కొత్త కార్ల పండుగ.. ఏప్రిల్ 2025లో భారతీయ మార్కెట్‌లో విడుదల కానున్న మోడల్స్ ఇవే !
భారతీయ వాహనదారులను ఆకర్షించేందుకు ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు ఏప్రిల్ 2025లో సరికొత్త కార్లను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెలలో కొత్త కార్లతో పాటు ఇప్పటికే ఉన్న మోడళ్ల అప్డేటెడ్ వెర్షన్లు కూడా విడుదల కానున్నాయి. గత నెలల మాదిరిగానే, ఈ ఏప్రిల్‌లో కూడా దేశీయ ఫోర్ వీలర్ విభాగంలో సందడి నెలకొననుంది. ఈ ఏప్రిల్‌లో విడుదల కానున్న టాప్ 5 కార్ మోడల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
కియా కారెన్స్ : కియా కారెన్స్ మనదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన MPV కార్ మోడళ్లలో ఒకటి. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో కియా ఈ కారును అప్టేడ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అప్డేట్ కారెన్స్ కారు టెస్ట్ డ్రైవ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నెలలోనే ఈ కారు అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

ఈ అప్‌డేట్‌లో భాగంగా ఈ కారు అద్భుతమైన LED DRLలు, అప్డేట్ బంపర్, అల్లాయ్ వీల్స్, LED లైట్లు వంటి మార్పులను పొందుతుందని భావిస్తున్నారు. అయితే, ఖచ్చితమైన మార్పుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఈ కారు రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్ ఆఫ్షన్లలో అందుబాటులో ఉంది. అప్డేట్ మోడల్‌లో కూడా ఇదే ఇంజన్ ఆఫ్షన్లను కొనసాగే అవకాశం ఉంది.
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్: వోక్స్‌వ్యాగన్ టిగువాన్ మోడల్‌కు ప్రీమియం కార్ ప్రియుల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు, మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి, వోక్స్‌వ్యాగన్ ఈ కారు స్పోర్టీ వెర్షన్ అయిన టిగువాన్ ఆర్-లైన్‌ను విడుదల చేయబోతోంది. పూర్తిగా దిగుమతి చేసుకుని విక్రయించబడే ఈ కారు ధర రూ. 50 లక్షలు దాటే అవకాశం ఉంది.

ఈ కారును ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నారు. సాధారణ టిగువాన్ కంటే ఇది కేవలం లుక్స్‌లోనే కాకుండా పవర్ డెలివరీలో కూడా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ మోటార్ ఉంటుందని అంచనా, ఇది 190 PS పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
స్కోడా కోడియాక్ 2025 : ఈ నెల 16న రిలీజ్ కానుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.40లక్షలు ఉండవచ్చని అంచనా. ఈ కారు రెండు వేర్వేరు ఆఫ్షన్లు, అనేక ప్రీమియం ఫీచర్లతో అమ్మకానికి రానుంది. ఇందులో 13-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు. కోడియాక్ మునుపటి వెర్షన్ మాదిరిగానే, 2025 కోడియాక్ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు.

BMW 2 సిరీస్: BMW 2 సిరీస్ కొత్త తరం వెర్షన్ త్వరలో ఇండియాలో అమ్మకానికి రాబోతుంది. BMW ఈ కారును ప్రపంచవ్యాప్తంగా గత అక్టోబర్‌లో విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఏప్రిల్‌లో ఇది భారతీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ కారు దాని మునుపటి మోడల్ కంటే మరింత ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది.
అంతేకాకుండా, కొత్త 2 సిరీస్‌లో ప్రీమియం, లగ్జరీ ఫీచర్లు కూడా చాలా ఉన్నాయి. ఇది అప్డేట్ గ్రిల్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED టెయిల్ లైట్లు, పొడవైన రూపాన్ని కలిగి ఉంది. దీని వలన కొత్త 2 సిరీస్ స్పేస్ పరంగా మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.

మారుతి ఇ-విటారా: భారతీయ వాహనదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కారు మారుతి ఇ-విటారా. ఇది మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV మోడల్ కావడం విశేషం. ఇప్పటికే మనదేశంలో ఈ కారు ఉత్పత్తి ప్రారంభమైందని సమాచారం. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కార్లను షోరూమ్‌లకు తరలించే ప్రక్రియ కూడా మొదలైంది.
గత జనవరిలో దీని లాంచ్ ఈవెంట్ జరగడంతో, ఈ నెలలో ఈ కారు అమ్మకానికి వస్తుందని భావిస్తున్నారు. అయితే, విడుదల తేదీపై మారుతి సుజుకి గోప్యత పాటిస్తోంది. మారుతి సుజుకి ఇ-విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభించనుంది. అవి 48.8kWh, 61.1kWh. ఇది గరిష్టంగా 500కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని అంచనా. ప్రీమియం ఫీచర్లతో పాటు ఎక్కువ రేంజ్ అందించే అత్యుత్తమ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఈ ఏప్రిల్‌లో మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే, అమ్మకానికి హై-ఎండ్ నుంచి లో-ఎండ్ వరకు అన్ని రకాల వాహనాలు ఉన్నాయి. కాబట్టి, ఈ ఏప్రిల్ నెల కారు ప్రేమికులకు నిజంగా ఒక పండుగలాంటి సమయం కానుంది. మంచి కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








