జీఎస్‌టీ కోతతో ఆటోమొబైల్ కంపెనీల్లో జోష్.. అమ్మకాల్లో కొత్త రికార్డు..అక్టోబర్ నెల మొత్తం పండుగే

భారతదేశంలో వెహికల్ సేల్స్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ 22 నుండి జీఎస్టీ కొత్త రేట్లు అమలులోకి రావడం, నవరాత్రి పండుగ సీజన్ ప్రారంభం కావడంతో వాహనాల కొనుగోళ్లు అకస్మాత్తుగా పెరిగాయి. ఈ జోరు అక్టోబర్‌లో మరింత పెరిగి, వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు కావచ్చని సిటీ రీసెర్చ్ విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ 2025 లో ప్యాసింజర్ వెహికల్స్, టూ వీలర్ సేల్స్‎లో స్పష్టమైన మెరుగుదల కనిపించింది. దీనికి ప్రధాన కారణం పండుగ డిమాండ్, జీఎస్టీ రేట్ల తగ్గింపు.

సెప్టెంబర్ 22 నుంచి పండుగల సీజన్ మొదలైన తర్వాత, అంతకుముందు ఆగస్టులో కనిపించిన మందగించిన మార్కెట్ వేగం మళ్లి పుంజుకుంది. అయితే, డీలర్లు ఆలస్యంగా కొనుగోళ్లు చేయడం, కొన్ని లాజిస్టిక్ సమస్యల కారణంగా కొన్ని ఆటో కంపెనీల హోల్‌సేల్ అమ్మకాలు మాత్రం కొద్దిగా పరిమితంగానే ఉన్నాయి. కానీ ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం చాలా బలంగా ఉన్నాయి. జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రభావం, మార్కెట్లో ఉన్న సానుకూల వాతావరణం కారణంగా అక్టోబర్‌లో అమ్మకాలు మరింత భారీగా ఉండే అవకాశం ఉంది.

New Sales Record on the Cards Auto Industry to See Massive Growth in October Due to GST Cut

ద్విచక్ర వాహనాల జోరు
బజాజ్ ఆటో (Bajaj Auto): దేశీయ టూ వీలర్ అమ్మకాల్లో గత ఏడాదితో పోలిస్తే 5% వృద్ధి, గత నెలతో పోలిస్తే ఏకంగా 48% భారీ వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతులు 12% పెరిగాయి.

టీవీఎస్ మోటార్ (TVS Motor): మొత్తం టూ వీలర్ అమ్మకాలు 11% పెరిగాయి. దేశీయ అమ్మకాలు 12%, ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 8% పెరిగాయి.
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp): దేశీయ అమ్మకాల్లో 5%, మొత్తం అమ్మకాల్లో 8% వృద్ధిని సాధించింది. కంపెనీ ఎగుమతులు 95% పెరగడం గమనార్హం.

New Sales Record on the Cards Auto Industry to See Massive Growth in October Due to GST Cut

ప్యాసింజర్ వెహికల్ సేల్స్
1. మారుతి సుజుకి, హ్యుందాయ్
మారుతి సుజుకి రిటైల్ అమ్మకాలు బలంగా ఉన్నాయి. కంపెనీ దాదాపు 2 లక్షల వాహనాలను డెలివరీ చేసింది, ఇంకా 2.5 లక్షల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అయినప్పటికీ, లాజిస్టిక్ సమస్యల కారణంగా హోల్‌సేల్ అమ్మకాలు 8% తగ్గాయి. హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 1% పెరిగాయి, అయితే ఎగుమతుల్లో 44% భారీ వృద్ధి కనిపించింది.

2. మహీంద్రా, టాటా మోటార్స్
మహీంద్రా అండ్ మహీంద్రా : SUV అమ్మకాల్లో 10% వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా పండుగ డిమాండ్ కారణంగా ట్రాక్టర్ల అమ్మకాలు ఏకంగా 50% పెరిగాయి.
టాటా మోటార్స్ (Tata Motors): దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ఏకంగా 45% వృద్ధిని నమోదు చేసింది. కమర్షియల్ వాహనాల అమ్మకాలు స్థిరంగా ఉన్నప్పటికీ, చిన్న కమర్షియల్ వాహనాలు, పికప్ ట్రక్కుల అమ్మకాలు 30% పెరిగాయి.

అక్టోబర్‌పై భారీ అంచనాలు

అక్టోబర్ నెలలో జీఎస్‌టీ కోత ప్రభావం పూర్తిగా కనిపించనుంది, అలాగే పండుగ సీజన్ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. ఈ అనుకూల మార్కెట్ వాతావరణం కారణంగా అక్టోబర్‌లో వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, October 6, 2025, 17:45 [IST]
English summary
New sales record on the cards auto industry to see massive growth in october due to gst cut
Read more on: #car sale #bike sales #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+