అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే.. అదిరిపోయే లుక్‌తో డస్టర్ రీ-ఎంట్రీ! షోరూమ్‌కు ఎగబడతారు

రెనాల్ట్ డస్టర్ పేరు వినగానే ఆటోప్రేమికుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం తళుక్కుమంటుంది. ఒకప్పుడు SUV సెగ్మెంట్‌లో తన సొంత మార్కెట్‌ని క్రియేట్ చేసుకున్న ఈ కారు, సాధారణ వినియోగదారుల నుండి ఆఫ్-రోడ్ లవర్స్ వరకు అందరికీ బాగా నచ్చేది. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం భారత మార్కెట్లో దీని అమ్మకాలు నిలిచిపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. అప్పటి నుండి కొత్త మోడల్ ఎప్పుడు వస్తుందో అని ప్రతి చిన్న రూమర్‌కూ ఆటోప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రోడ్డు పరీక్షల సమయంలో 5-సీటర్ డస్టర్ మోడల్ స్పై చిత్రాలు బయటకు రావడంతో మళ్లీ చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటివరకు బిగ్‌స్టర్, బోరియల్ పేర్లతో 5-సీటర్, 7-సీటర్ వెర్షన్‌లు చాలాసార్లు కెమెరాలో చిక్కాయి. అయితే, ఈసారి బయటకు వచ్చిన ఫోటోలు ప్రత్యేకంగా 5-సీటర్ వెర్షన్‌కు సంబంధించినవే కావడం గమనార్హం.

వైరల్ అవుతున్న ఈ స్పై షాట్స్‌ని పరిశీలిస్తే, రష్‌లైన్ నివేదిక ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త తరం డస్టర్ మోడల్‌కే ఇది పోలి ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, భారత రోడ్లపై కూడా అదే స్టైల్, అదే డిజైన్‌తో దూసుకొచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. బోల్డ్ డిజైన్, కటింగ్ ఎడ్జ్ స్టైలింగ్, మాడర్న్ టెక్ ఫీచర్లతో కూడిన కొత్త డస్టర్ రాబోతుందన్న నమ్మకం ఇప్పుడు ఆటోప్రియుల్లో మరింత పెరుగుతోంది.

New Renault Duster 5 Seater Car Spy Images Viral

డిజైన్ విషయానికి వస్తే, ఇది పాత మోడల్‌తో పోలిస్తే పూర్తిగా రిఫ్రెష్‌డ్ స్టైల్‌లో కనిపించనుంది. బయట కీలకమైన మార్పులు గమనించవచ్చు. వెనుకభాగం వైపు చూసినప్పుడు V-ఆకారపు టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్పోర్టీ స్పాయిలర్ కారుకు మరింత యంగ్ లుక్‌ని ఇస్తుంది. ఇంతకాలం వాహనాల్లో చూసిన సాంప్రదాయ టెయిల్ ల్యాంప్ డిజైన్‌కు బదులుగా కాంటూర్ ఫినిషింగ్‌తో ఇచ్చిన ఈ కొత్త స్టైల్ కాస్త హైఎండ్ వాహనాలను తలపించేలా ఉంది.

సైడ్ ప్రొఫైల్‌లో మందపాటి వీల్ ఆర్చ్ క్లాడింగ్ దాని మస్క్యులర్ ప్రెజెన్స్‌ను పెంచగా, షార్క్ ఫిన్ యాంటెన్నా, రూఫ్ రెయిల్స్ SUVకి రఫ్ & టఫ్ లుక్ ఇస్తాయి. వెనుక రియర్ వాషర్, వైపర్ సదుపాయాలు ప్రాక్టికల్ యుటిలిటీని పెంచుతాయి. చతురస్రాకారపు వీల్ ఆర్చ్‌లు, సి-పిల్లర్‌పై డోర్ హ్యాండిల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ప్రీమియం టచ్‌ని ఇస్తాయి. అలాగే వెనుక స్కిడ్ ప్లేట్ SUV DNAని మరింత హైలైట్ చేస్తుంది.

New Renault Duster 5 Seater Car Spy Images Viral

Y-ఆకారపు LED టెయిల్ లైట్లు రాత్రిపూట రోడ్డు మీద ప్రత్యేకంగా మెరిసేలా ఉంటాయి. అలాగే 18-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ డస్టర్ స్టాన్స్‌ను మరింత బలంగా, స్పోర్టీగా మార్చుతాయి. మొత్తంగా చూస్తే, డిజైన్ పరంగా కొత్త డస్టర్ మోడల్ ప్రస్తుత ట్రెండ్స్‌కు తగిన అప్‌డేట్ పొందినట్లు తెలుస్తోంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేయబడిన 1.6-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తుంది.

ఈ సెటప్ గరిష్టంగా 140 bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. 1.2 kWh బ్యాటరీ ప్యాక్, పునరుత్పత్తి బ్రేకింగ్ సిస్టమ్ సహకారంతో మరింత సమర్థవంతమైన ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది. అంటే, పవర్‌తో పాటు మైలేజ్‌పైనా ఈ డస్టర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక మరో ఇంజిన్ ఆప్షన్‌గా 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. ఇది 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తూ 130 PS శక్తిని అందిస్తుంది.

New Renault Duster 5 Seater Car Spy Images Viral

తదుపరి వేరియంట్‌గా యూరప్ మార్కెట్‌లో 1.0-లీటర్ పెట్రోల్-LPG ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది. ఇది బడ్జెట్, ఎకో-ఫ్రెండ్లీ ఆప్షన్‌గా కన్సిడర్ అవుతుంది. అయితే భారత మార్కెట్లో ఈ వేరియంట్ లభిస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. లోపలి భాగానికి వస్తే, ఇంకా పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, కొన్ని కొత్త ఫీచర్లు జోడించే అవకాశం ఉందని సమాచారం.

More from DriveSpark

Article Published On: Monday, September 22, 2025, 10:30 [IST]
English summary
New renault duster 5 seater car spy images viral more details here
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+