కారు లవర్స్‎కు గుడ్ న్యూస్.. ఏకంగా ఆ మోడల్‎ను 24.5కిమీ మైలేజీతో ఈ సారి రీ ఎంట్రీ గట్టిగా ఇవ్వబోతున్న రెనాల్ట్

రెనాల్ట్ డస్టర్.. ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవర్ఫుల్ ఎస్‌యూవీ. ఈ కారును 2012లో దేశీయంగా విడుదల చేశారు. ఆ తర్వాత 2020 వరకు మార్కెట్లో చాలా బాగా అమ్ముడైంది. అయితే, కొన్ని కారణాల వల్ల డస్టర్ అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు అదే ఎస్‌యూవీని సరికొత్త రూపంలో మళ్లీ తీసుకురావడానికి రెనాల్ట్ సిద్ధమవుతోంది. త్వరలో రాబోయే కొత్త రెనాల్ట్ డస్టర్ ధర ఎంత ఉండవచ్చు, దాని ఫీచర్స్ ఏంటి వంటి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ 2026 మొదటి త్రైమాసికంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కారు చాలా తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.14 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని సమాచారం. ఈ ధరలతో ఇది మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

New Renault Duster is Coming All You Need to Know About the Price and Features

కొత్త రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ బయటి నుంచి చాలా ఆకర్షణీయమైన డిజైన్‌తో రానుంది. ఇందులో మంచి గ్రిల్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, Y ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, వృత్తాకార ఫాగ్ లైట్లు, కొత్త టెయిల్ లైట్లు, అల్లాయ్ వీల్స్ ఉంటాయని భావిస్తున్నారు.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. 1.3-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లు. ఈ కారు 24.5 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని అంచనా.

New Renault Duster is Coming All You Need to Know About the Price and Features

కొత్త రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ లోపలి క్యాబిన్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది. ఇది 5-సీటర్ కారు. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి వీలుగా 472 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్ ఉంటుంది.

ఈ కారులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 7-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అర్కామిస్ 3డి సౌండ్ సిస్టమ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.

New Renault Duster is Coming All You Need to Know About the Price and Features

సేఫ్టీ విషయంలో కూడా ఈ కారు చాలా పటిష్టంగా ఉండనుంది. ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (ఆంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈఎస్‌పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 4-డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. ఇవన్నీ ప్రయాణికులకు మరింత సేఫ్టీని అందిస్తాయి. ఈ కొత్త డస్టర్ రాకతో భారత మార్కెట్‌లో ఎస్‌యూవీ విభాగంలో పోటీ మరింత పెరగడం ఖాయమని చెప్పవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, August 9, 2025, 18:25 [IST]
English summary
New renault duster is coming all you need to know about the price and features
Read more on: #renault #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+