కారుపై రూ.65 వేల తగ్గింపు+ఉచితంగా బంగారం.. నిస్సాన్ ఊహించని సర్‌ప్రైజ్ ఆఫర్.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!
భారతీయ వాహన మార్కెట్లో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ (Nissan) తనదైన ముద్ర వేసుకుంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయరీదారుల నుంచి బలమైన పోటీ వస్తున్నప్పటికి వాటిని ఎదుర్కొని మరి మెరుగైన అమ్మకాల గణాంకాలను నమోదు చేస్తుంది. తాజాగా కంపెనీ మాగ్నైట్ కారును తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. SUV మాగ్నైట్ పై హ్యాట్రిక్ కార్నివాల్ పేరిట బంపర్ డిస్కౌంట్ ఆఫర్‌ను నిస్సాన్ ప్రకటించింది. ఈ కారు ధర ప్రారంభ సమయంలో కేవలం రూ.4.99 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఇది భారతీయ వినియోగదారులకు SUV కలను నిజం చేసినట్లు నిలిచింది. కాలక్రమేణా, దీని విలువ పెరిగింది, ఆగష్టు 2024 నాటికి ప్రారంభ ధర రూ.6.14 లక్షల (ఎక్స్ షోరూమ్)కు చేరుకుంది.
ధర పెరిగినప్పటికి కూడా దాదాపు ఇది అన్ని వర్గాల వారు, ముఖ్యంగా మధ్య తరగతి కస్టమర్లు కొనుగోలు చేసే స్థాయిలోనే లభిస్తుంది. ఈ మోడల్‌పై ఇప్పుడు కంపెనీ ప్రత్యేక తగ్గింపును ఇస్తుంది. మాగ్నైట్ కొనాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారి కోసం నిస్సాన్ 'హ్యాట్రిక్ కార్నివాల్(hat-trick carnival)' ఆఫర్‌ను బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ SUV కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్‌కు గరిష్టంగా రూ. 55,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి.

కేవలం ఇది మాత్రమే కాదు, నిస్సాన్ రూ. 10,000 వరకు అదనపు కార్నివాల్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్‌లోనే మరో ప్రత్యేకమైన అంశం ఉంది. ఈ డీల్‌లో భాగంగా, నిస్సాన్ తన కస్టమర్లకు హామీగా బంగారు నాణెం ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. ఈ ఆఫర్‌ను ఉఫయోగించి మాగ్నైట్ కారును కొనుగోలు చేసిన వారు ప్రత్యేక ఆఫర్ ద్వారా అదనపు ప్రయోజనాలను కూడా సొంతం చేసుకుంటారు.
కీలక విషయం ఏమిటంటే నిస్సాన్ కార్నివాల్ ఆఫర్ మాగ్నైట్ కాంపాక్ట్ SUV ఎంపిక చేసిన వేరియంట్లపై మాత్రమే వర్తిస్తుంది. ఆఫర్‌లో భాగంగా లిమిటెడ్ స్టాక్‌పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పరిమిత కాలపు తగ్గింపు ప్రయోజనాలు వాడుకుని దేశంలో బాగా డిమాండ్ ఉన్న కారును తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ కారును కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసిన వారు ముందుగా మీ దగ్గరలోని షోరూమ్‌లలో ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి.

ఈ ఆకర్షణీయమైన డీల్స్ మాగ్నైట్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. స్టైలిష్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, తక్కువ ధర కలిగి ఉండటంతో పాటు, ఇప్పుడు ఈ ఆఫర్‌తో మాగ్నైట్ మరింత మంది కస్టమర్లను సంపాదించనుంది. ఇప్పటికే రెండుసార్లు ధర పెరిగినప్పటికీ, వినియోగదారులకు ఊరట కలిగించేలా తాజాగా ఆకర్షణీయమైన ఆఫర్‌లు అందుబాటులోకి వచ్చాయి. మాగ్నైట్ తన స్టైలిష్ డిజైన్, మైలేజ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అందుకే SUV విభాగంలో ఇది గట్టిపోటీనిచ్చే మోడల్‌గా మారింది.
ప్రస్తుతానికి, నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.14 లక్షలు కాగా, అత్యధిక స్పెసిఫికేషన్స్ కలిగిన టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 11.92 లక్షలుగా ఉంది. ఈ కారు ప్రస్తుతం 6 వేరియంట్లు, 12 కలర్ ఆప్షన్లు, రెండు ఇంజన్లు, మూడు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇటీవల 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ BR10 పెట్రోల్ ఇంజిన్‌ను ఇటీవలే E20 ప్రమాణాలకు మార్చారు.

ఇది 71 bhp పవర్, 96 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఆప్షన్ 98 bhp పవర్, 160 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) లను కలిగి ఉంటాయి. ఫీచర్స్ కూడా డజన్ల కొద్ది ఉన్నాయి.


Click it and Unblock the Notifications








