కొత్త కారు కొనాలనుకుంటున్నారా ? కాస్త ఆగండి.. వచ్చే నెలలో అదిరిపోయే 6 కార్లు రాబోతున్నాయ్

2025 సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది. అయినా ఈ ఏడాది ఆటోమొబైల్ మార్కెట్‌కు ఒక ముఖ్యమైన సంవత్సరంగా నిలిచింది. జీఎస్‌టీ తగ్గింపు వంటి ప్రయోజనాలు కారు అమ్మకాలకు అద్భుతమైన మైలేజీని ఇచ్చాయి. సంవత్సరం చివరికి వస్తున్నప్పటికీ కొత్త కార్లు ఇంకా మార్కెట్‌లోకి రాబోతున్నాయి. వచ్చే నెలలో కొన్ని ముఖ్యమైన మోడళ్లతో సహా అద్భుతమైన కార్లు ఇండియాలో విడుదల కాబోతున్నాయి. వీటిలో ఒక క్లాసిక్ ఎస్‌యూవీ తిరిగి రావడం కూడా 2025 నవంబర్ నెలలో చూడవచ్చు. వచ్చే నెలలో భారతీయులను ఆకర్షించనున్న కొత్త కార్లు ఏవో చూద్దాం.

హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)
ఆరు సంవత్సరాల తర్వాత దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి జనరేషన్ మార్పు రాబోతోంది. ఇప్పటికే ఇతర వివరాలను వెల్లడించిన కంపెనీ, కొత్త తరం వెన్యూ ధరను నవంబర్ 4న అధికారికంగా ప్రకటించనుంది. ఈ సెగ్మెంట్ ఇంతవరకు చూడని ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ రోడ్లపైకి రానుంది.

New Cars Launching in November 2025 Tata Sierra Re-entry Fronx Flex Fuel and More

డ్యుయల్-టోన్ ఇంటీరియర్, క్లైమేట్ కంట్రోల్ కోసం కొత్త ఇంటర్‌ఫేస్, అప్‌డేట్ చేసిన సెంటర్ కన్సోల్, వెంటిలేటెడ్ సీట్లు, డ్రైవ్, ట్రాక్షన్ మోడ్‌లు, లెవల్ 2 ADAS, డ్యుయల్ 12.3 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేలు, OTA అప్‌డేట్‌లు వంటి లగ్జరీ ఫీచర్లను కూడా న్యూ-జెన్ హ్యుందాయ్ వెన్యూ పొందుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎస్‌యూవీ 1.2 లీటర్ ఎన్‌ఏ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లలో కొనసాగుతుంది.

టాటా సియెరా (Tata Sierra)
మూడు మొబిలిటీ ఎక్స్‌పోలలో ప్రదర్శించబడిన టాటా సియెరా నవంబర్ 25న అధికారికంగా మార్కెట్‌లోకి రాబోతుందని కంపెనీ ధృవీకరించింది. కొత్త సియెరా మోడల్‌లో ఒరిజినల్ సియెరా ఐకానిక్ డిజైన్ అంశాలన్నింటినీ సమర్థవంతంగా పునరుద్ధరించారు. ఇందులో ముఖ్యంగా విశాలమైన స్కైలైన్స్, వెనుక భాగంలో ప్రత్యేకమైన సైడ్ గ్లాస్ రూఫ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

New Cars Launching in November 2025 Tata Sierra Re-entry Fronx Flex Fuel and More

ఈ రెట్రో ఎలిమెంట్స్‌ను సరికొత్త ఫ్యూచరిస్టిక్ టాటా డిజైన్ లాంగ్వేజ్తో సమన్వయం చేయడం జరిగింది. ఇది ఆధునిక స్టైలింగ్‌తో పాటు, ఆకర్షణీయమైన రోడ్ ప్రెజెన్స్‌ను అందిస్తుంది.

కర్వ్, సఫారీ, హారియర్ మాదిరిగానే సియెరా ఇంటీరియర్ ఉంటుంది. కానీ ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌తో లోపలి భాగం డిజైన్ చేశారు. టాటా 1.5 లీటర్ GDi టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు న్యూ-జెన్ సియెరాకు శక్తినిస్తాయి. దీంతో పాటు ఎలక్ట్రిక్ మోడల్ కూడా ఉంటుందనే విషయం ఎలక్ట్రిక్ వెహికల్ లవర్స్‎ను సంతోష పెట్టనుంది.

New Cars Launching in November 2025 Tata Sierra Re-entry Fronx Flex Fuel and More

మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (Maruti Fronx Flex Fuel):
2025 జపనీస్ మొబిలిటీ షోలో మారుతి సుజుకి తమ మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ ఎడిషన్‌ను ఆధారంగా చేసుకున్న ఈ మోడల్ వచ్చే నెలలో ఇండియాలో కూడా విడుదలవుతుందని సమాచారం అందింది. ఈ ప్రత్యేక మోడల్ ఇండియాలో రాకపోయినా, ఎర్టిగా నుండి దాని పైనున్న అన్ని మోడళ్లలో కంపెనీ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌ను అందించవచ్చు.

మారుతి విక్టోరిస్ బయోగ్యాస్ (Maruti Victoris Biogas):
ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో పాటు విక్టోరిస్ బయోగ్యాస్ ఎడిషన్ కూడా ఇండియాలో విడుదల కావచ్చు. ఇది సిఎన్‌జి విక్టోరిస్ అదే ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంటుంది. భారతదేశంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ అవకాశాలను ఉపయోగించుకోవడానికి వాహన తయారీదారు చేస్తున్న ప్రయత్నాలలో విక్టోరిస్ CBG కూడా భాగం కానుంది.

New Cars Launching in November 2025 Tata Sierra Re-entry Fronx Flex Fuel and More

కొత్త లెక్సస్ ఎల్ఎస్ (New Lexus LS):
ఇటీవల లెక్సస్ తన ఫ్లాగ్‌షిప్ ఎల్ఎస్ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసింది. కానీ అదే పేరుతో ఒక లగ్జరీ ఎంపీవీని రూపొందించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఈ మోడల్ హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వాహనంగా మార్కెట్‌లోకి రానుంది. లాంజ్ సీటింగ్‌తో, ఆరెంజ్ బ్యాక్‌లైటింగ్‌తో కూడిన 6 వీలర్ వెహికల్ టీజర్ ఫోటోలను కూడా కంపెనీ రిలీజ్ చేసింది.

More from DriveSpark

Article Published On: Friday, October 31, 2025, 12:01 [IST]
English summary
New cars launching in november 2025 tata sierra re entry fronx flex fuel and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+