నవంబర్ 4న మొనగాడు దిగుతున్నాడు.. హుంద్యాయ్ కొత్త కారుతో మారుతి, టాటాలకు చెమటలు పక్కా
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో హ్యుందాయ్ వెన్యూ ఒకటి. 2019లో విడుదలైన హుంద్యాయ్ వెన్యూ, 4 మీటర్ల లోపు పొడవు ఉండే ఒక చిన్న ఎస్యూవీ. ఈ కారు కొత్త మోడల్ విడుదల తేదీ బయటపడింది. ఆటోకార్ ఇండియా వెబ్‌సైట్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. కొత్త మోడల్ హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 4న రిలీజ్ కానుంది.
తాజా నివేదిక ప్రకారం.. కొత్త హ్యుందాయ్ వెన్యూ లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఈ ఫీచర్లు డ్రైవర్‌కు మరింత సేఫ్టీని, సౌలభ్యాన్ని అందిస్తాయి.

అదనంగా 20.32 సెం.మీ. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, పనోరమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్లు, వైర్‌లెస్ సెల్‌ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లను కూడా కొత్త హుండాయ్ వెన్యూలో అందించే అవకాశం ఉంది. ఈ అడ్వాన్సుడ్ ఫీచర్లతో కొత్త వెన్యూ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటుదని అంచనా వేస్తున్నారు.
కారు పర్ఫామెన్స్ పరంగా.. ప్రస్తుత మోడల్‌లో అందించిన అదే ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లను కొత్త హ్యుందాయ్ వెన్యూలో కొనసాగించే అవకాశం ఉంది. దీని ప్రకారం 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT ఆప్షన్లు కూడా అందించే అవకాశం ఉంది. ఇది కస్టమర్లు వారి అవసరాలకు తగినట్లుగా ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లను ఎంచుకునే వెసులుబాటును ఇస్తుంది.

భారత మార్కెట్‌లో హ్యుందాయ్ వెన్యూ ప్రస్తుత ధర బేస్ వేరియంట్‌కు రూ.7.26 లక్షలు. అదే సమయంలో దాని టాప్ వేరియంట్ ధర రూ.12.46 లక్షలు. ఈ ధరలు హ్యుందాయ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఎక్స్-షోరూమ్ ధరలు. అయితే, కొత్తగా వస్తున్న అప్‌డేట్‌లు, అడ్వాన్సుడ్ ఫీచర్ల కారణంగా కొత్త హ్యుందాయ్ వెన్యూ ధర కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ధర ఎంత ఉంటుందో నవంబర్ 4న విడుదలైన తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం : కొత్త హ్యుందాయ్ వెన్యూ రాక మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా XUV300, రెనాల్ట్ ట్రైబర్, నిస్సాన్ మాగ్నైట్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి పోటీ కార్ల అమ్మకాలకు గట్టి సవాలును విసిరే అవకాశం ఉంది. ఈ విభాగంలో ఇప్పటికే చాలా పోటీ ఉన్నందున, వెన్యూ కొత్త మోడల్ మార్కెట్‌లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








