డ్రైవర్ అవసరమే లేదు.. ప్రమాదాలకు ఛాన్సే లేదు... ఆటోమెటిక్ కార్లను తీసుకొస్తున్న నిస్సాన్

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) తన తదుపరి తరం ప్రోపైలట్ టెక్నాలజీని (next generation ProPILOT technology) 2027 ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తదుపరి తరం లిడార్, వేవ్ ఏఐ (Lidar and Wayve AI) డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌తో నిస్సాన్ గ్రౌండ్ ట్రూత్ పర్సెప్షన్ టెక్నాలజీని పరిచయం చేస్తోంది.

ఈ టెక్నాలజీ ద్వారా మెరుగైన ప్రమాదాలను నివారించే కెపాసిటీతో ఆటోమేటిక్ (Autonomous driving) రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకురానున్నట్లు తెలిపింది. ఇంతకీ ఈ కొత్త టెక్నాలజీ ఏమిటి? నిస్సాన్ ఎలా షాక్ ఇవ్వనుంది? పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Nissan Magnite

వేవ్ అంటే ఏమిటి?: వేవ్ అనేది గ్లోబల్ ఏఐ కంపెనీ. లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఇది డ్రైవింగ్ కోసం రూపొందించిన ఏఐ ఫౌండేషన్ మోడల్. దీని ఏఐ ఫౌండేషన్ మోడల్‌ను అధిక భద్రత, విశ్వసనీయతతో నగరం, రహదారులపై పాయింట్-టు-పాయింట్ డ్రైవింగ్‌ను ప్రారంభించడానికి కస్టమ్ జెన్ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తారు.

ఈ సాఫ్ట్‌వేర్ భారీ మొత్తంలో రియల్ వరల్డ్ ఎక్సీపీరియన్స్ పై ట్రైనింగ్ పొంది ఉంటుంది. వేవ్ ఏఐ ఫౌండేషన్ మోడల్‌లో నిర్మించిన వేవ్ ఏఐ డ్రైవర్ సాఫ్ట్‌వేర్, మనుషుల వలె మరింత సంక్లిష్టమైన డ్రైవింగ్ పరిస్థితులను సులభంగా మెయింటెన్ చేసేందుకు రూపొందించారు. ఈ సెటప్ వాహనాలకు ప్రమాదాలను నివారించడానికి, రహదారిపై స్వంతంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

Nissan

అపారమైన డేటా నుంచి సమర్థవంతంగా, వేగంగా నేర్చుకునే టెక్నాలజీ కెపాసిటీ భవిష్యత్తులోని నిస్సాన్ వాహనాలకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ తన స్వయం చోదక (Autonomous driving) టెక్నాలజీ విస్తృత వినియోగాన్ని వేగవంతం చేయడానికి కొత్త దృశ్యాలకు అనుగుణంగా మారడంలో అత్యుత్తమమైనదని నిస్సాన్ తెలిపింది.

ముందుగా నిర్ణయించిన నియమాలు లేదా మ్యాప్‌లపై మాత్రమే ఆధారపడే బదులు, రియల్ వరల్డ్ డ్రైవింగ్ ఎక్సీపీరియన్స్ ద్వారా శిక్షణ పొందిన AI (కృత్రిమ మేధస్సు)లో నైపుణ్యం కలిగిన యూకే ఆధారిత AI కంపెనీ వేవ్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సు ఏకీకరణ కొత్త వ్యవస్థకు కేంద్రంగా ఉంటుంది.

Nissan Rare

నిస్సాన్ ప్రకారం, వేవ్ ఏఐ డ్రైవర్ సాఫ్ట్‌వేర్ ఒక ఫౌండేషన్ మోడల్ ద్వారా పవర్ పొందుతుంది. ఇది భారీ మొత్తంలో డ్రైవింగ్ డేటా నుంచి నేర్చుకుంటుంది. ఇది నగరం ట్రాఫిక్ లేదా మారుతున్న రహదారి పరిస్థితుల వంటి సంక్లిష్టమైన, ఊహించని పరిస్థితులకు త్వరగా స్పందించే విధంగా రూపొందించారు. దీని వల్ల తన భవిష్యత్తులో తీసుకురానున్న వాహనాలకు మరింత సేఫ్టీని అందిస్తుందని నిస్సాన్ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా అనేక గ్లోబల్ వాహన తయారీదారులతో సహకరిస్తున్న వేవ్ కంపెనీ, తన సాఫ్ట్‌వేర్ నగరం, రహదారి పరిసరాల్లో పాయింట్-టు-పాయింట్ ఆటోమేటిక్ పవర్ ని కలిగిస్తుంది. వివిధ వాహన ప్లాట్‌ఫారమ్‌లలో స్కేల్ చేయడానికి నిర్మించబడిందని కంపెనీ పేర్కొంది. నిస్సాన్ కారు ఇప్పటికే భారత మార్కెట్లో మంచి స్థానం సంపాదించుకుంది. ఈ టెక్నాలజీ కూడా వస్తే మిగతా కార్ల కంపెనీలకు భారీ షాక్ అనే చెప్పాలి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 17, 2025, 17:16 [IST]
English summary
Nissans game on shocks all carmakers with high tech autonomous driving
Read more on: #nissan #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+