మార్కెట్లోకి కొత్త బండి వచ్చేసింది.. అదిరిపోయే మోడల్ కోసం చూస్తున్న వారు ఓ లుక్కేయండి

ఇండియాలో సబ్ కాంపాక్ట్ SUVలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీటి తరువాత సబ్ కాంపాక్ట్ సెడాన్‌లను ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఈ విభాగంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతీ సుజుకీ (Maruti Suzuki)కి చెందిన డిజైర్, మరో కంపెనీ హోండా (Honda)కు చెందిన అమేజ్ వంటివి బలమైన మోడళ్లుగా ఉన్నాయి. వీటికి ప్రధాన పోటీదారుగా టాటా టిగోర్ (tata tigor) ప్రస్తుతం గట్టి పోటీదారుగా ఉంది. ఆటోమొబైల్ మార్కెట్లో వివిధ కంపెనీల మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కస్టమర్లను ఆకట్టుకోడానికి అదిరిపోయే ఫీచర్స్‌తో మోడళ్లను తీసుకొస్తేనే అమ్మకాలు పెరిగే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో టాటా తన టిగోర్ కారును సరికొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది. 2025 మోడల్ రూ.6 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర.

ముఖ్య విషయం ఏమిటంటే, బేస్ వేరియంట్ XE ని నిలిపివేసి దాన్ని XM వేరియంట్‌తో భర్తీ చేయనుంది. దీంతో 2025 టాటా టిగోర్ మోడల్ ఇకమీదట XM ప్రారంభ వేరియంట్‌తో మొదలవుతుంది. దీనిలోనే XZ ప్లస్ లక్స్ (xz plus lux) అనే టాప్ ఎండ్ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.8.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్, cng పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది.

New Tata Tigor Xz Plus Lux Variant

2025 టాటా టిగోర్ ఎక్స్‌‌జెడ్ ప్లస్ లక్స్ టాప్-ఎండ్ వేరియంట్ వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్స్‌తో వచ్చింది. రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభించడం వలన భారతీయ వినియోగదారులను ఈ కారు ఎక్కువగా ఆకట్టుకుంటుందని కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ కారు గురించిన పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందాం.. XZ ప్లస్ లక్స్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 8.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.2-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది.

5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో ఉంది. ఈ ఇంజన్ 85 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNG విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ.9.50 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది 72 bhp పవర్, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టిగోర్ పెట్రోల్ వేరియంట్ 19.60 కి.మీల మైలేజ్ అందిస్తుంది. cng 28.06 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

New Tata Tigor Launched In India

2025 టాటా టిగోర్ ఎక్స్‌‌జెడ్ ప్లస్ లక్స్ ఎక్స్‌టీరియర్‌తో పాటు, ఇంటీరియర్ కూడా చాలా అందంగా ఉంటుంది. లోపల 10.25-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, కంఫర్ట‌బుట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి పలు ఇతర సదుపాయాలను కలిగి ఉంది.

ప్రయాణికుల సేఫ్టీ పరంగా కూడా టాటా కంపెనీ ముఖ్య ప్రాధాన్యత ఇచ్చింది. టిగోర్ ఎక్స్‌‌జెడ్ ప్లస్ లక్స్‌లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS),హిల్ హోల్డ్ కంట్రోల్ (HHC),ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీల కెమెరా వంటివి ఉన్నాయి.

2025 Tata Tigor Xz Plus Lux

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 11, 2025, 12:01 [IST]
English summary
New tata tigor xz plus lux variant launched in india here price and mileage details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+