రూ.5లక్షలకే డ్రైవింగులో కిక్కెక్కించే కార్లు..ఎక్కినే పూనకాలు రావాల్సిందే..త్వరలోనే రోడ్ల మీదకు వస్తున్నాయ్
భారతీయ వాహన మార్కెట్‌లో ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది సబ్-4 మీటర్ ఎస్‌యూవీలే. రాబోయే రెండు సంవత్సరాలలో ఈ సెగ్మెంట్‌లో పదుల సంఖ్యలో కొత్త మోడల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే మంచి అమ్మకాలు ఉన్న ఈ విభాగంలో అన్ని ప్రధాన కంపెనీలు (టాటా, హ్యుందాయ్, మారుతి, హోండా, ఫోక్స్‌వ్యాగన్) మరింత స్టైల్, సేఫ్టీ, ఫీచర్లతో కూడిన కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త కార్ల రాకతో 2026-27 కాలంలో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగం మరింత కొత్త శిఖరాలను చేరుకోవడం ఖాయం.
మార్కెట్లో పోటీని మరింత పెంచడానికి సిద్ధంగా ఉన్న కొన్ని ముఖ్యమైన మోడల్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి
ఫోక్స్‌వ్యాగన్ టెరా డెరివేటివ్: ప్రస్తుతం ఆటోమొబైల్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. అధికారిక ప్రకటన లేకపోయినా కంపెనీ భారతదేశం కోసం తక్కువ ధరలో ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది బలమైన బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ సేఫ్టీ, స్థిరమైన డ్రైవింగ్ అనుభవంతో రానుంది.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్: ప్రస్తుతం మార్కెట్‌లో పంచ్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, టాటా సంస్థ ఈ మోడల్‌కు పెద్ద మార్పులు చేయబోతోంది. ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్, ఇంటీరియర్, కొత్త టెక్నాలజీ, సేఫ్టీ విషయంలో పెద్ద మార్పులు ఆశించవచ్చు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్/AMT గేర్‌బాక్స్‌లతో పాటు CNG వేరియంట్ కూడా కొనసాగనుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్: విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకుపోతున్న మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్. కొత్త వెర్షన్‌లో స్టైలింగ్‌లో చిన్న మార్పులు (షార్ప్ LED DRL, రివైజ్డ్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్) వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్ పాత 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, మాన్యువల్/AMT గేర్‌బాక్స్‌లతోనే కొనసాగుతుంది.

ఇంజిన్ విభాగంలో మాత్రం మారుతి పెద్ద మార్పులు ఏవీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఉన్న ఇంజిన్ ఆప్షన్లే కొనసాగుతాయి. అవి: 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, పవర్ఫుల్ 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌లు. ఈ రెండు ఇంజిన్‌లు తమ పవర్ఫుల్, సమర్థవంతమైన పనితీరును కొనసాగిస్తాయి.

హ్యుందాయ్ బయాన్ : సిటీ డ్రైవింగ్‌తో పాటు హైవేలలో కూడా సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి ఈ మోడల్‌ను రూపొందించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన ఈ కారులో 1.0-లీటర్ టర్బో GDi పెట్రోల్, 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌లు, 5/6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌లు వచ్చే అవకాశం ఉంది.
స్కోడా కైలాక్ CNG: పెట్రోల్ వెర్షన్ ద్వారా మంచి గుర్తింపు పొందిన కైలాక్ ఇప్పుడు CNG వెర్షన్‌లో రాబోతోంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు అనుబంధంగా CNG కిట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో మైలేజ్ గణనీయంగా పెరగడం ఖాయం. డిజైన్, ఇంటీరియర్‌లో కూడా స్వల్ప మార్పులు ఆశించవచ్చు.

హోండా WRV : పాత WRV మోడల్‌ను పూర్తిగా మార్చి, కొత్త తరాన్ని హోండా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. అదే మోడల్‌ను భారతీయ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, పటిష్టమైన బాడీ లైన్లు, పెద్ద LED హెడ్‌ల్యాంప్‌లు, స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్ దీని ప్రధాన ఆకర్షణలు. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








