ఏం లుక్కురా బాబు.. కాలు పెడితే రాకెట్ లా దూసుకుపోతుంది.. కొత్త వెన్యూ N లైన్ చూశారా?
ఎస్‌యూవీ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త మోడల్ కొనాలని అనుకుంటే ఏది కొనాలని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇందులో మిడిల్ క్లాస్ వారికి సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలంటే చాలా ఇష్టం. కుటుంబానికి సరిపడా సైజు, బడ్జెట్, మైలేజ్ అన్నీ వీటి ప్రత్యేకతలు. ఇప్పుడు అందరినీ ఆకట్టుకోవడానికి కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) సిద్ధంగా ఉంది. నవంబర్ 4న లాంచ్ కానున్న ఈ పెద్ద మోడల్ ఫోటోలు, ఇతర వివరాలను బయటపెట్టి దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ అంచనాలను పెంచుతోంది.
వెన్యూ N లైన్ బుకింగ్స్ షురూ
ఇప్పుడు వెన్యూ N లైన్ పర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. గతంలో స్టాండర్డ్ వేరియంట్‌ల బుకింగ్స్, ఇతర వివరాలను బ్రాండ్ వెల్లడించింది. స్టాండర్డ్ వేరియంట్‌ల కంటే మరింత గ్లామరస్‌గా, స్పోర్టియర్‌గా N లైన్ వెర్షన్‌ను హ్యుందాయ్ సిద్ధం చేసింది. డ్రైవింగ్ ఇష్టపడే వారిని ఈ కొత్త తరం మోడల్ అన్ని విధాలుగా ఆకట్టుకుంటుందని చెప్పగలం.

కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ N లైన్ కొనుగోలు చేయాలనుకునే వారు రూ.25,000 టోకెన్ చెల్లించి ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ చేసిన స్పోర్టియర్ వేరియంట్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో N6, N10 అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఐదు మోనోటోన్, మూడు డ్యూయల్ టోన్ స్కీమ్‌లతో సహా 8 కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.
డిజైన్, కలర్స్
మోనోటోన్ షేడ్‌లలో అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, డ్రాగన్ రెడ్, అబిస్ బ్లాక్, హాజెల్ బ్లూ ఉన్నాయి. డ్యూయల్ టోన్ పాలెట్‌లో అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్, హాజెల్ బ్లూ విత్ అబిస్ బ్లాక్ రూఫ్, డ్రాగన్ రెడ్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ మోడల్‌లతో పోలిస్తే కొన్ని చిన్నపాటి అప్ డేట్స్ చూడవచ్చు.

ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ ఫీచర్లు
రెడ్ హైలైట్‌లతో కొత్త ఫ్రంట్, రియర్ బంపర్‌లు, N లైన్ లోగోతో డార్క్ క్రోమ్ గ్రిల్, డార్క్ మెటాలిక్ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లు, ఎల్‌ఈడీ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, బాడీ కలర్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, N లైన్ ఎంబ్లమ్‌తో 17 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, సైడ్ సిల్ గార్నిష్, రెడ్ హైలైట్‌లతో రూఫ్ రైల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్లు, కొత్త స్పాయిలర్, ట్విన్ టిప్ ఎగ్జాస్ట్ వంటివి ఎక్స్‌టీరియర్‌లోని ప్రధాన హైలైట్‌లు.
ఇంటీరియర్ విషయానికి వస్తే, వెన్యూ N లైన్ క్యాబిన్ కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. కాంట్రాస్టింగ్ రెడ్ హైలైట్‌లు, N బ్రాండింగ్‌తో లెదరెట్ సీట్లు, సెంటర్ కన్సోల్‌లో, డాష్‌బోర్డ్‌లో రెడ్ యాంబియంట్ లైటింగ్, మెటల్ పెడల్స్, N లైన్ గేర్ నాబ్, స్టీరింగ్ వీల్, డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్‌లు, లెవల్ 2 ADAS వంటివి ఎస్‌యూవీలోని ఫీచర్లు.

అడ్వాన్సుడ్ ఫీచర్లు, పర్ఫార్మెన్స్
ఇవి కాకుండా అరోమా డిఫ్యూజర్, OTA అప్‌డేట్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, 8-స్పీకర్ బోస్ మ్యూజిక్ సిస్టమ్, EPB, TPMS వంటి ఆధునిక ఫీచర్లు కూడా హ్యుందాయ్ వెన్యూ కొత్త N లైన్ వేరియంట్‌లో ఉంటాయి. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన 1.0 లీటర్, త్రీ సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఎస్‌యూవీకి గుండె.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త తరంలోకి అడుగుపెట్టిన హ్యుందాయ్ వెన్యూ N లైన్ మోడల్ 118 bhp పవర్, 172 Nm టార్క్ వరకు ఉత్పత్తి చేయగలదు. పాడిల్ షిఫ్టర్లు, అనేక డ్రైవ్, ట్రాక్షన్ మోడ్‌లు కూడా వెహికల్ మెయిన్ ఫీచర్లు. నవంబర్ 4న కొత్త తరం వెన్యూ అధికారిక ఆవిష్కరణ, ధరల ప్రకటన జరుగుతుంది.


Click it and Unblock the Notifications








