కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఆగండి.. 3నెలల్లో అద్భుతమైన 11కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్

ఈ ఏడాది కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే తొందరపడకండి రాబోయే మూడు నెలల్లో మార్కెట్‌లోకి వరుసగా 11 కొత్త కార్లు అడుగుపెట్టనున్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు మహీంద్రా, హ్యుందాయ్, టాటా, మారుతి, ఎంజీ వంటివి తమ పాపులర్ మోడల్స్‌కు అప్‌డేటెడ్ వెర్షన్లు, ఫేస్‌లిఫ్ట్‌లు, సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయబోతున్నాయి.

ఈ కొత్త మోడళ్లలో డిజైన్ మార్పులు, ఎక్స్ ట్రా పీచర్లు, ఇంకా మెరుగైన ఇంజిన్ ఆప్షన్లు, అడ్వాన్సుడ్ టెక్నాలజీలు ఉండబోతున్నాయి. మరి కొత్త కారు కొనే ముందు ఈ లిస్టును ఓ సారి పరిశీలించండి. రాబోయే మూడు నెలల్లో ఏయే కార్లు విడుదల కాబోతున్నాయో, వాటి విశేషాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

New Car Launch Alert 11 Exciting Models Coming in Next 3 Months

1. మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ :
మహీంద్రా తన 3 డోర్ థార్ కారుకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రెడీ చేస్తోంది. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే పెద్దగా బయటి మార్పులు ఉండకపోవచ్చు, కానీ లోపల చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా థార్ రాక్స్ మోడల్లో ఉన్న స్టీరింగ్ వీల్, కొత్త డోర్ ప్యాడ్‌లు వంటివి అందించవచ్చని అంచనా. ఇంజిన్ ఆప్షన్లు మాత్రం ప్రస్తుత మోడల్‌లో ఉన్నవే కొనసాగే అవకాశం ఉంది.

2. మహీంద్రా బొలెరో :
మహీంద్రా బొలెరో కారుకు కూడా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రాబోతోంది. ఇందులో చిన్నపాటి స్టైల్ మార్పులు, ఇంకా అదనంగా కొన్ని ఫీచర్లు రాబోతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న mHawk 75 డీజిల్ ఇంజిన్‌తోనే ఇది వస్తుంది. ఇది 75 bhp పవర్, 210 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, రేర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటాయి. అక్టోబర్‌లో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది.

New Car Launch Alert 11 Exciting Models Coming in Next 3 Months

3. మహీంద్రా బొలెరో నియో :
మహీంద్రా బొలెరో నియోను కూడా అప్‌డేట్ చేసి విడుదల చేయాలని యోచిస్తోంది. TUV 300 SUV కారు ఆధారంగా ఇది అప్‌డేట్ అవుతుందని భావిస్తున్నారు. ఇందులో లాంగ్ గ్రిల్, కొత్త బంపర్లు, చిన్న కాస్మెటిక్ మార్పులు ఉండవచ్చు. మొత్తం డిజైన్, పవర్‌ట్రెయిన్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

4. హ్యుందాయ్ వెన్యూ :
హ్యుందాయ్ వెన్యూ కారుకు రెండో తరం అప్‌డేట్ రాబోతోంది. ఇందులో ముందు భాగంలో అగ్రెసివ్ డిజైన్, పెద్ద గ్రిల్, రెక్టాంగ్యులర్ LED హెడ్‌లైట్, కొత్త బంపర్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్, లోపల రెండు కనెక్టెడ్ స్క్రీన్‌లు ఉంటాయి. ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని, ప్రస్తుత మోడల్‌లో ఉన్నవే కొనసాగే అవకాశం ఉందని అంచనా.

New Car Launch Alert 11 Exciting Models Coming in Next 3 Months

5. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ :
టాటా పంచ్ పెట్రోల్ ఇంజిన్ కారుకు ఒక ముఖ్యమైన ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. ఈ కారు ముందు భాగంలో ప్రస్తుత పంచ్ కారులోని డిజైన్ కొనసాగుతుంది. కొత్త అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన బంపర్‌లు ఉంటాయి. లోపల పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ముందు సీట్లు ఉంటాయి. ఇంజిన్ ప్రస్తుత 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది.

6. ఎంజీ మెజెస్టర్ :
టయోటా ఫార్చ్యూనర్ కారుకు పోటీగా ఎంజీ మెజెస్టర్ కారును ఎంజీ విడుదల చేయబోతోంది. ఎంజీ ఇప్పటికే విక్రయిస్తున్న గ్లోస్టర్ కారుతో పాటు దీనిని విక్రయించాలని యోచిస్తోంది. ఇందులో పెద్ద గ్రిల్, కొత్త LED హెడ్‌లైట్, రగ్గెడ్ బంపర్, యాంగులర్ DRL వంటివి ఉంటాయి.

New Car Launch Alert 11 Exciting Models Coming in Next 3 Months

ఈ కారు లోపల కొత్త 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, లెవెల్ 2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి. దీపావళికి ముందు ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది.

7. టాటా సియెర్రా ఈవీ :
టాటా తన సియెర్రా ఈవీ కారును త్వరలో విడుదల చేయాలని యోచిస్తోంది. ఇది ఒక మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కారుగా మార్కెట్‌లోకి వస్తుంది. ఈ కారు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE6, ఎంజీ విండ్సర్ ఈవీ వంటి కార్లకు పోటీగా రాబోతోంది. ఇందులో మస్కులర్ డిజైన్, ముందు భాగంలో LED హెడ్‌లైట్, LED DRL వంటి ఫీచర్లు ఉన్నాయి.

New Car Launch Alert 11 Exciting Models Coming in Next 3 Months

8. టాటా హారియర్, సఫారీ పెట్రోల్ :
టాటా తన హారియర్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కారు, సఫారీ కార్లను అప్‌డేట్ చేసి విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కార్లు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. త్వరలో ఈ కార్లను టాటా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

9. మారుతి ఇ-విట్టారా ఈవీ :
మారుతి తన మొదటి ఎలక్ట్రిక్ కారు అయిన ఇ-విట్టారాను ఈ దీపావళికి విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కారులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. 48.8kWh, 61.1kWh. ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీల వరకు రేంజ్ అందిస్తుంది. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది.

New Car Launch Alert 11 Exciting Models Coming in Next 3 Months

10. మహీంద్రా XUV.3XO ఈవీ :
మహీంద్రా తన XUV.3XO కారుకు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ కారు ప్రస్తుతం విక్రయిస్తున్న XUV 400 కారుకు బదులుగా వస్తుందని భావిస్తున్నారు. ఈ కారులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: రాబోయే 3 నెలల్లో వరుసగా అనేక కొత్త కార్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఈ కార్లు అన్నీ మార్కెట్‌లో మంచి ఆదరణ పొందినవి. చాలా మంది ఈ కార్ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కారు ధరలు తగ్గే అవకాశం ఉన్నందున, కొత్త కారు కొనేవారికి ఇది మంచి అవకాశం.

More from DriveSpark

Article Published On: Monday, September 29, 2025, 8:56 [IST]
English summary
New car launch alert 11 exciting models coming in next 3 months
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+