దేశంలోనే జనాలు ఎక్కువగా బుక్ చేసుకుంటున్న కారు.. రెస్పాన్స్ చూసి కంపెనీయే షాక్ అయ్యింది!
హ్యూందాయ్ (Hyundai) భారత మార్కెట్‌ను మరింతగా ఆకర్షించేందుకు గత నెలలోనే తన కొత్త తరం వెన్యూ ఎస్‌యూవీ(Venue Suv)ని అధికారికంగా విడుదల చేసింది. విడుదలైన నిమిషం నుంచే ఈ మోడల్‌పై వచ్చిన స్పందన కంపెనీ అంచనాలను మించి వెళ్లింది. ఎందుకంటే హ్యూందాయ్ వెన్యూ దేశీయ మార్కెట్లో ఇప్పటికే బెస్ట్‌సెల్లర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న SUV. ఇప్పుడు దీని కొత్త తరం మోడల్ రావడంతో కస్టమర్లలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త వెన్యూ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొన్ని వారాల్లోనే 32,000కు పైగా బుకింగ్‌లు అందుకుంది. ఈ సంఖ్య ఒక్కటే వినియోగదారుల్లో ఈ కారుపై ఉన్న నమ్మకం, ఆసక్తి ఎంత ఎక్కువదో చెప్పడానికి సరిపోతుంది. ముఖ్యంగా, యంగ్ కస్టమర్లు, కుటుంబ కార్ కొనుగోలుదారులు ఈ SUV వైపు పెద్దఎత్తున మొగ్గు చూపుతున్నారు.
కొత్త తరం వెన్యూ పాత మోడల్‌తో పోలిస్తే అనేక అప్‌డేట్‌లతో మరింత ఆధునికంగా మారింది. డిజైన్ పరంగా చూస్తే, ఇది ఇప్పుడు ఇంకా పెద్దగా, మరింత బలంగా, పూర్తిగా స్పోర్టీ లుక్‌తో కనిపిస్తుంది. బాడీ ప్రొపోర్షన్స్‌ను మెరుగుపరచడం వల్ల రోడ్డుపై SUVకి మరింత డామినెంట్ ప్రెజెన్స్ వచ్చింది. ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్ డిజైన్, రియర్ ప్రొఫైల్ అన్నీ కూడా మార్చబడడంతో కొత్త మోడల్ ఒక క్లాస్‌కి మరో క్లాస్‌గా మారిపోయింది.

హ్యుందాయ్ తన కొత్త తరం 'వెన్యూ' SUVని అత్యంత అందుబాటు ధర అయిన రూ. 7.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. ధర విషయంలోనే కాదు, ఫీచర్లు-పనితీరు-డిజైన్ అంశాల్లోనూ ఈ కొత్త వెన్యూ ఇప్పుడు మరింతగా ప్రజలను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగస్తులకు ఈ ధర చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇది తమ బడ్జెట్‌లోకి సరిపోయే మోడల్‌గా నిలుస్తోంది.
కొత్త వెర్షన్‌లో హ్యుందాయ్ డిజైన్‌ను పూర్తిగా రిఫ్రెష్ చేసింది. ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, సరికొత్త స్పోర్టీ లుక్, హై-టెక్ ఫీచర్లు ఈ మోడల్‌ను గత జెనరేషన్‌తో పోలిస్తే మరింత ప్రీమియంగా చూపిస్తున్నాయి. కారు సైజు కూడా ఇప్పుడు ఇంకా పెద్దదైందని కంపెనీ చెబుతోంది, దీని వల్ల ఇన్స్‌సైడ్ స్పేస్ మరింత మెరుగయ్యింది. ఫ్యామిలీ ఉపయోగానికి బాగా సూటయ్యేలా మొత్తం క్యాబిన్ సెటప్‌ను సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు.

పర్ఫార్మెన్స్ విషయంలోనూ హ్యుందాయ్ ఎలాంటి రాజీ పడలేదు. కొత్త తరం వెన్యూ మూడు విభిన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది, కప్పా 1.2L MPi పెట్రోల్ ఇంజిన్, కప్పా 1.0L టర్బో GDi పెట్రోల్ ఇంజిన్, శక్తివంతమైన U2 1.5L CRDi డీజిల్ ఇంజిన్. ఈ డీజిల్ ఇంజిన్ మంచి పనితీరును కోరుకునే కస్టమర్ల కోసం రూపొందించబడింది. మైలేజ్, పవర్ ఆల్‌రౌండ్‌గా మంచి ఫలితాలను ఇస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది.
ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, హ్యూందాయ్ ఈ సారి టెక్నాలజీ, కంఫర్ట్ రెండింటినీ దగ్గరగా కలిపి మరింత ప్రీమియం ఫీల్ ఇచ్చేలా డిజైన్ చేసింది. క్యాబిన్ స్పేస్ పెరగడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం లభిస్తుంది. మెటీరియల్స్ క్వాలిటీ, సీట్ కంఫర్ట్, కనెక్టివిటీ అంశాలు ఆధునిక SUVలను తలపించేలా ఉన్నాయి. సంవత్సరాలుగా కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో వెన్యూ తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది.

ఇప్పుడు నూతన తరం మోడల్ వచ్చి, విపరీతమైన స్పందన తెచ్చుకోవడం చూస్తుంటే, ఈ SUV మరోసారి మార్కెట్లో దుమ్మురేపేలా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే, కొత్త వెన్యూ ఇప్పుడు అందుబాటు ధర, ఆధునిక ఫీచర్లు, మెరుగైన డిజైన్, పలు ఇంజిన్ ఆప్షన్ల ప్యాకేజ్‌గా వచ్చింది. అందుకే మార్కెట్లో డిమాండ్ కూడా రోజురోజుకు పెరుగుతూ ఉండటం సహజమే.


Click it and Unblock the Notifications








