గాలిలో ఎగిరే కైట్‌లా నడుస్తుందట ఈ కొత్త కారు.. లుక్ చూస్తేనే ఫిదా అవ్వాల్సిందే!
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ దిగ్గజం నిస్సాన్ (Nissan), దశాబ్దాలుగా గ్లోబల్ మార్కెట్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. నాణ్యత, పనితీరు, భద్రత అనే మూడు మూల సూత్రాలపై నమ్మకంగా ముందుకు సాగుతున్న ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ దేశాల్లో అనేక మోడళ్లను విజయవంతంగా విక్రయిస్తోంది. భారతదేశంలో కూడా నిస్సాన్ బ్రాండ్‌కు గణనీయమైన అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కంపెనీ చేసిన ఓ భారీ ప్రకటన ఆటోమొబైల్ ప్రపంచంలో భారీ చర్చను రేపుతోంది. బ్రెజిల్‌లోని సావో పాలోలో నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక గ్లోబల్ ఈవెంట్‌లో, నిస్సాన్ తన సరికొత్త SUV కైట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ విభిన్న డిజైన్‌తో, ఆధునిక సాంకేతికతలతో, భవిష్యత్ తరానికి అనువైన సౌకర్యాలతో రూపొందించిన SUV, కంపెనీ నెక్స్ట్-జెనరేషన్ వాహనాల దిశగా తీసుకున్న కీలక అడుగుల్లో ఒకటిగా నిలిచింది.
ఈ కొత్త మోడల్‌ను బ్రెజిల్‌లోని రెసెండే తయారీ కర్మాగారంలో తయారు చేస్తున్నారు. ఈ ప్లాంట్ ఇప్పటికే నిస్సాన్‌కు గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్కడ తయారయ్యే కైట్ SUVను 2026 నుండి 20 కి పైగా దేశాలకు ఎగుమతి చేయాలనే వ్యూహాన్ని కంపెనీ ప్రకటించింది. అంటే అంతర్జాతీయంగా ఈ మోడల్‌కు భారీ డిమాండ్ ఉంటుందని నిస్సాన్ ముందుగానే అంచనా వేసిందని అర్థం.

భారతీయ రూపాయల్లో చూడగా, ఈ SUV ధర సుమారు రూ.20 లక్షల వరకు ఉండొచ్చని వెల్లడించారు. ఈ ధర శ్రేణిలో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ, నిస్సాన్ వంటి అనుభవజ్ఞులైన సంస్థ నుంచి కొత్త SUV వస్తుందని తెలిసిన క్షణం నుంచే భారతీయ కొనుగోలుదారుల్లో ఆసక్తి పుట్టింది.
అయితే, భారత మార్కెట్లో 'కైట్' SUV విడుదలపై నిస్సాన్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇది భారత్‌లోకి వస్తుందా? వస్తే ఎప్పుడు? అనే ప్రశ్నలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా నిస్సాన్ మాగ్నైట్‌తో మంచి మార్కెట్‌ను సంపాదించిన తర్వాత, ఈ కొత్త SUV కూడా భారత్‌లో విడుదలైతే కంపెనీకి మరో కీలక టర్నింగ్ పాయింట్ అవుతుందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతానికి భారతీయ భారత మార్కెట్లో కూడా ప్రవేశపెడతారని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

నిస్సాన్ కొత్త కారు పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇది తన క్లాస్‌లోనే అత్యంత శక్తివంతమైన సెగ్మెంట్లో ఒకటిగా నిలుస్తుంది. ఇందులో 1.6-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ (పెట్రోల్ + ఇథనాల్) రెండు రకాల ఇంధనాలతో సమర్ధవంతంగా పని చేస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజన్ 110 bhp వరకు శక్తిని, 146 Nm వరకు టార్క్‌ను అందించి నగర రైడింగ్‌లోనూ, హైవే డ్రైవింగ్‌లోనూ చురుకైన పనితీరును ఇస్తుంది.
అదే ఇంజన్ ఇథనాల్ మోడ్‌లో మరింత స్పందన చూపుతూ 113 bhp శక్తి, 149 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంధన రకం మార్చినా కూడా ఇంజన్ డెలివరీలో ఎటువంటి తగ్గుదల లేకుండా స్మూత్‌గా, రిఫైన్డ్‌గా పనిచేయడమే దీని ప్రత్యేకత. డ్రైవింగ్ అనుభవాన్ని ఇంకా మెరుగుపర్చేందుకు కంపెనీ ఇందులో CVT ట్రాన్స్‌మిషన్‌ను ఇచ్చింది. ఇది గేర్స్ మార్చే సమయంలో ఎలాంటి జర్క్‌లు లేకుండా నాజూకైన, కంఫర్ట్-ఒరియెంటెడ్ డ్రైవ్‌ను అందిస్తుంది.
ఇంత శక్తి ఉన్నప్పటికీ, ఈ ఇంజిన్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీలో కూడా నిరాశపరచదు. రియల్-వరల్డ్ డ్రైవింగ్‌లో సుమారు 11 kmpl వరకు మైలేజ్ ఇవ్వగలిగే సామర్థ్యం దీని దగ్గర ఉంది. దీని క్యాబిన్ డిజైన్ బాగుంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ AC వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








