వామ్మో.. అంత తక్కువ ధరకే 7 మంది సౌకర్యంగా కూర్చునే కారు? నిస్సాన్ కొత్త బ్లాక్‌బస్టర్ అదిరిపోతుంది!

జపాన్‌కు చెందిన ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ నిస్సాన్ (nissan) త్వరలో భారతీయ మార్కెట్లో తన ఆటోమోటివ్ శక్తిని మరింత పెంచనుంది. క్రమంగా వాహన పరిశ్రమలో పోటీ ఎక్కువ అవుతున్న తరుణంలో ఇతర కంపెనీలకు ఎదుర్కొని వాటికి ధీటుగా అమ్మకాల్లో దూసుకుపోవడానికి కొత్త మోడళ్ల లాంచ్ అవసరం ఉన్న నేపథ్యంలో మరిన్ని కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. నిస్సాన్ కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో మాగ్నైట్ ( Magnite), X-ట్రైల్(X Trail) SUVలను మాత్రమే అందిస్తుంది. అయితే మాగ్నైట్ మాత్రమే భారతీయ మార్కెట్లో గణనీయమైన అమ్మకాలను సాధిస్తుండగా, పూర్తిగా దిగుమతి చేయబడిన X-ట్రైల్ ప్రజల నుంచి తక్కువ ఆదరణను పొందుతుంది. దానికి ప్రధాన కారణం ధర ఎక్కువగా ఉండటమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన మోడల్ లైనప్‌ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

భారత మార్కెట్లో తన ప్రస్థానాన్ని మరింత విస్తరించేందుకు నిస్సాన్ భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. నిస్సాన్ కంపెనీ ఇటీవల కొత్త కార్లకు సంబంధించిన టీజర్ ఫొటోలను విడుదల చేయడంతో వీటిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. వీటి రాకతో రాబోయే రెండేళ్లలో కంపెనీ విక్రయించే మోడళ్ల సంఖ్య నాలుగుకు చేరనుందనే వార్త ఇప్పటికే కస్టమర్లలో ఆసక్తిని పెంచింది. ఈ కార్లలో ఒకటి బి-సెగ్మెంట్ 7-సీటర్ MPV మోడల్ ఉంటుందని తెలుస్తుంది.

Nissan Teased Two New Cars

ఈ కొత్త మోడల్, ప్రస్తుతం విజయవంతంగా అమ్ముడవుతున్న రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా ఉండనుందని సమాచారం. దీనికి ప్రధాన కారణ రెనాల్ట్-నిస్సాన్ కంపెనీలు చాలా కాలంగా ఒక పొత్తులో ఉన్నాయి. అందుకే ట్రైబర్ ప్రేరణతో నిస్సాన్ తన కొత్త ఎంపీవీని తీసుకొస్తుందని తెలుస్తుంది. ఈ 7-సీటర్ కారు భారత కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినందున, మార్కెట్లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ, ఆకట్టుకునే డిజైన్‌తో వస్తుందని అంచనా.

నిస్సాన్ భారత మార్కెట్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు తన కొత్త 7-సీటర్ MPVని 2+3+2 కాన్ఫిగరేషన్ కలిగిన మూడు వరుసల సీటింగ్ అమరికతో విడుదల చేయబోతుంది. దేశంలో ఇటీవల పెద్ద కుటుంబ ప్రయాణాలు ఎక్కువగా అయ్యాయి. అందరు కలిసి ఒకే కారులో సౌకర్యంగా వెళ్తుంటే ఆ మజాయే వేరు. హాయిగా ఆడుతూ, పాడుతూ ప్రయాణించవచ్చు. ఈ కారులో ఏకంగా 7 మంది కలిసి సాఫీగా ప్రయాణించవచ్చు.

Renault Triber

కొత్త MPV రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా రూపొందించబడినప్పటికీ, ఇది మరింత స్పోర్టీ, దూకుడు లుక్స్ కలిగి ఉండేలా నిస్సాన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. టీజర్ ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం, ఈ కారు పెద్ద ఫ్రంట్ గ్రిల్, అన్ని కార్లకు ఉన్నట్టుగానే హెడ్‌లైట్లు, అలాగే కింద బంపర్‌పై ప్రత్యేక C-ఆకారపు వెండి డిజైన్ హైలైట్‌గా నిలుస్తాయి. కారు బోనెట్‌ను మరింత కాంపాక్ట్‌గా చేశారు. క్యాబిన్‌లో ప్రయాణికులకు తగినంత స్థలం ఉంటుంది.

ప్రస్తుతం రెనాల్ట్ ట్రైబర్ ధర రూ. 6.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉంది. ఈ నేపథ్యంలో నిస్సాన్ తన కొత్త MPV కూడా దాదాపు అదే ధర పరిధిలో విడుదల అయ్యే అవకాశముంది. తక్కువ బడ్జెట్‌లో 7-సీటర్ ఫ్యామిలీ కారు కోరుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ కానుంది. దీంతో పాటు నిస్సాన్ ఇండియాకు కాంపాక్ట్ SUV ని తీసుకువస్తుంది. ఇది డస్టర్ మాదిరిగానే శక్తివంతమైన డిజైన్‌తో వస్తుంది.

Renault Duster

దీని ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో క్లాస్-లీడింగ్ గ్రిల్‌తో ప్రీమియం ఫినిషింగ్, అద్భుతమైన విజిబిలిటీ కోసం 'L' ఆకారపు LED DRLలు, మెరుగైన లుక్స్, స్టైల్ అందించే క్రోమ్ హైలైట్‌లు, సొగసైన LED హెడ్‌లైట్‌లు వంటి వాటిని ఈ కారు కలిగి ఉంది. సమాచారం ప్రకారం, ఈ కాంపాక్ట్ SUV ని 2027 లో అమ్మకానికి విడుదల చేస్తారని తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 27, 2025, 17:40 [IST]
English summary
Nissan teased triber based 7 seater mpv and new compact suv car will be launch soon in india
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+