బడ్జెట్లోనే కారు కావాలా? ఆరు లక్షల్లోపే ఈ తోపు కారు కొని మీ ఇంటి ముందు పెట్టుకోండి!
జీఎస్టీ రేట్ల తగ్గింపు భారత ఆటోమొబైల్ రంగానికి ఒక శుభవార్తగా మారింది. వాహనం కొనాలనుకునే వినియోగదారులందరికీ ఇది నిజంగా లాటరీ కొట్టినట్టే. ఎందుకంటే, గత కొంత కాలంగా ఆటోమొబైల్ పరిశ్రమలో ధరల పెరుగుదల వాహనాలు కొనుగోలు చేయాలనుకునే సాధారణ కుటుంబాలకు పెద్ద అడ్డంకిగా మారింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగానికి ఊపిరి పోసింది. తగ్గించిన GST రేట్లను వెంటనే వినియోగదారులకు అందించడంలో ఆటోమొబైల్ కంపెనీలు కీలకంగా అడుగులు వేస్తున్నాయి. రెనాల్ట్, మహీంద్రా, స్కోడా లాంటి బ్రాండ్లు ఒక్కొక్కటి తమ వాహనాల కొత్త ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను మరింత ఆకర్షించేలా చేశాయి. ఇప్పుడు అదే జాబితాలో నిస్సాన్ కూడా చేరింది. నిస్సాన్ మోటార్ ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన B-SUV మోడల్ మాగ్నైట్ ధరలను కొత్తగా ప్రకటించింది.
నాలుగు మీటర్లలోపు పొడవు కలిగిన SUV సెగ్మెంట్‌లో GST తగ్గింపుతో వచ్చిన ప్రయోజనం నేరుగా కస్టమర్లకు చేరింది. మార్పు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఫలితంగా మాగ్నైట్ SUV ధరలు లక్ష రూపాయల వరకు తగ్గాయి. అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే, ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ బేస్ వేరియంట్ విసియా మాన్యువల్ ఆరు లక్షల లోపలే కొనుగోలు చేయవచ్చు. ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.61 లక్షలు మాత్రమే.

ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ SUV కావాలనుకునే వారికి ఒక పెద్ద అవకాశం. అంతేకాకుండా, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యం కోరుకునే వినియోగదారుల కోసం మధ్యస్థాయి వేరియంట్‌లు అయిన N-కనెక్టా CVT, కురో CVT మోడల్‌లు కూడా ఇప్పుడు మరింత సులభమైన ధరలో లభ్యమవుతున్నాయి. వీటి ధరలు పది లక్షల లోపలే ఉండటం ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది.
హై-ఎండ్ ప్రీమియం SUV లుక్, ఫీచర్లతో ఆకట్టుకునే CVT టెక్నా, CVT టెక్నా ప్లస్ వేరియంట్‌ల ధరలు కూడా బాగా తగ్గాయి. ఇందులో టెక్నా వేరియంట్ దాదాపు రూ. 97,000 వరకు, టెక్నా ప్లస్ వేరియంట్ ధరపై నేరుగా ఒక లక్ష రూపాయల వరకు తగ్గింపు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ కస్టమర్లకు మరింత ఆకర్షణీయమైన ఆఫర్‌గా మారింది.

ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 5.61 లక్షల నుండి రూ. 9.93 లక్షల మధ్య ఉండటంతో, బడ్జెట్ SUV కావాలనుకునేవారికి కానీ, ఫీచర్లతో కూడిన హై-ఎండ్ SUV కోరుకునేవారికి కానీ మాగ్నైట్ సరైన ఎంపికగా నిలుస్తోంది. నిస్సాన్ CNG రెట్రోఫిట్ కిట్ ధరను కూడా తగ్గించింది. సాధారణంగా రూ. 74,999 గా ఉన్న ఈ కిట్‌ను ఇప్పుడు రూ. 3,000 తగ్గింపుతో పొందవచ్చు.
ప్రభుత్వం ఆమోదించిన విక్రేత ద్వారా కిట్ నాణ్యత విషయంలోనూ నిస్సాన్ ఎటువంటి రాజీ పడలేదు. దీనికి 3 సంవత్సరాల లేదా 1 లక్ష కి.మీ వారంటీ అందించబడుతోంది. అంటే కిట్ ఫెయిల్ అవుతుందేమో, సర్వీసింగ్ ఖర్చులు ఎక్కువవుతాయేమో అని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ విధంగా SUV ధరల తగ్గింపుతో పాటు CNG కిట్‌పై కూడా ప్రత్యేక ఆఫర్ ఇవ్వడం ద్వారా నిస్సాన్, వినియోగదారులను అట్రాక్ట్ చేస్తోంది.

ఇది పండుగ సీజన్‌లో కస్టమర్ల ఆనందాన్ని రెట్టింపు చేసే స్ట్రాటజీగా చెప్పుకోవచ్చు. ఈ ధరల మార్పు నిస్సాన్ మాగ్నైట్‌ను SUV మార్కెట్లో మరింత పోటీదారుగా నిలబెట్టబోతోంది. ఎకానమీ బేస్ వేరియంట్ నుండి లగ్జరీ ఫీచర్లతో కూడిన టాప్-ఎండ్ వేరియంట్ వరకు అన్ని సెగ్మెంట్‌లలోనూ వినియోగదారులు ఇప్పుడు తక్కువ ఖర్చుతోనే మంచి SUVని సొంతం చేసుకునే అవకాశం పొందుతున్నారు.


Click it and Unblock the Notifications








