65 దేశాల్లోని జనాలు ఈ కారునే కావాలంటున్నారు.. దీని క్రేజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! నిస్సాన్ సేల్స్ బ్లాస్ట్

ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ నిస్సాన్(Nissan) గత కొంత కాలంగా బలమైన సేల్స్‌ను సాధిస్తుంది. ఇతర కంపెనీలకు ధీటుగా వేగంగా వరుసగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ కస్టమర్లను తన వైపు తిప్పుకుంటుంది. తాజాగా నిస్సాన్ తన అమ్మకాలపై కీలక వివరాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన విక్రయాలు సాధించినట్టు ప్రకటించింది. గత ఏడు సంవత్సరాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అంతకుముందు 2024-25లో మెరుగైన గణంకాలను సాధించింది. వాహన మార్కెట్లో కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి అదిరిపోయే డిజైన్స్, లేటెస్ట్ ప్రీమియం ఫీచర్స్‌తో కార్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో నిస్సాన్ వారిని ఆకట్టుకోవడంతో కొంత సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో నిస్సాన్ 99,000 యూనిట్లను విక్రయించింది. ఈ మొత్తంలో 28,000 యూనిట్లు భారత మార్కెట్లో అమ్ముడవ్వగా 71,000 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. ఈ గణాంకాలను చూస్తే, నిస్సాన్ కార్లు దేశంలో కన్నా అంతర్జాతీయ మార్కెట్‌లోనే ఎక్కువ డిమాండ్‌ను సంపాదించుకున్నాయని స్పష్టమవుతోంది. నిస్సాన్ మోడళ్లు మెరుగైన మైలేజ్, స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లో నిలదొక్కుకున్నాయి.

Nissan India Sales Details

కానీ భారతదేశంలో అమ్మకాలు కొంత మందకొడిగా ఉన్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్లో మాత్రం నిస్సాన్ కార్లకు విపరీతమైన ఆదరణ ఉంది. భారత మార్కెట్లో నిస్సాన్ మరిన్ని మోడళ్లను విడుదల చేయడం ద్వారా స్థానికంగా విక్రయాలను పెంచుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా, నిస్సాన్ మాగ్నైట్ మోడల్ విదేశీ మార్కెట్లో భారీ ఆదరణ పొందుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో కొనుగోలుకు లభిస్తుంది.

ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా, మాగ్నైట్‌ను నిస్సాన్ కంపెనీ రెండు రకాల డ్రైవింగ్ లేఅవుట్‌లలో ఎడమ వైపు స్టీరింగ్ (Left-Hand Drive), కుడి వైపు స్టీరింగ్ (Right-Hand Drive)లలో సరఫరా చేస్తుంది. దీంతో వివిధ దేశాల్లో ఉన్నటువంటి వేరు వేరు రోడ్లకు అనుగుణంగా అక్కడి ప్రజలు డ్రైవింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న మాగ్నైట్ SUV మోడల్ ధర రూ. 6.14 లక్షలు. ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే.

Nissan India Sales Reports

దేశంలో అందుబాటు ధరలో కొనుగోలు చేయడానికి లభిస్తున్న SUV మోడల్‌లో ఇది కూడా ఒకటి. గత ఏడు ఆర్థిక సంవత్సరాల్లో నిస్సాన్ కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో కేవలం 51,275 యూనిట్ల విక్రయాలతో ప్రారంభం కాగా, 2024 నాటికి 99,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. కంపెనీ విక్రయ గణాంకాలను పరిశీలిస్తే, 2021 ఆర్థిక సంవత్సరంలో సేల్స్ 76,666 యూనిట్లుగా ఉన్నాయి.

తరువాత 2022లో 94,219 యూనిట్లు విక్రయించి, అప్పటివరకు అత్యధిక అమ్మకాల రికార్డును నెలకొల్పింది. కానీ 2023లో పోటీ ఎక్కువ కావడం వలన గణంకాలు 73,124 యూనిట్లకు తగ్గాయి. కానీ 2024 నాటికి నిస్సాన్ తన మార్కెట్ ప్లేస్‌ను మరింత బలోపేతం చేసుకుని 99,000 యూనిట్లను విక్రయించి, గత ఏడు ఆర్థిక సంవత్సరాల్లో అత్యధిక అమ్మకాలను సాధించింది.

Nissan India Sales Details Fy2024-25

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 1, 2025, 15:17 [IST]
English summary
Nissan india performance reports for the fiscal year 2024 25 is 99000 sales units
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+