అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే.. ఈ సారి కార్ మార్కెట్లో ఊచకోతే.. షోరూమ్‌ల ముందు జనాల జాతరే!
భారతీయ ఆటోమోటివ్ చరిత్రలో అత్యంత ఐకానిక్ SUVలలో ఒకటిగా గుర్తింపు పొందిన టాటా సియెర్రా (tata sierra) రెండు దశాబ్దాల విరామం తర్వాత కొత్తగా శక్తివంతమైన రూపంలో మార్కెట్లోకి తిరిగి వస్తోంది. .21వ శతాబ్దపు ఈ సరికొత్త మోడల్ తన రివొల్యూషనరీ డిజైన్, అధునాతన టెక్నాలజీతో SUV విభాగంలో తన సత్తా చాటడానికి వస్తుంది. ఇది భారత కార్ ప్రేమికులకు ఒక నమ్మశక్యం కాని కమ్‌బ్యాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా సియెర్రా సరికొత్త డిజైన్‌ను ప్రపంచానికి కంపెనీ పరిచయం చేసింది. అప్పటి నుంచి కూడా ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ కొత్త జనరేషన్ మోడల్‌ను టాటా మోటార్స్ మరింత ఆధునికమైన డిజైన్‌లో రూపొందించింది. SUV సెగ్మెంట్‌లో ఉన్న ఇతర మోడళ్ల కంటే మొత్తంగా విభిన్నమైన స్టాన్స్, డైనమిక్ బాడీ లైన్స్ దీనిని ప్రత్యేకంగా నిలబెడతాయి. సలు SUV మోడల్ మూడు-డోర్ల మోడల్ అయితే, రాబోయేది ఐదు-డోర్ల మోడల్‌గా ఉండనుంది. దీంతో కారులోకి ఎంట్రీ ఇవ్వడానికి అలాగే, బయటకు రావడానికి ఇది ప్రయాణికులకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

ఇదిలా ఉంటే టాటా సియెర్రా ICE వెర్షన్ ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ సియెర్రాను సంప్రదాయ ఇంధన వేరియంట్లలో మాత్రమే కాకుండా ఎలక్ఘ్రిక్ వెర్షన్‌లో కూడా తీసుకురాబోతుంది. మొదటగా ఐసీఈను విడుదల చేసిన తర్వాత ఈవీను లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉంది. అన్ని అనుకూలంగా జరిగితే 2025 చివరలో సియెర్రా ICE వెర్షన్ భారత రోడ్లపై పరుగులు పెడుతుంది.
టాటా సియెర్రా SUVను ఇటీవల కాలంలో చాలా సార్లు రోడ్లపై టెస్టింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. దాని ఐసీఈ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్‌లను పొందుతుందని అంచనా. మొదటిది 1.5-లీటర్ T-GDi టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లో 165 hp పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చు. 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ 170 hp పవర్, 3500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చు.

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్‌లో లభించే అవకాశం ఉంది. సియెర్రా సాంకేతికత పరంగా కూడా చాలా లేటెస్ట్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. 21వ శతాబ్దానికి తగ్గట్టుగా అత్యాధునిక కనెక్టివిటీ ఫీచర్లు, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియం ఇంటీరియర్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి అనేక హై-టెక్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి.
భద్రత పరంగా టాటా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇదే ముద్రను కొనసాగిస్తూ, సియెర్రా అత్యున్నత స్థాయి సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS (Advanced Driver Assistance Systems), 360 డిగ్రీ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు దీన్ని మరింత భద్రతా సురక్షితంగా మారుస్తాయి.

దీని ధర రూ.. 13 లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఐసీఈ వేరియంట్ వివరాలు బయటకు వెల్లడైనప్పటికి ఎలక్ట్రిక్ వెర్షన్లో లభించే బ్యాటరీ, ఇతర ఫీచర్స్ గురించి ఇంకా సమాచారం రాలేదు. అయితే పవర్‌ట్రెయిన్ గురించి పక్కన పెడితే ఇంటీరియర్‌లో అందించే ఫీచర్స్ దాదాపు ఐసీఈ వేరియంట్ మాదిరిగా ఉండే అవకాశం ఉందని, అలాగే సేఫ్టీ ప్రమాణాలు కూడా అలాగే ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








