సరికొత్త మారుతి ఆల్టో వచ్చేస్తోంది! 30 కి.మీ మైలేజ్‌తో అదిరిపోయే అప్‌డేట్స్.. అంచనాలు పెంచిన స్టైలిష్ డిజైన్!

భారతదేశంలో పేద, మధ్యతరగతి వారు కొనుగోలు చేయగలిగే విధంగా అందుబాటు ధరలో కార్లను విడుదల చేయడంలో బాగా ప్రసిద్ధి వాహన కంపెనీ మారుతీ సుజుకీ(Maruti Suzuki). ఈ కంపెనీ ప్రసిద్ధ కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఆల్టో(Alto) ఒకటి. బడ్జెట్ కారుగా మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ, ఈ చిన్న కార్ తన మైలేజ్, నమ్మకమైన ఇంజిన్, ఆర్థికంగా సరసమైన ధరతో లక్షలాది మంది ప్రజలను ఆకర్షించింది. భారతీయుల మనసును దోచిన కార్లలో ఆల్టో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చాలా కాలంగా మార్కెట్లో పేద, మిడిల్ క్లాస్ వారికి కారు లేని లోటును తీరుస్తున్న కంపెనీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడ కొత్తగా తన కారును అప్‌డేట్ చేస్తూనే ఉంది. అందుకే దీన్ని జనాలు ఇప్పటికి కూడా బాగా ఆదరిస్తున్నారు. మార్కెట్లో ఎన్ని మోడళ్లు ఉన్నప్పటికీ కూడా దీనికి మాత్రం స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది.

ఇప్పటికే చాలా సార్లు అప్‌డేట్ అవుతూ కొత్తగా వచ్చిన మారుతీ సుజుకీ ఆల్టో త్వరలో మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్‌తో ఆకట్టుకునే డిజైన్‌తో అడగుపెట్టడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కొత్త వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మనం ఇప్పటి వరకు చూడని విధంగా ఈ కొత్త తరం ఆల్టోను మారుతీ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇతర ఆల్టోలకు చాలా భిన్నంగా మరింత అట్రాక్టివ్‌గా ఉంటుందని చెబుతున్నారు.

New Generation Maruti Suzuki Alto Will Be Launch Soon

సమాచారం ప్రకారం, కొత్త తరం ఆల్టో ప్రస్తుతం రోడ్డుపై ఉన్న ఆల్టో కంటే 100 కిలోల తక్కువ బరువుతో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తుంది. కంపెనీ ప్రధానంగా ఆల్టో కారు బరువును చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతుంది. అయితే ఇలా బరువు తగ్గించడం వలన మైలేజ్ కూడా ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గినట్లయితే రోడ్డుపై ఇది సాఫీగా ప్రయాణిస్తుంది.

ఈ కొత్త తరం ఆల్టోలో ఇప్పటి వరకు చూడని విధంగా శక్తివంతమైన హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందిస్తున్నారని తెలుస్తుంది. దీంతో ఇది ఫెర్ఫామెన్స్ విషయంలో అదిరిపోయే విధంగా ఉండే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం 48-వోల్ట్ సూపర్ ఎనర్జీ ఛార్జింగ్ సిస్టమ్‌ను దీనిలో అందించవచ్చు. దీని ద్వారా ఆల్టోను మైలేజ్ మరింత ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం మైలేజ్ కార్లకు డిమాండ్ ఉన్న కారణంగా ఆల్టోను కూడా ఇదే కోవలో తెస్తున్నారు.

New Generation Maruti Suzuki Alto Interior

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రాబోయే కొత్త తర మారుతీ సుజుకీ ఆల్టో లీటరుకు దాదాపు 30 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని తెలుస్తుంది, కానీ ఇది ఖచ్చితమైన సమాచారం కానప్పటికి, ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యాచ్‌బ్యాక్ కార్లు చాలా వరకు 20 కి.మీలకు పైనే మైలేజ్‌ను ఇస్తున్నాయి. ఈ క్రమంలో మరింత ఎక్కువ మైలేజ్ అందించినట్లయితే కస్టమర్లకు బాగా చేరువ అవుతుంది.

Take a Poll

ఇప్పుడు మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న మూడో తరం ఆల్టో లీటరుకు 25.2 కి.మీ నుండి 27.7 కి.మీ మైలేజీని తిరిగి ఇస్తుంది. కాబట్టి దీన్ని 30 కి.మీలు లేదా అంతకంటే ఎక్కువ మైలేజ్‌ ఇచ్చేలా రూపొందించడం పెద్ద విషయం కాదు. ముఖ్యంగా బరువు దాదాపు 100 కిలోల వరకు తగ్గే అవకాశం ఉంది కాబట్టి, మైలేజ్ ఇంకా ఎక్కువ పెంచడానికి కంపెనీ దృష్టి సారిస్తోంది.

New Generation Maruti Suzuki Alto Seating

కొత్త తరం ఆల్టో కొత్త రూపంతో రాబోతుందని తెలుస్తుంది. ఇమేజ్ సోర్స్: bestcarweb ప్రకారం, ఇదిమరింత ఆకర్షణీయంగా, అందమైన హెడ్‌లైట్లు, గ్రిల్, బంపర్, వీల్స్, స్టైలిష్‌గా కనిపించే ముందు, వెనుక రూపం అన్ని కూడా ఆల్టోను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఈ కొత్త తరం ఆల్టో మొదట జపాన్‌లో 2026 లో అమ్మకానికి వస్తుంది. తరువాత భారత్‌లో లాంచ్‌పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 20, 2025, 14:50 [IST]
English summary
New generation maruti suzuki alto will be launch soon with 30km mileage and 100kg weight reduction
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+