ఒక్కరు కూడా ఈ కారును కొనలేదు.. కుటుంబం మొత్తానికి సరిపడే 7 సీటర్ ఇది..

నిస్సాన్ (Nissan) కంపెనీ భారత మార్కెట్లో తన వాహనాలను తయారు చేసి విక్రయిస్తున్నప్పటికీ, అమ్మకాల పరంగా పెద్ద స్థాయిలో ఎదగలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం, సంస్థ వద్ద ఉన్న మోడళ్ల సంఖ్య చాలా పరిమితంగా ఉండటమే. తక్కువ వేరియంట్లతో మార్కెట్లో పోటీని ఎదుర్కోవడం కష్టమవుతోంది. నిస్సాన్‌కి ప్రస్తుతం మాగ్నైట్ కారు మాత్రమే అమ్మకాలలో ప్రధాన భరోసా ఇస్తోంది. ఇది సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మధ్య తరగతి వినియోగదారులను ఆకట్టుకుంటూ, మంచి డిమాండ్‌ను కొనసాగిస్తోంది. అయితే, అదే సమయంలో కంపెనీ లగ్జరీ మోడల్‌గా మార్కెట్లో ఉంచిన X-ట్రయల్ మాత్రం పూర్తిగా విఫలమవుతోంది. గత జూలై నెల అమ్మకాల గణాంకాలు బయటకు వచ్చినప్పుడు, ఒక్క X-ట్రయల్ కూడా అమ్ముడుపోలేదనే విషయం బయటపడింది.

ఇది కంపెనీకి చాలా పెద్ద షాక్‌గా మారింది. తయారీ పూర్తయిన కార్లు స్టాక్‌లో ఉన్నప్పటికీ, వాటిని కొనుగోలు చేయడానికి కస్టమర్లు ముందుకు రాకపోవడం గమనార్హం. మరీ ముఖ్యంగా, ఇది ఒక్క జూలై నెలకే పరిమితం కాలేదు. అంతకుముందు నెలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వరుసగా రెండు నెలలు ఈ కారు ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోకపోవడం నిస్సాన్ మార్కెటింగ్ వ్యూహాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Nissan Luxury Car X Trail July 2025 Sales Recorded Zero Units

భారత మార్కెట్లో SUVలకు విపరీతమైన డిమాండ్ ఉన్న సమయంలో, X-ట్రయల్ వంటి లగ్జరీ SUV విక్రయాల్లో పూర్తిగా నిలిచిపోవడం కంపెనీకి చాలా ఆందోళన కలిగించే విషయం. మరోవైపు, మాగ్నైట్ కారు మాత్రం కంపెనీకి ఆశలు పెట్టిస్తున్న ఏకైక మోడల్‌గా నిలుస్తోంది. చిన్న ధర, ఫీచర్లు, మైలేజ్ కారణంగా అది కస్టమర్లను ఆకర్షిస్తున్నప్పటికీ, పెద్ద SUV మార్కెట్లో పోటీ ఇవ్వడంలో నిస్సాన్ వెనుకబడిపోతున్నట్లు కనిపిస్తోంది.

నిస్సాన్ తన లగ్జరీ SUV ఎక్స్-ట్రైల్‌ను భారత మార్కెట్లో రూ.49.92 లక్షల(ఎక్స్‌షోరూమ్) ధరకు అందిస్తోంది. ధర ప్రీమియం రేంజ్‌లో ఉన్నా, ఇందులో ఉన్న ఫీచర్లు, టెక్నాలజీలు అంతర్జాతీయ స్థాయిలో ఉండటంతో ఈ కారు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ కారులో ముఖ్యంగా భద్రత విషయంలోనే కాదు, స్టైల్, పనితీరు, కంఫర్ట్ అన్ని కలిపి ఒక ప్యాకేజీగా ఇచ్చింది. జైన్ పరంగా చూసుకుంటే, ఎక్స్-ట్రైల్ ఒక ప్రీమియం SUV లుక్‌ను వెంటనే ఇస్తుంది.

Nissan Luxury Car X Trail July 2025 Sales Recorded Zero Units

ముందు భాగంలో నిస్సాన్ సిగ్నేచర్ V-మోషన్ గ్రిల్ ఉండగా, దానికి సపోర్ట్‌గా ఇచ్చిన స్లిమ్ LED హెడ్‌ల్యాంప్స్ చాలా శార్ప్‌గా ఉంటాయి. బాడీ మొత్తానికి ఇచ్చిన డైనమిక్ లైన్స్ దీన్ని మరింత అగ్రెసివ్‌గా, స్పోర్టీగా చూపిస్తాయి. వెనుక భాగం కూడా సాధారణంగా కాకుండా ప్రత్యేకమైన బూమరాంగ్-స్టైల్ టెయిల్ ల్యాంప్స్ తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇంజిన్ పరంగా ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇవ్వబడింది, ఇది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కలిసి పనిచేస్తుంది. దీని వల్ల గరిష్టంగా 204 PS పవర్, 300 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు, 12V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వేరే వెర్షన్ కూడా లభిస్తుంది, ఇందులో 163 PS పవర్, 300 Nm టార్క్ లభిస్తుంది. డ్రైవింగ్ అనుభవం స్మూత్‌గా ఉండేలా CVT గేర్‌బాక్స్ అందించబడింది.

Nissan Luxury Car X Trail July 2025 Sales Recorded Zero Units

కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో మాత్రమే కాకుండా, అదనంగా ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ కూడా ఈ SUVలో లభించడం దీన్ని మరింత ప్రీమియం కేటగిరీలోకి తీసుకువెళ్తుంది. అంతేకాదు, ఈ SUVలో ఒకేసారి 7 మంది ప్రయాణించగల సామర్థ్యం ఉండటం కుటుంబ ప్రయాణాలకు అనువుగా చేస్తుంది. విస్తృతమైన ఇంటీరియర్ స్పేస్, లగ్జరీ టచ్‌తో కూడిన కంఫర్ట్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిపి ఈ కారు ఒక పూర్తి ప్యాకేజీలా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 16, 2025, 17:49 [IST]
English summary
Nissan luxury car x trail july 2025 sales recorded zero units more details inside
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+