డిస్కౌంట్ పండగ: 20 కి.మీ మైలేజ్ కారుపై భారీ తగ్గింపు.. డిమాండ్ పెరగకముందే షోరూమ్‌కు పరిగెత్తండి!
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నిస్సాన్ (Nissan) మే నెలకు సంబంధించి ప్రత్యేకంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి తగ్గింపు ప్రయోజనాలను తీసుకొచ్చింది. తన ప్రసిద్ధ మోడల్ అయినటువంటి మాగ్నైట్ (Magnite) కారును తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ మెరుగైన పనితీరును అందిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్న ఈ కారుపై మే 2025లో గరిష్టంగా దాదాపు రూ.90,000 వరకు తగ్గింపులు ఉన్నాయి. ఈ కారుకు ఉన్న డిమాండ్ ను గమనిస్తే, ప్రతీ నెలా ఈ SUV సుమారు 2,000 యూనిట్లకు పైగా అమ్ముడవుతోంది. మాగ్నైట్ కారు నిస్సాన్ కంపెనీకి అత్యంత కీలకమైన మోడల్.
ప్రస్తుతం, మే 2025లో, నిస్సాన్ కంపెనీ తన మాగ్నైట్ SUV పై వేరియంట్ల వారీగా తగ్గింపులు అందిస్తుంది. తన పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి 2024 మోడళ్లపై కనీసం రూ. 25,000 నుండి గరిష్టంగా రూ. 90,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా 2025 మోడళ్లపై కూడా తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తుంది. అయితే 2024 మోడళ్లతో పోలిస్తే కొంచెం తక్కువ ప్రయోజనాలు లభిస్తున్నాయి.

2025 మాగ్నైట్ SUV పై వేరియంట్ల వారీగా కనీసం రూ. 25,000 నుండి రూ. 50,000 మధ్యగా తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ధరలో నిస్సాన్ మాగ్నైట్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. 2024 నాన్ టర్బో మాన్యవల్ ట్రాన్స్‌మిషన్‌పై రూ. 60,000 వరకు నగదు తగ్గింపు ఉంది. అదే EZ-Shift ట్రాన్స్‌మిషన్‌పై రూ.80,000 వరకు క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు.
టర్బో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అన్ని వేరియంట్లపై రూ.90,000 వరకు నగదు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. టర్బో సీవీటీ ట్రాన్స్‌మిషన్ n-connecta వేరియంట్‌పై రూ. 55000 నగదు తగ్గింపు, టెక్నా వేరియంట్‌పై రూ.70,000, టెక్నా ప్లస్ పై రూ.90,000 క్యాష్ డిస్కౌంట్ ప్రయోజనాలు ఉన్నాయి. 2025 మోడళ్ల విషయానికి వస్తే, నాన్ టర్బో మాన్యవల్ ట్రాన్స్‌మిషన్‌పై రూ. 50,000 వరకు తగ్గింపు ఉంది.

ఈ మొత్తంలో రూ.5,000 నగదు తగ్గింపు, రూ.40,000 ఎక్స్చేంజ్ బోనస్, కార్పోరేట్ తగ్గింపు రూ.5,000 ఉన్నాయి. 2025 EZ-Shift ట్రాన్స్‌మిషన్‌పై రూ.50,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మొత్తంలో రూ.5,000 నగదు తగ్గింపు, రూ.40,000 ఎక్స్చేంజ్ బోనస్, కార్పోరేట్ తగ్గింపు రూ.5,000 ఉన్నాయి. టర్బో మాన్యవల్, టర్బో సీవీటీ ట్రాన్స్‌మిషన్‌పై కూడా ఈ విధమైన తగ్గింపులను అందిస్తుంది. వీటితో పాటు పై అన్నింటిపై కూడా ఫైనాన్స్ సౌకర్యాలను కూడా అందిస్తుంది.
ఇంకా స్క్రాపేజ్ తగ్గింపు పేరిట తగ్గింపు ప్రయోజనాలను అందిస్తుంది. నిస్సాన్ అందిస్తున్నటువంటి తగ్గింపుల గురించిన పూర్తి వివరాల కోసం కస్టమర్లు మీ దగ్గరలోని కంపెనీ షోరూమ్‌లో డీలర్లను, అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకోగలరు. ఇక నిస్సాన్ మాగ్నైట్ SUV ఇతర వివరాల్లోకి వెళితే, ఇది ప్రారంభ ధర రూ. 6 లక్షల నుంచి రూ.12 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 5 సీటర్ కారు.

నిస్సాన్ మాగ్నైట్ SUV లో రెండు రకాల పవర్‌ట్రెయిన్లు అందుబాటులో ఉన్నాయి, ఒకటి 1-లీటర్ సహజంగా పీల్చే పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి శక్తివంతమైన 1-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ వేరియంట్. వేరియంట్‌ను బట్టి ఇది లీటరుకు సగటున 17 నుండి 20 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. సాధారణ నగర ప్రయాణాలు కానీ, హైవే ప్రయాణాలు కానీ, రెండింటికీ సరైన ఎంపికగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications








