పెద్ద ఫ్యామిలీకి కంఫర్ట్ కారు.. టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేసిన స్కోడా.. కొత్త కోడియాక్ వచ్చేస్తోంది

భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వాహన తయారీ దారులంతా కూడా తమ కార్లను ఇండియాలోకి విడుదల చేస్తూ మార్కెట్‌ను క్రమంగా పెంచుకుని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొన్ని తయారీదారులు దేశీయంగా ఇక్కడే ప్లాంట్‌లను ఏర్పాటు చేసి వాహనాలను తయారు చేసి ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు సైతం చేస్తున్నారు. మరికొన్ని కంపెనీలు విదేశాల నుంచి విడిభాగాలను తీసుకొచ్చి ఇండియాలోనే వాటిని అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చెక్ రిపబ్లిక్ బ్రాండ్ స్కోడా (skoda) కంపెనీ సైతం భారతీయ వినియోగదారుల కోసం కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

స్కోడా నుంచి రాబోయే కొత్త మోడల్ రెండవ తరం స్కోడా కోడియాక్ SUV. ఈ కారును కంపెనీ పూర్తిగా నాక్-డౌన్ యూనిట్‌గా ప్రారంభించనుంది. ఈ SUVని మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని కంపెనీ ప్లాంట్‌లో స్థానికంగా అసెంబుల్ చేస్తారు. తర్వాత విక్రయానికి తీసుకొస్తారు. ఈ స్కోడా కోడియాక్‌కు సంబంధించిన టీజర్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. దీని డిజైన్‌ను పరిశీలిస్తే, మొదటి తరం మోడల్‌ను పోలి ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

Kodiaq 7 Seater Suv Teaser Has Been Released

2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన కోడియాక్ కొత్త మోడల్ ఇండియాలో విడుదల తరువాత అమ్మకాల పరంగా ఇతర ఎస్‌యూవీలకు బలమైన పోటీ ఇస్తుందని అంచనా. రాబోయే కొత్త మోడల్ 7 సీటర్ ఆప్షన్‌లో విడుదల కాబోతుంది. దీంతో ఇది కుటుంబ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్‌కు సంబంధించిన టీజర్‌తో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి.

కొత్త స్కోడా కోడియాక్ SUV అధికారిక విడుదల తేదీ గురించి ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడికాలేదు. ప్రస్తుతం భారత్‌లో అమ్మకంలో ఉన్న కోడియాక్ మోడల్‌కి ఇది ప్రత్యామ్నాయంగా రాబోతుంది. 7 ఏళ్లుగా అదే డిజైన్‌తో ఉన్న కోడియాక్‌కు ఫుల్‌-ఫ్లెజ్డ్ రీప్లేస్‌మెంట్ అనే చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లో ఈ కారును 5 సీటర్, 7 సీటర్ వెర్షన్‌లలో అందిస్తున్నా, భారత మార్కెట్‌లో మాత్రం కేవలం 7 సీటర్ వేరియంట్ మాత్రమే లభించనుంది.

Kodiaq 7 Seater Suv

కొత్త తరం స్కోడా కోడియాక్ SUV డిజైన్‌ను చూసినట్లయితే పాత దానితో పోలిస్తే మరింత అప్‌డేట్‌డ్‌గా వస్తుంది. ముందు మ్యాట్రిక్స్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, వాటితోపాటుగా సిగ్నేచర్ LED DRLs డ్రైవింగ్ సమయంలో కాస్త అల్ట్రా-మోడర్న్‌గా నిలుస్తాయి. కొత్త మోడరన్ సాలిడ్ డిజైన్ కారుకు ఓ ఐకానిక్ లుక్ తీసుకొచ్చింది. సైడ్ ప్రొఫైల్ మాత్రం దాదాపు మునుపటిదే. కానీ వెనుక భాగంలో మాత్రం పెద్ద మార్పు ఉంటుంది.

కొత్త తరం కోడియాక్‌లో వెనుక వైపున C-ఆకారంలో ఆకట్టుకునే టెయిల్ లాంప్‌లు, కారు లుక్‌ను మొత్తం స్టైల్‌గా మార్చేలా ఉన్నటువంటి స్కోడా అక్షరాలు మధ్యలో ఉంటాయి. దీని కొలతల విషయానికి వస్తే, 4,758 మిమీ పొడవు ఉంది, ఇది దాని పాత వెర్షన్ కంటే దాదాపు 61 మిమీ ఎక్కువ. ఈ ఎస్‌యూవీ రెండు వేరియంట్లు స్పోర్ట్‌లైన్, లోరిన్ క్లెమెంట్‌‌లో లభిస్తుంది. ఈ కారులో పెద్ద ఫ్యామిలీ సౌకర్యంగా ప్రయాణించవచ్చు.

Kodiaq 7 Seater Suv Teaser

అప్‌కమింగ్ కోడియాక్‌ పాత మోడల్ మాదిరిగా అదే 2.0L పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది, ఇది గరిష్టంగా 190bhp పవర్, 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జోడించారు. ఇది భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, ఎంజి గ్లోస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ వంటి వాటితో పోటీ పడనుంది. దీని ఆన్-రోడ్ ధర దాదాపు 50 లక్షల వరకు ఉంటుందని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, April 7, 2025, 17:45 [IST]
English summary
New skoda kodiaq 7 seater suv is set to launch in india soon and teaser has been released
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+