కొత్త టయోటా ఫార్చ్యనర్ వచ్చేస్తోంది.. ఈ సారి మరింత భారీగా ఇంకాస్త మరిన్నీ ఫీచర్లతో అదిరిపోద్ది

టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) ఒక ఫుల్-సైజ్ ఎస్‌యూవీ. ఇది జనాల్లో భారీగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇది చాలా చక్కని డిజైన్, అనేక ఫీచర్లను కలిగి ఉంది. టయోటా కంపెనీ 2026 సెకండ్ ఆఫ్‎లో న్యూ జనరేషన్ ఫార్చ్యూనర్‎ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అసలు ఫార్చ్యునర్ అంటేనే పొలిటికల్ లీడర్స్ బండి అన్న పేరుంది. అలాంది దానిని ఇప్పుడు హిల్క్స్ పికప్ ట్రక్‌ను ఆధారం చేసుకుని రూపొందించబడుతుందని చెబుతున్నారు. కొత్త కారు అంచనా ధర, స్పెషాలిటీ ఏంటో చూద్దాం.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ డిజైన్
రాబోయే టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ బయటి భాగంలో అడ్వాన్సుడ్ డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఇందులో కొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఫాగ్ లైట్లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, అల్లాయ్ వీల్స్ ఉంటాయని చెబుతున్నారు. ఇది ప్లాటినం వైట్ పర్ల్, స్పార్క్లింగ్ బ్లాక్ క్రిస్టల్ షైన్, ఫాంటమ్ బ్రౌన్ వంటి కలర్లలో లభించవచ్చు.

New Toyota Fortuner Launch Expected Price Features and Release Date

కొత్త ఫార్చ్యూనర్ సైజ్, ఫీచర్లు
కొత్త కారు పరిమాణంలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు. ఇది 4795 మి.మీ పొడవు, 1855 మి.మీ వెడల్పు, 1835 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. ఇందులో 225 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్, 2745 వీల్‌బేస్ ఉంటాయి. 7-సీటర్ కారు కాబట్టి, ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. వీకెండ్, హాలీడేస్‎లలో టూర్లకు వెళితే ఎక్కువ మంది ప్రయాణించేందుకు, భారీ లగేజ్ తీసుకెళ్లడానికి 296 లీటర్ల బూట్ స్పేస్ ఉండవచ్చు.

ఇంజిన్, మైలేజ్
టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ పవర్ఫుల్ పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. దీని 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 166 బీహెచ్‌పీ పవర్, 245 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మరో 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 204 బీహెచ్‌పీ పవర్, 500 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

New Toyota Fortuner Launch Expected Price Features and Release Date

ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో రావచ్చు. ఈ కారు సుమారు 11 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. అలాగే, ఇందులో 2డబ్ల్యూడీ (టూ వీల్ డ్రైవ్), 4డబ్ల్యూడీ (ఫోర్ వీల్ డ్రైవ్) టెక్నాలజీ ఉండవచ్చు.

ఇంటీరియర్, సేఫ్టీ ఫీచర్లు
కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ క్యాబిన్ డిజైన్ మెరుగ్గా ఉంటుంది. ఇందులో 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, కిక్-టు-ఓపెన్ పవర్డ్ టెయిల్‌గేట్, డ్యుయల్-జోన్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉంటాయి.

New Toyota Fortuner Launch Expected Price Features and Release Date

సేఫ్టీ కోసం, ఇందులో 7-ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), వీఎస్‌సీ (వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్), ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి.

ధర, పోటీ
కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ధర కాస్త ఎక్కువగా ఉంటుందని అంచనా. వేరియంట్‌లను బట్టి, దీని ధర రూ.35 లక్షల నుండి రూ.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. ఈ కారుకు ఎంజీ గ్లోస్టర్, జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి కార్లు గట్టి పోటీ ఇస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, September 1, 2025, 10:09 [IST]
English summary
New toyota fortuner launch expected price features and release date
Read more on: #toyota #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+