నిస్సాన్ నుంచి పవర్‌పుల్ కారు.. డస్టర్ స్టైల్‌లో కొత్త రాక్షసుడు వచ్చేస్తున్నాడు!

భారతదేశపు కాంపాక్ట్ SUV విభాగంలో పోటీ రోజురోజుకీ పెరిగిపోతున్న వేళ, నిస్సాన్ (Nissan) కంపెనీ తన సత్తా చాటేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం నిస్సాన్ తన మాగ్నైట్ మోడల్‌కే పరిమితమై ఉన్నా, 2026 ఆర్థిక సంవత్సరానికి ముందు మరో మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని ప్రణాళికలు వేస్తోంది. వాటిలో ఒకటి మధ్యతరగతి SUV సెగ్మెంట్‌కు చెందింది. ఇది కేవలం ఒక కొత్త SUV మాత్రమే కాదు, దీన్ని ప్రసిద్ధ రెనాల్ట్ డస్టర్ నుంచి తీసుకోబోతున్నారు. గతంలో డస్టర్ భారీ అమ్మకాలను నమోదు చేయగా, అదే డస్టర్ ఆధారంగా వచ్చిన నిస్సాన్ టెర్రానో కూడా మార్కెట్లో మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు, డస్టర్ తిరిగి భారత మార్కెట్లోకి రాబోతున్న ఈ సమయంలో, నిస్సాన్ ఆ వేదికను మరోసారి వినియోగించుకుంటోంది.

రెనాల్ట్-నిస్సాన్ భాగస్వామ్యం ద్వారా ఈ కొత్త మోడల్ రూపుదిద్దుకుంటోంది. ఇది కేవలం ఒక రీబ్యాడ్జింగ్ ప్రాజెక్టు మాత్రమే కాకుండా, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రూపొందించబడ్డ SUVగా పేరొందింది. రాబోయే మోడల్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా వంటి కార్లు గట్టి పోటీగా నిలవబోతోంది. క్లాసిక్ డస్టర్‌కు ఉన్న బలమైన హైవే ప్రెజెన్స్, రఫ్ అండ్ టఫ్ డిజైన్, ఆఫ్ రోడ్ పరిస్థితులను సైతం తట్టుకుంటుంది.

Nissan India New Suv

లేటెస్ట్ ఫీచర్లు, డిజిటల్ ఇంటీరియర్, సేఫ్టీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించే ఈ కారు, కంపెనీకి తిరిగి సరైన ట్రాక్‌పై నిలవడానికి మంచి అవకాశంగా మారవచ్చు. ఇప్పటికే SUVలకు దేశంలో పెరుగుతున్న ఆదరణను చూస్తే, నిస్సాన్ తీసుకొస్తున్న ఈ కొత్త ఎంట్రీ సరికొత్త అమ్మకాలను నమోదు చేస్తుందని విశ్లేషకుల అంచనా. నిస్సాన్ యొక్క కొత్త SUV పై ఉత్కంఠ పెరిగిపోతున్న వేళ, దీనికి సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది.

'కైట్' అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న ఈ కారు, ప్రస్తుతం చెన్నైలోని రెనాల్ట్-నిస్సాన్ ఉమ్మడి తయారీ ప్లాంట్‌లో తయారీ దశలో ఉంది. ఇదే ప్లాంట్‌లో రెనాల్ట్ డస్టర్‌తో పాటు దాని 7-సీటర్ ఎడిషన్ అయిన బోరియల్ కూడా తయారవుతాయి. ఈ SUV కూడా అదే బలమైన ఫౌండేషన్ CMF-B ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపుదిద్దుకుంటోంది. ఈ కారు గురించిన పూర్తి సమాచారం మరింత తెలియాల్సి ఉంది.

నిస్సాన్ 'కైట్'లో 1.3-లీటర్, నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ వాడే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ 156 bhp పవర్, 254 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. భారత రోడ్లపై డ్రైవింగ్ అనుభవాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేలా ఇది ఉంటుంది. రెనాల్ట్ డస్టర్, బోరియల్ కార్ల ఆధారంగా రూపుదిద్దుకుంటుండటం వల్ల, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు మెరుగైన ఇంటీరియర్, గట్టి బాడీ స్ట్రక్చర్ ఉండే అవకాశం ఉంది.

ఈ SUV మార్కెట్లోకి అడుగుపెడితే, ఇది కేవలం నిస్సాన్ బ్రాండ్‌కు గౌరవాన్ని తీసుకురావడమే కాదు, SUV విభాగంలో వినియోగదారులకు మరో విశ్వసనీయమైన ఎంపికగా నిలవబోతుందన్న అంచనాలు మొదలయ్యాయి. కంపెనీ గతంలో విడుదల చేసిన టీజర్ ప్రకారం, ముందు భాగంలో కనెక్ట్ చేయబడిన LED DRLలు, బలమైన హుడ్ లైన్లు, రెండు క్రోమ్ స్ట్రిప్‌లు, కొత్త ఫ్రంట్ బంపర్ వంటి అంశాలు దీనిలో ఉన్నాయి.

నిస్సాన్ డస్టర్ తో పోలిస్తే ఇది వేరే లుక్ తో ఉంటుంది. కైట్ మరిన్ని ఫీచర్లను పొందే అవకాశం ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్ , ఇతర అత్యుత్తమన సేఫ్టీ అంశాలు ఈ కారులో ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, May 12, 2025, 17:15 [IST]
English summary
Nissan india will be launch to new suv in upcoming days more details inside
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+