తుఫాన్ సృష్టించడానికి రెనాల్ట్ డస్టర్ మళ్లీ వస్తోంది.. ఆ స్పెషల్ రోజున లాంచ్.. బడ్జెట్ సిద్ధం చేసుకోండి

రెనాల్ట్ డస్టర్ (Renault Duster) పేరు వినగానే చాలా మందికి ఒక ప్రత్యేకమైన SUV అనుభూతి గుర్తుకు వస్తుంది. 2012లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, అప్పట్లో SUV సెగ్మెంట్‌లో ఒక రకమైన విప్లవాన్ని తెచ్చింది. అద్భుతమైన డిజైన్, సాలిడ్ బాడీ బిల్డ్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం.. ఇవన్నీ కలిపి రెనాల్ట్ డస్టర్‌ను భారతీయ రోడ్లపై అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిపాయి. 10 సంవత్సరాల పాటు అమ్మకాల్లో నిలిచి, చివరకు 2022లో ఉత్పత్తి నిలిచిపోయినా, దాని అభిమానులు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు అదే డస్టర్ మరలా రీ-ఎంట్రీ ఇవ్వబోతుంది. చాలా కాలంగా వచ్చిన రూమర్లకు ముగింపు పలుకుతూ, రెనాల్ట్ అధికారికంగా ధృవీకరించింది, కొత్త తరం రెనాల్ట్ డస్టర్ భారత మార్కెట్లో తిరిగి ప్రవేశించబోతోంది.

ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, ఈ కొత్త SUV జనవరి 26, గణతంత్ర దినోత్సవం రోజున దేశీయ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించబడనుంది. ఇది రెనాల్ట్ అభిమానులకు ఒక ఉత్సవంలా మారబోతోంది. కొత్త డస్టర్ గురించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి, ఇది పూర్తిగా కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో రానుంది. బయట రూపం మరింత ఆకర్షణీయంగా ఉండేలా తయారు చేస్తూ, SUV సెగ్మెంట్‌లోని కొత్త పోటీదారులను సవాలు చేసేలా రూపొందించబడిందని తెలుస్తోంది.

New Renault Duster India Launch Date Price And Engine Options Details

ఇంటీరియర్‌లో ప్రీమియం మెటీరియల్స్, అడ్వాన్స్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు, అధునాతన భద్రతా సదుపాయాలు ఉండనున్నాయని ఊహిస్తున్నారు. కొత్త తరం రెనాల్ట్ డస్టర్ కేవలం డిజైన్ పరంగా మాత్రమే కాకుండా, పనితీరు పరంగానూ పెద్ద మార్పులు తెచ్చుకోబోతోంది. ఇప్రధాన ఆకర్షణగా ఉండబోయేది దాని ఇంజిన్ లైన్-అప్. సమాచారం ప్రకారం, కొత్త డస్టర్‌లో 1.3 లీటర్ HR13 టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడనుంది.

ఈ ఇంజన్ 156 bhp వరకు శక్తిని ఉత్పత్తి చేయగలదు, అంటే పాత మోడల్ కంటే గణనీయంగా శక్తివంతమైంది. ఈ ఇంజన్‌కి మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు CVT (కంటిన్యూయస్ వెరియబుల్ ట్రాన్స్‌మిషన్) ఆప్షన్ కూడా అందించబడనుంది. ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సాఫ్ట్‌గా, సౌకర్యవంతంగా మారుస్తుంది. ఈ ఇంజన్ వెర్షన్‌ను కొత్త డస్టర్‌ టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే అందించే అవకాశం ఉంది.

New Renault Duster India Launch Date Price And Engine Options Details

అదే సమయంలో, బేస్, మిడ్ వేరియంట్లలో 1.0 లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఇవ్వబడుతుందని అంచనా. ఇదే ఇంజన్ ప్రస్తుతం రెనాల్ట్ కైగర్ మోడల్‌లో ఉపయోగించబడుతోంది. ఇది సరసమైన ధరతో పాటు మంచి పనితీరును అందించడం వల్ల, ఎంట్రీ లెవల్ SUV కొనుగోలు దారులకు ఇది మంచి ఆప్షన్‌గా మారబోతోంది. మొదట్లో కొత్త డస్టర్‌ను కేవలం పెట్రోల్ వేరియంట్‌లోనే అందించనున్నారు.

అయితే, భవిష్యత్తులో హైబ్రిడ్ వెర్షన్‌‌ను కూడా తీసుకురావాలని కంపెనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన డస్టర్ మరింత మైలేజీని అందించగలదని అంచనా. కొత్త తరం రెనాల్ట్ డస్టర్‌లో ADAS (Advanced Driver Assistance Systems) భద్రతా ప్యాకేజ్ ఉంటుంది. ఇది అందించబడితే, డస్టర్ భారత మార్కెట్లో ADAS టెక్నాలజీని కలిగిన మొట్టమొదటి రెనాల్ట్ కారు అవుతుంది. ఈ సిస్టమ్ డ్రైవింగ్ సమయంలో ప్రమాదాలను తగ్గిస్తుంది.

New Renault Duster India Launch Date Price And Engine Options Details

ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త డస్టర్ 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుందని సమాచారం. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో ఉంటుంది, అంటే ఫోన్ కేబుల్ అవసరం లేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ను కారు సిస్టమ్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉండబోతున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 8, 2025, 17:30 [IST]
English summary
New renault duster india launch date price and engine options details
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+