రూ. 27999 లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లతో, 80కి పైగా కిలోమీటర్ల రేంజ్ పక్కా!
దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనేక వాహన తయారీ సంస్థలు కొత్త కొత్త మోడళ్లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా.. ఆల్ఫా వెక్టార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టూ-వీలర్ తయారీ సంస్థ.. "నైంటీ వన్" బ్రాండ్ కింద ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంఛ్ చేసింది. "XE సిరీస్" పేరుతో దీన్ని తీసుకువచ్చింది. కిలోమీటర్‌కు 15 పైసల కంటే తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో ఉన్న ఈ కారు.. సేఫ్టీ పరంగాను 'భేష్' అనేట్లుగా ఉంది. మరి ఈ కారులో ఉండే ఫీచర్లు దీని రేంజ్ తదితర వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
ఆల్ఫావెక్టార్స్ సంస్థ ప్రకారం.. ఈ కటింగ్-ఎడ్జ్ స్కూటర్ మోడల్‌లో BLDC మోటార్, హై-కెపాసిటీ బ్యాటరీ ఆప్షన్స్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయని చెబుతోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం- అయాన్ బ్యాటరీతో ఉంటుంది. ఇది 80+ కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీని ద్వారా లాంగ్ జర్నీలను చేరుకోవడానికి సులభంగా ఉంటుంది.

ఇది 25 kmph టాప్ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. ఇది సిటీలో ప్రయాణానికి అనువుగా ఉంటుంది. ఈ కొత్త స్కూటర్ అడ్వాన్స్‌డ్ రియర్ సస్పెన్షన్‌తో వస్తుంది. ఇది కఠినమైన రోడ్లపై కూడా స్మూత్ రైడ్ అందిస్తుంది. సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్‌ను తక్కువ వేగం అందించే విధంగా తీర్చిదిద్దారు. దీని ద్వారా అన్ని రకాల వినియోగదారులు రైడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
జీఎస్టీతో కలుపుకొని ఈ స్కూటర్ MRP రూ.27,999కి అందుబాటులో ఉంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు, హై-పర్ఫామెన్స్, తక్కువ ధరలో లభ్యత కారణంగా తమ స్కూటర్ ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈ కొత్త స్కూటర్ హై-కెపాసిటీ లిథియం ఐయాన్, లెడ్-యాసిడ్ బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఈ స్కూటర్ రేంజ్ అనుసరించి, వినియోగదారులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఈ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
దీంట్లోనే లిథియం ఐయాన్ బ్యాటరీ 80 కి పైగా కిలోమీటర్ల రేంజ్ అందిస్తుండగా.. లెడ్ యాసిడ్ బ్యాటరీ మరింత ఎక్కువ రేంజ్ అందించే అవకాశం ఉంది. ఈ రెండు బ్యాటరీ ఆప్షన్లు ఎక్స్‌టెండెడ్ వారంటీతో రానున్నాయి. దీంట్లోని లిథియం-ఐయాన్ బ్యాటరీ మూడేళ్ల వారంటీతో వస్తుండగా, లెడ్-యాసిడ్ బ్యాటరీ ఒక సంవత్సరం వారంటీతో ఉంటుంది. ఈ స్కూటర్ 4 AMP చార్జర్, ఆటో కట్- ఆఫ్‌తో వస్తుంది.
దీంతో ఈ స్కూటర్ త్వరగా, సురక్షితంగా ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. అలాగే ఈ స్కూటర్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పర్ఫామెన్స్, సస్టెయినబులిటీ, సౌకర్యవంతమైన అనుభూతి పట్టణాల్లోని వినియోగదారులకు అందిస్తుందని దీని తయారీ సంస్థ చెబుతోంది.
అతి తక్కువ ధరలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొన్ని ఎందుకు భారత వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది. అయితే ఇది ఎంతవరకు వినియోగదారులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మీకు బడ్జెట్‌లో మంచి ఈవీ స్కూటర్ కావాలంటే దీనిని ఎంచుకోవచ్చు. ఇది అర్బన్ మొబిలిటీకి సరిపోతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








