డ్రైవ్‌తో వస్తోంది. అయితే, భారత రోడ్లలో, ముఖ్యంగా కఠినమైన భూభాగాలు, గిరి ప్రాంతాలు, అడ్వెంచర్ రూట్లు ఇష్టపడే డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా మెకానికల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను హోండా ఎంపికగా అందిస్తోంది. దీని వలన పైలట్ SUV ఆఫ్-రోడింగ్ సన్నివేశాల్లో కూడా నమ్మకంగా పనిచేస్తుంది.
హోండా రియల్-టైమ్ AWD ట్యూనింగ్ ఉన్నందున, స్లిప్పరీ రోడ్డులు, ఇసుక మోసే ప్రాంతాలు లేదా మట్టి పైన కూడా మంచి ట్రాక్షన్ అందుతుంది. ధరల విషయానికి వస్తే, 2026 హోండా పైలట్ ప్రీమియమ్ SUV సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతున్నది. బేస్ కాన్ఫిగరేషన్ దాదాపు రూ. 36 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉండనుంది. మరింత లగ్జరీతో కూడిన టాప్ మోడల్ ధర దాదాపు రూ. 49 లక్షల వరకు వెళ్లొచ్చు.

ఈ కొత్త కారులో గూగుల్ మ్యాప్స్, గూగుల్ వాయిస్ వంటి ముఖ్యమైన సేవలను స్మార్ట్‌ఫోన్‌ను జత చేయకుండానే స్థానిక యాప్‌ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఇది 5G వై-ఫై హాట్‌స్పాట్ ఇస్తుంది. కొత్త సెమీ-టెంపర్డ్ డోర్ గ్లాస్, డోర్ ఇన్సులేటర్లు, సీటింగ్ ఆకట్టుకుంటాయి. లోపల పెద్ద డిస్ప్లేతో పాటు, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , ప్రమాదంలో ప్రయాణికుల ప్రాణాలు రక్షించడానికి అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలు ఉంటాయి.


Click it and Unblock the Notifications








