దేశం మొత్తం ఆశగా ఎదురు చూస్తున్న కారు ఇదే.. కేవలం రూ.6లక్షలకే 7 సీటర్ ఎంపీవీ.. మార్కెట్లో బీభత్సం ఖాయం
ఇండియన్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి నిస్సాన్ కంపెనీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మాగ్నైట్ ఎస్‌యూవీ అమ్మకాలపైనే ఆధారపడిన నిస్సాన్, తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి మరిన్ని మాస్ మార్కెట్ కార్లను తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా, తక్కువ ధరలో ఉండే ఒక కొత్త 7-సీటర్ ఎంపీవీని త్వరలో విడుదల చేయబోతోంది.
ఈ కొత్త ఎంపీవీ మాతృసంస్థ రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా తయారవుతుందని తెలుస్తోంది. ఈ కొత్త 7-సీటర్ ఎంపీవీ ఇటీవల తమిళనాడు రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది. కేవలం రూ.6 లక్షల ప్రారంభ ధర అంచనాతో వస్తున్న ఈ కారు వివరాలు, ఫీచర్లు, మార్కెట్ అంచనాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం నిస్సాన్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో మాగ్నైట్ ఎస్‌యూవీపై మాత్రమే ఆధారపడింది. మాగ్నైట్ నెలకు 1500 నుండి 2000 యూనిట్ల అమ్మకాలను అందిస్తోంది. టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి పోటీగా తీసుకొచ్చిన ఎక్స్-ట్రైల్ మోడల్ ధర కారణంగా మార్కెట్లో పెద్దగా విజయం సాధించలేకపోయింది.
గత నాలుగు నెలల్లో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. ఈ నేపథ్యంలో నిస్సాన్ తమ అమ్మకాలు, మార్కెట్ వాటాను పెంచుకోవడానికి తక్కువ ధరలో ఉండే మాస్ మార్కెట్ కార్లను, ముఖ్యంగా ఒక కొత్త ఎంపీవీ, ఎస్‌యూవీని తీసుకురావాలని నిర్ణయించింది.

నిస్సాన్ తీసుకురాబోతున్న కొత్త ఎంపీవీ తమ భాగస్వామ్య సంస్థ రెనాల్ట్ ట్రైబర్ కారు ఆధారంగా రీ-బ్యాడ్జ్ చేయబడుతుంది. అంటే, కొన్ని డిజైన్ మార్పులు మినహా దాదాపు ట్రైబర్ లాగే ఉంటుంది. ఇటీవలే ఈ కొత్త 7-సీటర్ ఎంపీవీ తమిళనాడు రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పూర్తిగా కవర్ చేయబడి ఉన్నప్పటికీ, నిస్సాన్ ఎంపీవీ ఇండియన్ రోడ్లపై టెస్ట్ చేయడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.
కొత్త నిస్సాన్ ఎంపీవీ, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఫేస్‌లిఫ్ట్ రెనో ట్రైబర్‌ను పోలి ఉంటుంది. డిజైన్‌లో కొన్ని మార్పులు మాత్రమే ఉంటాయి. రెనాల్ట్ ట్రైబర్‌కు భిన్నంగా ఉండేలా నిస్సాన్ ఈ మోడల్‌కు కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు బంపర్‌ను అందిస్తుంది. నిస్సాన్ కొత్త డిజైన్ ఫిలాసఫీ ప్రకారం.. మోడల్ పేరును బోనెట్‌పై అక్షరాలలో రాసి ఉంచుతారు.

ఈ ఎంపీవీకి రెనాల్ట్ ట్రైబర్‌లో ఉన్న 1.0 లీటర్, త్రీ-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే వాడే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 71 బీహెచ్‌పీ శక్తిని, 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నా, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఈ కొత్త నిస్సాన్ ఎంపీవీకి మార్కెట్లో మంచి పోటీ ఇచ్చేలా ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ కారు చెన్నైలోని ప్లాంట్‌లో ఉత్పత్తి చేయబడుతుంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఈ ఎంపీవీ బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లతో రాబోతుందని తెలుస్తోంది. 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండవచ్చు. ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ధరలు జీఎస్టీ తగ్గింపు తర్వాత రూ.5.76 లక్షల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిస్సాన్ ఎంపీవీ ప్రారంభ ధర దాదాపు రూ.6 లక్షలు ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో వస్తే ఎంపీవీ విభాగంలో లీడర్‌గా ఉన్న మారుతి సుజుకి ఎర్టిగాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








