కారు కొనేవారు కాస్త ఆగండి.. మంచి మైలేజ్‌తో నిస్సాన్ కొత్త బేబీ SUV వచ్చేస్తుంది.. మెయింటనెన్స్ చాలా తక్కువ
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఇండియా (Nissan India) దేశీయ వినియోగదారులకు తక్కువ ధరలో కార్లను విక్రయిస్తూ, మారుతీ సుజుకీ (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors) వంటి కంపెనీలకు పోటీగా నిలుస్తుంది. తన ప్రసిద్ధ మోడల్ మాగ్నైట్ (magnite) దేశంలో బాగా ప్రజాధారణ పొందిన suvలలో ఒకటిగా ఉంది. ఇది ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్న మంచి డిమాండ్ ఉన్న కారు. దీని ఆకట్టుకునే రూపం, ఇంజిన్ పనితీరుతో అమ్మకాలను ఆశించినంతంగా సాధిస్తూ, నిస్సాన్ పేరును దేశం మొత్తం విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాగ్నైట్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో ఉంది. అయితే కంపెనీ ఈ ప్రసిద్ధ కారును Cng ఆప్షన్‌లో తీసురావాలని చూస్తుంది.
భారతీయ వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని Cng మాగ్నైట్‌ను తీసుకురావడం ద్వారా మార్కెట్లో దీనికి మరింత ఆదరణ పెరుగుతుందని కంపెనీ భావిస్తుంది. ప్రధానంగా మైలేజ్ ఎక్కువ కావాలనుకునే కస్టమర్లను ఇది బాగా ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర ఇంజిన్ ఆప్షన్‌లో సేల్స్‌లో దూసుకుపోతుండగా, ఈ కొత్త Cng కిట్‌తో ప్రత్యర్థి కంపెనీల కంటే బలమైన అమ్మకాలను నమోదు చేయనుంది.

నిస్సాన్ మాగ్నైట్ సాధారణంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌లో లీటరుకు 20 కి.మీల వరకు, అదే CVT టర్బో వేరియంట్‌లో 17.4 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇదే మైలేజ్ ఇచ్చే మోడళ్లు చాలా వరకు లభిస్తున్నాయి. అయనప్పటికి మాగ్నైట్‌కు డిమాండ్ సానుకూలంగానే ఉంది. ఇంత కంటే ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి Cng మాగ్నైట్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దేశయంగా పలు కంపెనీల CNG కార్లను కూడా విక్రయిస్తున్నాయి.
మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి దిగ్గజ వాహన తయారీదారులు ఈ సెగ్మెంట్‌లు పలు కార్లను దేశంలో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిస్సాన్ కూడా ఇదే బాటలో పయనించడానికి సిద్ధమైంది. Cng మాగ్నైట్ మైలేజ్ విషయానికి వస్తే, కిలో ఇంధనానికి 22 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుందని సమాచారం. ఇప్పటికే కైగర్,క్విడ్, ట్రైబర్ వంటి కార్లు డీలర్-స్థాయి CNG కిట్‌లను పొందుతున్నట్లుగానే మాగ్నైట్‌లో కూడా డీలర్-స్థాయి అనుబంధ కిట్‌గా అందించనున్నారు.

ఈ ప్రసిద్ధ మోడళ్లలో ఇచ్చిన అదే టెక్నాలజీని మాగ్నైట్‌లో ఇవ్వనున్నారు. మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి నిస్సాన్ మాగ్నైట్‌లో కొత్త CNG కిట్‌ను అమర్చి మార్కెట్లోకి తీసుకువస్తారని తెలుస్తుంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌తో నడిచే ఈ కారు భారతీయ వినియోగదారులకు బాగా నచ్చుతుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది. కొనుగోలుకు వచ్చిన తరువాత టాటా పంచ్ కారుకు పోటీగా ఉండే అవకాశం ఉంది.
నిస్సాన్ తన మాగ్నైట్ CNGకి 3 సంవత్సరాల లేదా 1 లక్ష కి.మీ వారంటీ అందించే ఛాన్స్ ఉంది. అదనంగా కిట్‌పై 1 సంవత్సరం వారంటీని అందిస్తారని తెలుస్తుంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిస్సాన్ డీలర్లకు యునో మిండా గ్రూప్ CNG కిట్‌ను సరఫరా చేస్తుంది. మాగ్నైట్ అన్ని వేరియంట్లలో CNG కిట్‌ను అందిస్తుందా లేదా అనేది తెలియరాలేదు.

కంపెనీ పేర్కొన్నదాని ప్రకారం, కొత్త మాగ్నైట్ నిర్వహణ ఖర్చు చాలా వరకు తక్కువ అవుతందని తెలిపింది. పలు వేరియంట్లలో లభిస్తున్న నిస్సాన్ మాగ్నైట్ డజన్ల కొద్ది లేటెస్ట్ ఫీచర్స్‌తో పాటు ప్రయాణికుల రక్షణ పరంగా 55 సేఫ్టీ ప్రమాణాలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








