క్రెటాకు చెక్ పెట్టేందుకు నిస్సాన్ మాస్టర్ ప్లాన్.. కొత్త టెక్టన్ ఎస్యూవీ డిజైన్ రిలీజ్..ఎప్పుడు వస్తుందంటే ?
ఇండియన్ మార్కెట్లో కొన్ని సంవత్సరాలుగా వెనుకబడిన నిస్సాన్ మోటార్ ఇండియా ఇప్పుడు సరికొత్త ఎస్యూవీతో గట్టిగా రీఎంట్రి ఇచ్చేందుకు రెడీ అవుతుంది. కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సి-సెగ్మెంట్లోని ఫైవ్ సీటర్ ఎస్‌యూవీ నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton) ను నేడు (అక్టోబర్ 7, 2025) అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ ప్లాన్ చేసిన మూడు కొత్త మోడళ్లలో ఈ టెక్టాన్ కూడా ఒక భాగం. దీని ద్వారా నిస్సాన్ దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని చూస్తోంది.

నిస్సాన్ టెక్టాన్ వచ్చే ఏడాది అంటే 2026 జూన్-జూలై నెలల్లో భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, టాటా హారియర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి పాపులర్ ఎస్యూవీలతో పోటీపడుతుంది. దీని ప్రారంభ ధర రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. ఈ ఆకర్షణీయమైన ధర టెక్టాన్‌ను మాస్-మార్కెట్ సెగ్మెంట్‌లో బెస్ట్ ఆప్షన్‌గా నిలబెట్టే అవకాశం ఉంది.

టెక్టాన్ డిజైన్ నిస్సాన్ ఇంటర్నేషనల్ టైమ్‌లెస్ జపనీస్ ఫ్యూచరిజం థీమ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని వల్ల కారు అడ్వెంచరస్, అడ్వాన్సుడ్ లుక్ సంతరించుకుంది. ముందు భాగంలో, క్రోమ్ ఎక్సెంట్స్‌తో మెరిసే వి-మోషన్ గ్రిల్ ఉంది. పల్చగా, ఫార్పుగా ఉండే LED హెడ్‌ల్యాంప్స్ రాత్రి వేళ డ్రైవింగ్‌కు అద్భుతమైన విజిబిలిటీ ఇస్తాయి.
సైడ్ ప్రొఫైల్‌లో బోల్డ్ వీల్ ఆర్చెస్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ మస్కులర్ లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్‌లైట్‌లు, డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లు ప్రీమియం అనుభూతినిస్తాయి. దీని పొడవు సుమారు 4.3 మీటర్లు, వెడల్పు 1.8 మీటర్లు, వీల్‌బేస్ 2.67 మీటర్లు ఉండటంతో, ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పెద్ద కారుకు ఉండే సౌకర్యాన్ని ఇస్తుంది.

టెక్టాన్ ఇంటీరియర్ కూడా నిస్సాన్ గ్లోబల్ డిజైన్‌ను అనుసరిస్తూ టెక్-సావి కేబిన్‌తో వస్తుంది. సెంట్రల్ కన్సోల్‌లో 10-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ను సపోర్ట్ చేస్తుంది. డ్రైవర్ కోసం 7-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది.
సీటింగ్‌లో లెదరెట్ అప్‌హోల్‌స్ట్రీ, వెనుక AC వెంట్స్, 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్లు ఉన్నాయి. ఇవి 500 లీటర్లకు పైగా బూట్ స్పేస్‌ను అందిస్తాయి. సేఫ్టీ ఫీచర్ల విషర్ల విషయానికి వస్తే.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, హిల్ హోల్డ్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, ADAS లెవల్-2 (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్) వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. మాగ్నైట్ నుంచి తీసుకున్న 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (100 PS, 160 Nm) స్టాండర్డ్‌గా ఉంటుంది. దీనితో పాటు, మరింత పవర్ఫుల్ 1.3-లీటర్ టర్బో పెట్రోల్ (155 PS), లీటరుకు 20 కి.మీకు పైగా మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్ మోటార్) వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది.
బేస్ వేరియంట్‌లకు సీఎన్‌జీ ఆప్షన్ కూడా రావచ్చు. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, సీవీటీ, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. 205 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా, ఇది భారతీయ రహదారులపై సులభంగా నడవగలదు.


Click it and Unblock the Notifications








