టూవీలర్ ధరకే రెండు ఫ్యామిలీలకు సరిపడే కారు! మినీ బస్సులా అంతా ట్రావెల్ చేయొచ్చు.. నిస్సాన్ కొత్త ఎంపీవీ!

భారతీయ మార్కెట్లో MPV కార్లకు ఎంతగానో ఆదరణ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద కుటుంబాలు, ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ఆస్వాదించాలనుకునే వారు తరచూ MPVలను తమ మొదటి ఎంపికగా ఎంచకుంటారు. ఎందుకంటే ఇవి ప్రయాణికులకు విశాలమైన కూర్చొనే స్థలాన్ని, మెరుగైన లగేజ్ స్పేస్‌ను, అవసరమైన ఇతర ఫీచర్లను అందిస్తాయి. ఇలాంటి కస్టమర్ బేస్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు భారత్‌లోకి వస్తోంది ఒక కొత్త MPV. ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, ఇది నిస్సాన్ నుంచి విడుదల కానుంది. అది కూడా చాలా తక్కువ ధరతో. కొత్త కారును కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా ఓ మంచి వార్త. ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ (renault), జపాన్‌కు చెందిన నిస్సాన్ (nissan) మధ్య ఉన్న చాలా కాలంగా ఉన్న భాగస్వామ్యం కారణంగా ఈ కొత్త MPV రూపుదిద్దుకుంది.

ఇప్పటికే రెనాల్ట్ "ట్రైబర్ (Triber)" పేరుతో భారత్‌లో విజయవంతమైన MPVను విక్రయిస్తోంది. అదే ప్లాట్‌ఫార్మ్ ఆధారంగా, కొత్త డిజైన్‌తో, నిస్సాన్ ఇప్పుడు సొంత మోడల్‌ను రూపొందిస్తోంది. ఈ కారు రూపకల్పనలో నిస్సాన్ ప్రత్యేకమైన స్టైలింగ్‌ను తీసుకురానుంది. ట్రైబర్‌తో పొత్తు ఉన్నప్పటికీ, కొత్త MPV పూర్తిగా వేరే డిజైన్‌ ‌ను అనుసరించనుందని సమాచారం. ఇది వినియోగదారులకు కొత్తదనం కలిగించడమే కాకుండా, మార్కెట్లో మిగతా MPVల కంటే ప్రత్యేకతను కలిగి ఉండేలా చూస్తోంది.

Nissan Budget Friendly Mpv

ఇటీవల ప్రచారంలోకి వచ్చిన ఈ వివరాలు చూస్తుంటే, నిస్సాన్ కొత్త MPV మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత మధ్య తరగతి కుటుంబాలకు మరింత అందుబాటులో ఉండే ఆప్షన్ అవుతుందని అంచనా. నిస్సాన్ తన కొత్త MPVలో ప్రామాణికంగా మెరుగైన పనితీరును అందించేందుకు, ఇప్పటికే మార్కెట్‌లో నమ్మకం సాధించిన రెనాల్ట్ ట్రైబర్‌లో ఉపయోగించే అదే 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను దీనిలో ఉపయోగించే అవకాశం ఉంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఇంజిన్‌ను సరిగ్గా అదే స్పెసిఫికేషన్లతో, అంటే 72 PS పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయవచ్చు. పెర్ఫార్మెన్స్‌తో పాటు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయంలోనూ వినియోగదారులకు సరళమైన డ్రైవింగ్ అనుభవం అందించడానికి, ఈ MPVలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌ను అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ప్రధానంగా సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

Budget Friendly Mpv Will Launch Soon

ఫీచర్ల పరంగా చూసుకుంటే, ఈ కొత్త MPVలో మోడర్న్ టచ్ అనిపించే ఎన్నో అంశాలు ఉండే అవకాశముంది. ముఖ్యంగా, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఎక్కువ. ఇవి అందరికీ కంఫర్ట్ కలిగించడమే కాకుండా, MPVను టెక్నాలజీ పరంగా ముందంజలో ఉంచే అంశాలు కావడం గమనించాల్సిన విషయం.

నిస్సాన్ కొత్త MPVపై భారతీయ వినియోగదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిజైన్ పరంగా మాత్రమే కాక, టెక్నాలజీ, భద్రత, ఫీచర్ల పరంగానూ ఎంతో అడ్వాన్స్‌డ్‌గా రూపొందించబడుతోందని సమాచారం. ఈ MPVలో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీను అందించబోతున్నట్లు తెలుస్తోంది, దీని ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ లేదా ఇంటర్నెట్‌ ద్వారా కార్ ఫంక్షన్లను నియంత్రించగలుగుతారు. దీనితో పాటు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

Nissan Renault

సేఫ్టీ అంశాల్లోనూ నిస్సాన్ ఎలాంటి రాజీ పడకుండానే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఇచ్చే అవకాశాలున్నాయి. అదనంగా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(TPMS), 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు 7 సీటర్‌తో పెద్ద కుటుంబానికి అనుకూలంగా ఉండే విధంగా రాబోతుంది. ఇది 2026 ప్రారంభంలో అమ్మకానికి రావచ్చు. ధర దాదాపు కేవలం రూ.6 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 12, 2025, 10:50 [IST]
English summary
Nissan budget friendly mpv will launch soon in india expected price and features details
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+