హై-టెక్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో ఎంజీ నుంచి శక్తివంతమైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్.. అందరు వెయిటింగ్!
MG మోటార్స్ భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కార్లతో హాట్ టాపిక్ అవుతోంది. సాంప్రదాయ ఇంధన కార్లతో పాటు ఈవీలలో కూడా ఇటీవల కాలంలో తన దూకుడును ప్రదర్శిస్తుంది. ఇది చైనీస్ బ్రాండ్ అయినా, JSW గ్రూప్‌లో భాగస్వామ్యం కావడంతో ఇప్పుడు దీన్ని సగం భారతీయ కంపెనీ అనుకోవచ్చు. లోకల్‌గా టాటా మోటార్స్, హ్యుందాయ్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులకు గట్టి పోటీనిస్తూ, సేల్స్‌లో మెరుగైన గణంకాలను సాధిస్తుంది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని సూపర్ హిట్ EV మోడళ్లను కలిగి ఉంది. అయితే, భారత మార్కెట్లో ఎక్కువ మోడళ్లను విడుదల చేయకపోయినా, ఇతర దేశాల్లో ఉన్న MG కార్ల లైనప్ చూసి భారతీయ కస్టమర్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే MG మోటార్స్ మరో శక్తివంతమైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను చైనాలో ఆవిష్కరించింది. MG4 లేటెస్ట్ ఈవీ కారును తీసుకురాబోతుంది. దీనిలో భాగంగా దీనికి సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించింది. అద్భుతమైన లుక్, అదిరిపోయే ఫీచర్స్‌తో ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఆకర్షణీయంగా రూపొందించింది. ఇది హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికి లోపల ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోడానికి అవసరమైన స్థలం ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా సైజులో ఉండవచ్చని తెలుస్తోంది.

100 శాతం ఎలక్ట్రిక్ గా రానున్న ఈ హ్యాచ్‌బ్యాక్, మునుపటి మోడల్ కంటే మరింత పెద్దదిగా, స్టైలిష్‌గా, అధునాతన టెక్నాలజీతో లాంచ్ అవుతోంది. MG4 చైనా మార్కెట్‌లో పెద్దగా ప్రాచుర్యం పొందకపోయినప్పటికీ, ఇది యూరోపియన్ దేశాలలో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా నిలిచింది. యూరోప్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతున్న కారణంగా, MG4 తన స్పేస్, సాంకేతికత, పర్యావరణ అనుకూలతతో యూరోపియన్ వినియోగదారులను ఆకర్షించింది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా పరిస్థితిని అంచనా వేయడానికి 2023 ఆటో ఎక్స్‌పోలో MG4 ను ప్రదర్శించడం ద్వారా, భారతీయ వినియోగదారులకు ఈ మోడల్‌ను పరిచయం చేయడం జరిగింది. ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ 4,395 మిమీ పొడవు, 1,842 మిమీ వెడల్పు, 1,551 మిమీ ఎత్తు, 2,750 మిమీ వీల్‌బేస్ కలిగి ఉందని MG మోటార్స్ తెలిపింది.

2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మోడల్‌తో పోలిస్తే MG4 కారులో రీడిజైన్ చేసినటువంట్ ఫ్రంట్ ఎండ్, కొత్త డోర్లు, అప్‌డేట్ చేసిన వెనుక భాగం, పెద్ద గ్రీన్‌హౌస్‌తో అద్భుతమైన డిజైన్‌ను ప్రదర్శిస్తుంది. ఈ మార్పులు దాని లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మరియు ఆధునికంగా చేస్తున్నాయి. ఇంకా స్లిమ్ హెడ్‌లైట్ యూనిట్లు, టెయిల్-లైట్లపై బాణం ఆకారపు LED సిగ్నేచర్‌లు, ముందు బంపర్‌పై హనీకోంబ్ ఇన్‌టేక్ కారుకు అందాన్ని తెచ్చాయి.
కొత్త MG4 EVకి సంబంధించిన బ్యాటరీ స్పెసిఫికేషన్లు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు, అయితే సమాచారం ప్రకారం, ఇది రెప్ట్ బ్యాటరీ ఎనర్జీ అందిస్తున్నటువంటి లిథియం-అయాన్ ఫాస్ఫేట్ (LFP) టెక్నాలజీతో బ్యాటరీ ప్యాక్ 163 bhp వరకు పవర్‌ను ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడి ఉంటుందని తెలుస్తుంది. ఇది గంటకు 160 కి.మీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది.

MG4 EV పాత మోడల్ 51kWh (నెట్) లిథియం-అయాన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 350 కి.మీ. వరకు రేంజ్ అందిస్తుంది. అయితే ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌లో దీని కంటే మరింత ఎక్కువగా రేంజ్ అందించే విధంగా బ్యాటరీ సెటప్ ఉంటుందని తెలుస్తుంది. MG మోటార్స్ ఇప్పటి వరకు MG4 EV ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసే విషయాన్ని ధృవీకరించలేదు.


Click it and Unblock the Notifications








