పెట్రోల్-డీజిల్ ఖర్చు తగ్గించాలా? నిస్సాన్ కొత్త CNG మోడల్ అదిరిపోయే మైలేజ్‌తో వస్తోంది!

దేశంలో పెరిగిన ఇంధన ధరల నేపథ్యంలో, CNG కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే ఎలక్ట్రిక్ కార్లతో పాటు, సీఎన్‌‌జీల వైపు కూడా చూస్తున్నారు. ఇప్పటికే భారతీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ తమ కార్లలో cng కిట్‌లను కూడా అమర్చి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటి సరసన చేరడానికి మరో కంపెనీ సిద్ధమైంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ (Nissan)కూడా CNG సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. దేశీయ మార్కెట్లో హల్‌చల్ సృష్టించిన మాగ్నైట్ SUV త్వరలో CNG వెర్షన్‌లో రానుందని టీజర్ సూచిస్తోంది. మాగ్నైట్ కారు ఇప్పటికే చాలాసార్లు CNG కిట్‌తో రోడ్లపై పరీక్షిస్తున్నట్లు కనిపించింది.

ఇది మార్కెట్‌లో అతి తక్కువ ఖర్చుతో కూడిన CNG SUVలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. పెట్రోల్ వేరియంట్‌కి మారుతున్న తరుణంలో CNG వెర్షన్ మెరుగైన మైలేజ్‌ను అందించడంతో పాటు తక్కువ మెయింటనెన్స్‌తో భారతీయ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, అందరూ ఎదురుచూస్తున్న నిస్సాన్ మాగ్నైట్ CNG వెర్షన్ చివరి దశకు చేరుకుంది. దీనిని వచ్చే నెల, అంటే ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు.

Nissan Magnite Cng Model

సగటు వినియోగదారులకు భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా CNG వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుండగా, నిస్సాన్ ఈ విభాగంలోకి అడుగుపెట్టడం కీలక నిర్ణయంగా మారింది. కొత్త CNG కిట్‌ను మాగ్నైట్ 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌లో మాత్రమే అందించనుంది. ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉండనుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ విషయంపై నిస్సాన్ నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు.

ఈ SUV CNG మైలేజ్ పరంగా అత్యుత్తమంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది కిలో ఇంధనానికి 22 కి.మీ వరకు మైలేజీని అందిస్తుందని సమాచారం. ఇది రోడ్డుపై తక్కువ నిర్వహణ ఖర్చుతో వినియోగదారులకు బాగానే డబ్బును ఆదా చేసే అవకాశం ఉంది. భారత మార్కెట్‌లో త్వరలో లాంచ్ కానున్న నిస్సాన్ మాగ్నైట్ CNG కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా సేఫ్టీలో కూడా అత్యుత్తమ ప్రమాణాలతో రాబోతుంది.

Nissan Magnite Cng

ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను రక్షించడానికి 6 ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. ఇంకా స్లిప్పరీ రోడ్లపై అదుపు కోల్పోకుండా ఉండటానికి ట్రాక్షన్ కంట్రోల్, కారు స్పీడ్ ఎక్కువ అయినప్పుడు అలర్ట్ చేయడానికి హై-స్పీడ్ వార్నింగ్ సిస్టమ్, అత్యుత్తమ బ్రేకింగ్ కోసం EBDతో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హఠాత్తుగా బ్రేక్ వేస్తే వెనుక వాహనాలకు హెచ్చరించడానికి ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS) వంటివి ఉన్నాయి.

ఎత్తైన రహదారులపై కారు వెనక్కి వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి హిల్ స్టార్ట్ అసిస్ట్, పిల్లల భద్రతకు చైల్డ్ సీట్ మౌంట్స్ (ISOFIX) , స్టీరింగ్, బ్రేకింగ్‌ను ఆటోమేటిక్‌గా అదుపులో ఉంచడం కోసం వెహికల్ డైనమిక్ కంట్రోల్, అత్యవసర పరిస్థితుల్లో బ్రేకింగ్ కోసం హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఇతర స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా డజన్ల కొద్ది ఉంటాయి.

Nissan Magnite

నిస్సాన్ మాగ్నైట్ కారులో CNG కిట్‌ను డీలర్-స్థాయి అనుబంధంగా ఇన్‌స్టాల్ చేయనున్నారని, దీని ధర రూ.75,000 నుంచి రూ.79,500 వరకు ఉండవచ్చని కూడా కొన్ని రూమర్లు ఉన్నాయి. డీలర్-స్థాయిలో CNG కిట్ 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. నిస్సాన్ మాగ్నైట్ CNG కారు పవర్‌ట్రెయిన్ గురించి ఇంకా సమాచారం వెలువడలేదు. దీనిపై త్వరలో పూర్తి వివరాలు రానున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 28, 2025, 11:00 [IST]
English summary
New nissan magnite cng model will be launch in april more details check here
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+