మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు, రేంజ్ వీర లెవల్.. ఎలక్ట్రిక్ కార్లలోనూ కింగ్ మేకర్ అవ్వడం ఖాయం!
గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అందులో భాగంగా చాలా కార్లు మార్కెట్‌లోకి కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. 2025 ఆటో ఎక్స్‌పోలో e-విటారా ఆవిష్కరణతో మారుతి సుజుకి భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్‌తో రంగ ప్రవేశం చేసింది. దేశంలోనే ప్రముఖ కార్ల తయారీదారుగా మారుతి సుజుకి అంతర్జాతీయ మార్కెట్లలో ఉంది. ఇన్నోవేటివ్ e-హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన e-విటారా కారు అధునాతన డిజైన్, ఫీచర్లతో అందుబాటులో ఉంది. e-విటారా మారుతి EVX కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది. ఇది మొదట 2023 జనవరిలో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తర్వాత అక్టోబర్‌లో జపాన్ మొబిలిటీ షోలో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు అధికారికంగా దీనిని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టారు.
కొలతలు: ఈ మోడల్ ప్రత్యేక డిజైన్, ఫంక్షనాలిటీతో మరింత అందంగా కనిపిస్తుంది. కొలతల పరంగా 4,275 mm పొడవు, 1,800 mm వెడల్పు, 1,635 mm ఎత్తు, 2,700 mm వీల్‌బేస్, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో e-విటారా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది AWD సిస్టమ్ ఆప్టిమల్ ట్రాక్షన్‌తో వస్తుంది. అందువల్ల మెరుగైన రైడింగ్ సౌకర్యాన్ని పొందగలరు.

ఫీచర్లు: 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వన్‌పీస్ డిస్‌ప్లే, సెంటర్ కన్సోల్, వెర్టికల్ ఎయిర్‌వెంట్స్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుంది. మల్టీఫంక్షనల్ 2-స్పోక్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కలవు. ఈ ఎలక్ట్రిక్ SUV దృఢత్వం కోసం పెద్ద టైర్లు, లాంగ్ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీంతో మీరు ఆఫ్‌రోడ్ ఫంక్షనాలిటీ కోసం దీనిని వినియోగించవచ్చు.
సేఫ్టీ: సెల్ఫ్-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఇతర ఫీచర్లతో ఇది వస్తుంది. మారుతి సుజుకి e-విటారాలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) సూట్‌ను అందించారు. ఇది బ్రాండ్ లోనే మొదటిది కావడం విశేషం. ఈ ఎలక్ట్రిక్ కారు లెవెల్ 2 ADAS, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, యాంబియెంట్ లైటింగ్, హర్మన్ కార్డన్ ఆధారిత మ్యూజిక్ సిస్టమ్, వివిధ డ్రైవ్ మోడ్స్‌ను కలిగి ఉంటుంది.

బ్యాటరీ: 49 kW లేదా 61 kW బ్యాటరీ ప్యాక్ ద్వారా ఎలక్ట్రిక్ మోటార్‌కి శక్తిని అందిస్తుంది. ఇవి వరుసగా 142 bhp, 172 bhp పవర్ అవుట్‌పుట్‌తో వస్తుంది. ఈ రెండు వెర్షన్లు 192 Nm టార్క్ అవుట్‌పుట్ విడుదల చేస్తాయి. ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై 500 km రేంజ్‌ని అందిస్తుంది. రియల్‌టైమ్‌లోనూ ఇదే రేంజ్‌ని అందించే అవకాశం ఉంది.
ఇది భారతీయ మార్కెట్‌లో సరికొత్త రికార్డులను తిరుగ రాసే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్‌లో ఇదే మొట్టమొదటి ఈవీ కావడం ద్వారా ప్రజల్లో దీనిపై ఆసక్తి పెరిగింది. స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లు, అద్భుతమైన పనితీరుల కలయికతో e-విటారా ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి ఈ కారు వస్తుంది. ఈ మారుతి సుజుకి ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ పరిశ్రమలో మంచి బెంచ్‌మార్క్‌ని సెట్ చేయనున్నట్లు ఆటో రంగ నిపుణులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








