మార్కెట్లోకి కొత్త ఈవీ కారు.. సైజును బట్టి తక్కువ అంచనా వేయకండి.. ధర ఎంత ఉంటుందో తెలుసా?

బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీదారు MINI తన ఎలక్ట్రిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ భారత మార్కెట్లోకి కొత్త మోడల్‌ను తీసుకువచ్చింది. పెట్రోల్‌తో నడిచే కంట్రీమ్యాన్ JCW కంటే మరింత శక్తివంతమైన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ మినీ కంట్రీమ్యాన్ ఎస్‌ఈ ఏll4 (MINI Countryman SE All4) - ఇప్పుడు అధికారికంగా భారతదేశంలో విడుదలైంది. ఈ కారు ధరను కంపెనీ రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ ధరతో, ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించనుంది. మినీ బ్రాండ్‌కు ప్రత్యేకతైన స్టైల్‌, కాంపాక్ట్ లగ్జరీ, ఫన్ టు డ్రైవ్ అనుభూతి ఈ ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

మినీ కంపెనీకి చెందిన కొన్ని కార్ల మాదిరిగానే, ఈ కారు కూడా పూర్తిగా విదేశాల్లో తయారై, పూర్తి స్థాయి యూనిట్‌గా భారతదేశానికి దిగుమతి చేయబడుతుంది. అందువల్ల దీని క్వాలిటీ, ఫినిషింగ్, ప్రీమియం ఫీల్ అంతర్జాతీయ ప్రమాణాల్లోనే ఉంటాయి. MINI Countryman SE All4 అనేది కేవలం ఒక ఎలక్ట్రిక్ SUV మాత్రమే కాదు, ఇది మినీ JCW(John Cooper Works) లెగసీని ఆధారంగా చేసుకుని రూపొందించబడిన హై-పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారు.

New Mini Countryman Se All4 Car Launched In India Price And Battery Details Inside

పెట్రోల్ JCW వేరియంట్ కంటే ఎక్కువ పవర్ ఔట్‌పుట్, మెరుగైన టార్క్ అందించడం దీని ముఖ్యమైన విశేషం. ఈ కారు రెండు మోటార్లతో వస్తుంది, ఒక్కో మోటార్ ముందు, వెనుక యాక్సిల్‌లపై అమర్చబడి ఉంటుంది. దీంతో All4 ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీని అందిస్తుంది. ఎలాంటి రోడ్డు పరిస్థితులైనా ఈ కారు సులభంగా ఎదుర్కోగలదు. కారు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రీమియం కార్ ప్రేమికులలో ఈ కంట్రీమ్యాన్‌కి విశేష స్పందన లభిస్తోంది.

మినీ డీలర్‌షిప్‌లలో ఇది ప్రదర్శనకు సిద్ధంగా ఉండగా, అధికారిక డెలివరీలు వచ్చే వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఇది కేవలం డిజైన్ పరంగా మాత్రమే కాకుండా, పనితీరు, టెక్నాలజీ పరంగానూ అసాధారణమైన అప్‌డేట్‌లతో వచ్చింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు మినీ JCW మోడళ్లకు స్ఫూర్తిగా రూపుదిద్దుకున్నప్పటికీ, ఇది పూర్తి ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులోని డ్యూయల్ మోటార్ సెటప్ దానిని నిజమైన ఆల్-వీల్ డ్రైవ్ SUVగా నిలబెడుతుంది.

New Mini Countryman Se All4 Car Launched In India Price And Battery Details Inside

రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి 313 హార్స్‌పవర్ పవర్, 494 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. కారు కేవలం 5.6 సెకన్లలో 0 నుండి 100 కి.మీ/గం వేగాన్ని చేరుతుంది, ఇది దాని పెట్రోల్ JCW వెర్షన్ కంటే వేగంగా ఉంటుంది. గరిష్ట వేగం 180 కి.మీ/గంగా పరిమితం చేయబడింది, కానీ ఆ వేగాం చాలా సున్నితంగా, స్మూత్‌గా ఉంటుంది. 66.45 kWh బ్యాటరీ ప్యాక్ దీనికి శక్తినిస్తుంది.

WLTP సర్టిఫికేషన్ ప్రకారం, బ్యాటరీ ఒకసారి ఛార్జ్‌తో 440 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. ఛార్జింగ్ విషయానికొస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు వేగంగా ఛార్జ్ అయ్యే విధంగా డిజైన్ చేయబడింది 130 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10% నుండి 80% వరకు కేవలం 29 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. అలాగే, 22 kW AC ఛార్జర్‌తో పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 3 గంటల 45 నిమిషాలు పడుతుంది.

New Mini Countryman Se All4 Car Launched In India Price And Battery Details Inside

డిజైన్ పరంగా చూస్తే, ఆకర్షణీయమైన బాహ్య రూపాన్ని పొందింది. ఇందులో సవరించిన గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, పాలిష్ చేసిన బోనెట్ డిజైన్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, జెట్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి. ఇవన్నీ కారుకు స్పోర్టీ, ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. మొత్తం మీద, MINI Countryman SE All4 కేవలం ఒక ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, ఇది పర్ఫార్మెన్స్, లగ్జరీ, టెక్నాలజీకి సమ్మిళితమైన కొత్త యుగం MINIగా నిలిచింది.

More from DriveSpark

Article Published On: Saturday, November 8, 2025, 13:25 [IST]
English summary
New mini countryman se all4 car launched in india price and battery details inside
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+